Putin Bathroom : పుతిన్ మల,మూత్రాలు ఎవరికీ దొరక్కుండా జాగ్రత్తలు అందుకేనా..?! ఆయన కోసం వందల జింకల్ని చంపేశారా?!
పుతిన్ సెక్యూరిటీ సిబ్బంది ఆయన మల,మూత్రాలు ఎవరికీ దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటారు.ఆయన విదేశీ ప్రయాణంలో మలమూత్రాలను సేకరించి సూట్ కేసుల్లో భద్రపరిచి రష్యాకు తరలిస్తుంటారు. ఇన్ని జాగ్రత్తలు ఎందుకు? అనేవిషయమే హాట్ టాపిక్ గా ఉంది.

Putin’s Bodyguards Collect His Poop : పుతిన్ అంటే నియంత. జర్మన్ నియంత హిట్లర కు మరో రూపం అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాక్ ఇది. పుతిన్ కు సంబంధించిన ఏవిషయం అయినా ఇట్టే వైరల్ అయిపోతుంది.ఆయన ఆరోగ్య విషయంలో కూడా అంతే. పుతిన్ కు రకరకాల వ్యాధులు వచ్చాయంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంట్లో ఏది నిజం? పుతిన్ హెల్త్ కండిషన్ ఏంటి? పుతిన్‌కు క్యాన్సర్ వచ్చింది.. మూడేళ్ల కంటే ఎక్కువ బతకడు అంటారు కొంతమంది. పుతిన్ మొహం చూశారా? కళ్లు కనిపించట్లేదు. ఆయన స్పీచ్ విన్నారా? ఒక్క మాట కూడా అర్థం కానంతగా తడబడుతున్నారు. రెండు చేతులూ వణికిపోతున్నాయి. మతిమరుపు కూడా వచ్చింది. ఇన్ని రోగాలొచ్చాయంటే చావు మూడినట్లే.. మూడేళ్లు కూడా బతికే ఛాన్సే లేదంటారు ఇంకొంతమంది.
ప్రత్యర్థుల ప్రచారం ఈ రేంజ్‌లో ఉంటే.. రష్యా మాత్రం అదేమీ లేదన్నట్టు కొట్టిపారేస్తోంది. మావోడు మొగోడు.. పర్‌ఫెక్ట్‌లీ ఆల్‌రైట్. జూడో లాంటి మార్షల్ ఆర్ట్‌లో ఎక్స్‌పర్ట్. 70 ఏళ్లు వచ్చినా కత్తిలా ఉంటాడు. ఆయన ఫిజిక్ ముందు హీరోలు కూడా పనికిరారు! అలాంటి లీడర్‌కు హెల్త్ ప్రాబ్లమా? ఛీ..ఛీ.. మీరూ.. మీ చెత్త ప్రచారాలు.. అంటూ ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారు పుతిన్ అనుచరులు. దీంతో ఆయన హెల్త్ గురించి కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతూనే ఉంది. అయినా మనిషన్నాక ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ కామన్. 70ఏళ్లు దాటాయంటే కంపల్సరీగా ఏదో ఒక రోగం వస్తుంది. పుతిన్ గ్రేట్.. గ్రేటర్.. గ్రేటెస్ట్ కావొచ్చు! అయితే మనిషి కాడా? రోగాలు రావా? వాటికి ట్రీట్‌మెంట్ తీస్కోడా? బయటకు చెప్తే తప్పేంటి? అంటూ కామన్‌మెన్ క్వశ్చన్ చేయొచ్చు. కానీ.. పుతిన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటో బయటకు చెప్తే.. ఆయన ప్రాణాలకు ముప్పు రావొచ్చు. అందుకే ఆయన మల, మూత్రాలు కూడా ఎవరికీ దొరక్కుండా జాగ్రత్త పడుతున్నారు.
పుతిన్ పార్కిన్‌సన్‌తో గానీ.. క్యాన్సర్‌తో గానీ బాధపడుతున్నారంటూ వెస్ట్రన్ మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. తాజాగా విక్టరీ డే సందర్భంగా.. మాస్కో రెడ్ స్క్వేర్ వద్ద నిర్వహిస్తున్న మిలిటరీ పరేడ్‌లో పుతిన్ దిగిన ఓ ఫొటో.. ఆయన ఆరోగ్యంపై మరిన్ని సందేహాలు రేకెత్తించేలా ఉంది. ఆ ఫొటోలో ఆయన మందంగా ఉన్న దుప్పటితో కాళ్లను కప్పుకుని కనిపించారు. దీంతో ఆయన ఆరోగ్యంపై వస్తున్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అలాగే యంగ్‌గా కనిపించేందుకు స్టెరాయిడ్స్ తీసుకున్నారని.. వాటితో పుతిన్ బ్రెయిన్‌పై దెబ్బ పడిందన్న ప్రచారాలు కూడా ఉన్నాయి.
ఇటీవల దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన సందర్భాల్లో పుతిన్ నడవడిక, వైఖరిని బట్టి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. పుతిన్ చేతులు వణుకుతుండడంతోపాటు ఆయన ముఖం కాస్మోటిక్ సర్జరీ చేసినట్టుగా కనిపిస్తోందంటున్నారు. కణతలు, చెంపలపై ముడతలతో పాటు గడ్డం, కనురెప్పలకు కాస్మోటిక్ సర్జరీ చేయించుకుంటున్నారని చాలా పత్రికలు వార్తలు రాశాయి. గట్టి మనిషిననే పబ్లిసిటీతోపాటు వయసు కనబడనీయకుండా ఈ సర్జరీలు చేయించుకున్నారని చెప్పుకొచ్చాయి. ఈ ఏడాది అక్టోబరులో 70వ పుట్టినరోజు జరుపుకోనున్న పుతిన్.. మరో మూడేళ్లకు మించి బతకడని డాక్టర్లు తేల్చినట్లు చెప్పుకుంటున్నారు. కానీ ఈ వార్తలన్నీ ఫేక్ అని కొట్టిపారేశారు రష్యా విదేశాంగ శాఖ మంత్రి లావ్రోవ్. పుతిన్ దాదాపు ప్రతిరోజూ టీవీల్లో కనిపిస్తున్నారని.. కావాలంటే వాటిలో ఆయన్ను చూడొచ్చని తేల్చి చెప్పారు.
పుతిన్ హెల్త్ గురించి ఎన్ని పుకార్లు వచ్చినా.. ఒక్కటి మాత్రం బాగా హైలైట్ అయింది. పుతిన్‌కు థైరాయిడ్ క్యాన్సర్ వచ్చిందని.. ప్రాణాలు కాపాడుకోవడానికి జింక రక్తంతో స్నానం చేస్తున్నాడని బాగా ప్రచారం జరిగింది. 2016 నుంచి 2019 వరకు జింక కొమ్ముల నుంచి తీసిన రక్తంతోనే పుతిన్ బాడీని తడిపేస్తున్నాడని.. ఏకంగా 166 రోజులపాటు ఇలా చేశాడన్న టాక్ వరల్డ్ వైడ్‌గా ఉంది. ఇందుకోసం వందల జింకల్ని చంపేశారని పుతిన్ ప్రత్యర్థులు ప్రచారం చేశారు. 166 రోజులపాటు పుతిన్ ప్రపంచానికి కనిపించలేదని.. ఆయనకు క్యాన్సర్ వచ్చిందని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలన్నారు. ఎవరెన్ని మాట్లాడుకున్నా.. ఏం మాట్లాడుకున్నా.. పుతిన్ కానీ.. ఆయన కుటుంబం కానీ.. ఎప్పుడూ రియాక్ట్ కాలేదు. మీకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుకోండంటూ వదిలిపెట్టేసింది. ఇప్పుడు పుతిన్ మల, మూత్రాలు ఎవరికీ దొరక్కుండా దాచిపెడుతున్నారని విషయం బయటకు రావడంతో.. ఆయన హెల్త్ ఇష్యూ వరల్డ్ వైడ్‌గా హాట్ టాపిక్ అయ్యింది.
1Viral Video: ఆమె 73ఏళ్ల వృద్ధురాలు కాదు.. 73ఏళ్ల యంగ్ లేడీ.. ఈ వీడియోచూస్తే మీరూ అలానే అంటారు..
2Jagannath Rath Yatra 2022 : పూరి జగన్నాథుడి రథయాత్ర నేడే
3OTT Releases : జులై 1న ఒకేసారి బోల్డన్ని ఓటీటీ రిలీజ్లు.. ఆహాలో భయపెట్టబోతున్న ‘అన్యాస్ ట్యుటోరియల్’
4AP Government: టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆ పరీక్షల్లో పాసైతే చాలు ..
5Narednra Modi : తెలంగాణాలో మోదీ ఫీవర్
6TS TET Results 2022: నేడు టెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
7Chiranjeevi : కృష్ణవంశీ కోసం కవిత్వాలు చదువుతున్న మెగాస్టార్..
8Single-Use Plastic Ban: నేటి నుంచి ఈ వస్తువులు బ్యాన్.. వాడారో.. ఫెనాల్టీ కట్టాల్సిందే..
9Amitabh Bachchan : హైదరాబాద్ మెట్రోలో అమితాబ్.. ప్రాజెక్టు K షూటింగ్..
10BJP vs TRS : బీజేపీ కి షాక్…కారు ఎక్కిన కమలం కార్పోరేటర్లు
-
The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
-
Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!
-
Moto G62 : మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్షిప్ 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?
-
NTR: ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు.. ఇక దూకుడు షురూ!
-
iOS16 Beta Update : iOS 16 beta అప్డేట్తో సమస్యలా.. iOS 15కు మారిపోండిలా..!
-
Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!
-
Dasara: ‘దసరా’ ఉందంటూ బ్రహ్మీ మీమ్‌తో డైరెక్టర్ గట్టిగానే ఇచ్చాడుగా!