China-Africa : చీకటి ఖండంపై డ్రాగన్ కన్ను..ఆఫ్రికాను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాల్లో చైనా

నా ఆఫ్రికాపై కన్నేసింది. అవును ప్రపంచానికి సూపర్ పవర్‌గా అవతరించాలనుకుంటున్న చైనా ఈసారి ఆఫ్రికా ఖండంపై ఫోకస్ చేసింది. అక్కడ చైనా ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీలతో ఆఫ్రికాను తన గుప్పిట్లోకి తెచ్చుకుంటోంది. ఇప్పటికే ఆఫ్రికా ఖండంలోని 13కు పైగా దేశాలు తమ దేశ అంతర్గత భద్రత కోసం చైనా ప్రైవేటు సైన్యంపైనే ఆధారపడుతున్నాయి.. అసలు చైనా ప్రైవేటు సైన్యం ఆఫ్రికాలో ఎందుకు అడుగుపెట్టింది..? అక్కడ దేనిపై గురిపెట్టింది.?

China-Africa : చీకటి ఖండంపై డ్రాగన్ కన్ను..ఆఫ్రికాను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాల్లో చైనా

China Is Trying To Bring Africa Under Control

China-Africa : చైనా ఆఫ్రికాపై కన్నేసింది. అవును ప్రపంచానికి సూపర్ పవర్‌గా అవతరించాలనుకుంటున్న చైనా ఈసారి ఆఫ్రికా ఖండంపై ఫోకస్ చేసింది. అక్కడ చైనా ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీలతో ఆఫ్రికాను తన గుప్పిట్లోకి తెచ్చుకుంటోంది. ఇప్పటికే ఆఫ్రికా ఖండంలోని 13కు పైగా దేశాలు తమ దేశ అంతర్గత భద్రత కోసం చైనా ప్రైవేటు సైన్యంపైనే ఆధారపడుతున్నాయి.. అసలు చైనా ప్రైవేటు సైన్యం ఆఫ్రికాలో ఎందుకు అడుగుపెట్టింది..? అక్కడ దేనిపై గురిపెట్టింది.?

ఎప్పుడు ఏదో ఒక దేశంపై కన్నేసే చైనా ఈసారి ఏకంగా ఆఫ్రికా ఖండంపైనే ఫోకస్ చేసింది. ఆఫ్రికాను చాపకింద నీరులా ఆక్రమించే ప్రయత్నాల్లో ఉంది చైనా. ఆఫ్రికా ఖండంలో ఇప్పటికే పదివేలకు పైగా చైనా కంపెనీలను ఏర్పాటు చేసిన డ్రాగన్ కంట్రీ తన కంపెనీల భద్రతతోపాటు ఆఫ్రికా వాసుల రక్షణ కోసం ప్రైవేటు సైన్యాన్ని పంపుతోంది. అంతర్గత భద్రత విషయంలో అంతగా నైపుణ్యంలేని ఆఫ్రికా దేశాలు చైనా ప్రైవేటు సైన్యం సాయం తీసుకుంటున్నాయి. జింబాబ్వే, కాంగో, టాంజానియా సహా చిన్నా చితక 13కుపైగా దేశాలు చైనా ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీల సాయం తీసుకుంటున్నాయి. ఈ సాయం ద్వారా చైనాకు కూడా తన కంపెనీల భద్రత చూసుకోవడం తోపాటు ఆఫ్రికన్ ప్రజలను దొంగతనాలు, దోపిడీలు, స్థానికంగా తలెత్తే హింసాకాండ నుంచి రక్షిస్తున్నాయి.

ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో పేదరికం తాండవిస్తోంది. నిత్యం అక్కడ ఆకలి కేకలతో చనిపోయేవాళ్ల సంఖ్య కూడా ఎక్కువే. అందుకే ఆ దేశాల్లో దొంగతనాలు, దారిదోపిడీల లాంటి ఘటనలు చాలా జరిగాయి. ఓ చైనా కంపెనీకి చెందిన సీఈఓని కూడా అక్కడ దోపిడి దొంగలు గన్‌తో కాల్చి చంపారు. అందుకే చైనా తన కంపెనీలకు భద్రత కల్పించడంతోపాటు అక్కడి ప్రజలకు కూడా రక్షణ ఇచ్చేందుకు ప్రైవేటు సైన్యాన్ని అద్దెకు ఇస్తోంది. దీని ద్వారా ఆఫ్రికాలో మిలిటరీ నిఘాపెంచడంతోపాటు తన సొంత ప్రయోజనాలను కూడా కాపాడుకునే ప్రయత్నంలో ఉంది అంటే స్వామికార్యం, స్వకార్యం రెండు పూర్తవుతాయని చైనా తన ప్రైవేటు సైన్యాన్ని ఆఫ్రికా దేశాలకు అద్దెకు ఇస్తోంది.

చైనా ప్రైవేటు సెక్యూరిటీ అంతర్గత భద్రతకే కాదు ఆఫ్రికా ఖండం చుట్టూ ఉన్న సముద్రతీరాన్ని కూడా రక్షిస్తోంది. సముద్రమార్గంలో జరిగే దొంగతనాలను, కిడ్నాప్‌లను అడ్డుకోవడానికి చైనా ప్రైవేటు సైన్యం పనిచేస్తోంది. అంతేకాదు ఆఫ్రికాలోని సైన్యానికి శిక్షణ ఇవ్వడంతోపాటు భారీ ఎత్తున ఆయుధాలను కూడా ఆఫ్రికా దేశాలకు సరఫరా చేస్తోంది చైనా. అమెరికా రక్షణ విభాగం అంచనా ప్రకారం 13కిపైగా దేశాలకు చైనా తన ప్రైవేటు సైన్యాన్ని సరఫరా చేస్తోంది. అంతేకాదు ఆఫ్రికాలో ఓ నావల్ బేస్ కూడా ఏర్పాటు చేసి దాన్ని ర్యాపిడ్ రియాక్షన్ ఫోర్స్ పహారా కాస్తోంది. గత ఏడాది నావల్ బేస్ ఏర్పాటు చేస్తున్నట్టు అధికారికంగానే ప్రకటించింది చైనా. అంతే కాదు ఈ ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలను రష్యా కూడా ఆఫ్రికాలో తన కంపెనీల భద్రత కోసం ఉపయోగించుకుంటోంది. అంటే ఆఫ్రికా ఖండానికి భద్రత కల్పిస్తున్నామనే ముసుగులో పూర్తిగా ఆ దేశాలను తన చెప్పుచేతల్లో ఉండేలా చేసుకుంటోంది. అక్కడ కంపెనీలతో ఇప్పటికే ఆర్థిక వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్న చైనా ఇప్పుడు ప్రైవేటు సైన్యంతో ఆఫ్రికా దేశాల రక్షణను కూడా తన చెప్పుచేతల్లో పెట్టుకుంది.

ఇంత భారీగా సైన్యాన్ని చైనా ఎందుకు ఆఫ్రికాకు పంపుతోంది. కేవలం తన కంపెనీల రక్షణ కోసమేనా లేదంటే ఇంకా ఏదైనా ప్రయోజనం ఉందా? చైనీయుల భద్రతతోపాటు అంతకు మించిన ప్రయోజనం ఏదైనా చైనా ఆశిస్తోందా అందుకే డ్రాగన్ కంట్రీ తన సైన్యాన్ని ఆఫ్రికాలో మోహరించిందా ఇలాంటి అనేక అనుమానాలు కలుగుతున్నాయి.