China-Africa : ఆఫ్రికా ఖండంలో ఉన్న లిథియంపై చైనా కన్నేసిందా? లిథియం నిల్వలను కారుచౌకగా కొట్టేసేందుకే కుట్రలు చేస్తోందా?

చైనా ఆఫ్రికాను తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాలు చేయడానికి కారణమేంటి? ఆఫ్రికా ఖండంలో ఉన్న లిథియం నిల్వలపై చైనా కన్నేసిందా? లిథియం నిల్వలను కారుచౌకగా కొట్టేసేందుకే చైనా కుట్రలు చేస్తోందా? చైనా ప్రైవేటు సైన్యం వెనుక అసలు మతలబు ఏంటి?

China-Africa : ఆఫ్రికా ఖండంలో ఉన్న లిథియంపై చైనా కన్నేసిందా? లిథియం నిల్వలను కారుచౌకగా కొట్టేసేందుకే కుట్రలు చేస్తోందా?

China Looks To Africa In Race For Lithium (3)

China Focus on the Continent of Africa: చైనా ఆఫ్రికాను తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాలు చేయడానికి కారణమేంటి? ఆఫ్రికా ఖండంలో ఉన్న లిథియం నిల్వలపై చైనా కన్నేసిందా? లిథియం నిల్వలను కారుచౌకగా కొట్టేసేందుకే చైనా కుట్రలు చేస్తోందా? చైనా ప్రైవేటు సైన్యం వెనుక అసలు మతలబు ఏంటి?

ప్రపంచ మార్కెట్ అంతా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వెంట పరుగులు తీస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో కీలకమైంది బ్యాటరీ. అవును లిథియం అయాన్ బ్యాటరీలతోనే ఎలక్ట్రిక్ వాహనాలు పని చేస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా 80శాతం లిథియం అయాన్ బ్యాటరీలను సరఫరా చేస్తోంది చైనా. రానున్న రోజుల్లో పెరిగిపోయే డిమాండ్‌కు తగ్గట్టుగా బ్యాటరీలను తయారు చేయాలంటే లిథియం ఖనిజ నిక్షేపాలు కావాలి. డిమాండ్‌ పెరగడంతోపాటు లిథియం ఖనిజం విలువ కూడా 500శాతం పెరిగింది. ఈసమయంలో డిమాండ్‌కు తగినట్టు బ్యాటరీలు సప్లై చేయాలంటే పుష్కలంగా లిథియం ఖనిజ నిక్షేపాలు కావాలి. అందుకే లిథియం ఖనిజనిక్షేపాలు భారీగా ఉన్న ఆఫ్రికా ఖండంలోని దేశాలపై కన్నేసింది చైనా. ముఖ్యంగా ఆఫ్రికాలోనే అత్యధికంగా లిథియం ఖనిజ నిక్షేపాలున్న దేశం జింబాబ్వే. అంతే కాదు ప్రపంచంలోనే లిథియం నిక్షేపాల్లో జింబాబ్వే ఐదోస్థానంలో ఉంది. అందుకే చైనా ఆఫ్రికాలోని జింబాబ్వేపై ఫోకస్ చేసింది.

Also read : China-Africa : చీకటి ఖండంపై డ్రాగన్ కన్ను..ఆఫ్రికాను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాల్లో చైనా

జింబాబ్వేలో త్వరలో మైనింగ్ చేయబోతున్నట్టు చైనా ఇప్పటికే ప్రకటించింది. చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే మైనింగ్ గ్రూప్ జింబాబ్వేలోని బికిత గని నుంచి లిథియం ఖనిజాన్ని సేకరించనున్నట్టు ప్రకటించింది. బికిత గనిలో 11 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలున్నాయనే అంచనాలున్నాయి. సుమారు 180 మిలియన్ డాలర్లు చెల్లించి రెండు కంపెనీలతో అక్కడి ఖనిజ నిక్షేపాలను తవ్వుకునేందుకు ఒప్పందం చేసుకుంది చైనా. అంటే చైనా చేతికి పుష్కలంగా లిథియం నిక్షేపాలు దొరికినట్టే. అంతేకాదు చైనా మైనింగ్‌లో దిగ్గజ కంపెనీగా చెప్పుకునే జిజాంగ్ హోయు కంపెనీ జింబాబ్వేలోని ఓ ప్రైవేటు కంపెనీతో 300 మిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంది. అంటే ఈ ఒప్పందాలతో చైనాలో లిథియం ఖనిజం నిల్వలు ఏడాదికి 4లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకోనున్నాయి. ఇవే కాకుండా ఆఫ్రికా ఖండం మొత్తంలో లిథియం ఖనిజ నిక్షేపాలున్న దేశాలతో చైనా కంపెనీలు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నాయి. వాటి ద్వారా ఏటా మరో లక్ష మెట్రిక్ టన్నుల లిథియంను ఉత్పత్తి చేయనున్నాయి.

Also read : Gopalkrishna Gandhi: రాష్ట్రపతి ఎన్నిక.. తెరపైకి మహాత్మా గాంధీ మనవడి పేరు

ఆఫ్రికాకు తన ప్రైవేటు సైన్యాన్ని అద్దెకు ఇచ్చిన చైనా తన పలుకుబడి పెంచుకుంది. యూరోపియన్ దేశాలు ఆఫ్రికాలో ఉన్న ఆర్థిక పరిస్థితులు, రాజకీయ అనిశ్చితిని చూసి భయపడుతుంటే చైనా మాత్రం అనిశ్చిత పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంది. కారు చౌకగా లిథియం నిక్షేపాలను పోటీ లేకుండా దక్కించుకుంది. కాంగోలో భారీగా ఉన్న లిథియం గనులను కూడా లీజుకు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది చైనా అయితే అక్కడ ఇప్పటికే ఆస్ట్రేలియా కంపెనీ ఉండటంతో దానితో న్యాయపోరాటం చేస్తోంది. చైనా దీర్ఘకాలిక వ్యూహాల ఫలితంగా ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌గా ఉంది. మొత్తానికి చైనా దేశంలో అడుగుపెట్టనా ఏకులా వచ్చి మేకులా తయారవుతోంది. ఇప్పుడు ఆఫ్రికాలో కూడా చైనా ఇలాంటి వ్యూహాలతోనే అక్కడి ఖనిజ సంపదను, మానవ ఉత్పాదక సామర్థ్యాన్ని కారు చౌకగా కొట్టేస్తోంది. రానున్న దశాబ్దాల్లో అక్కడ పనిచేసే మనుషులు తగ్గిపోయినా ఆఫ్రికాలోని మ్యాన్ పవర్‌ను తన అవసరాలకు వాడుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.