Putin Bathroom : పుతిన్ మల మూత్రాలను సూట్ కేసుల్లో దాచిపెడుతున్న సెక్యూరిటీ సిబ్బంది..!! ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ బాత్రూమ్‌కు వెళ్తే.. బయట ఆయన బాడీ గార్డులు కాపలాగా ఉంటారు. అది సెక్యూరిటీ కోసం కాదు. ఎందుకు అంటే అసలు ట్విస్ట్‌ అక్కడేఉంది.. ఎందుకంటే పుతిన్ బాత్రూమ్ లోవెళ్లిన మలం, మూత్రాన్ని సేకరించి దాచిపెట్టడమే వాళ్ల పని.

Putin Bathroom : పుతిన్ మల మూత్రాలను సూట్ కేసుల్లో దాచిపెడుతున్న సెక్యూరిటీ సిబ్బంది..!! ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Putin Bathroom

Putin Bathroom  : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ విదేశాల పర్యటనకు వెళ్లినప్పుడు ఆయనతో పాటు చాలా మంది బాడీగార్డులు ఉంటారు. వారు పుతిన్ బాత్రూమ్ కు వెళితే కూడానే ఉంటారు.ఎందుకంటే అందులోని కొందరు బాడీగార్డులు మాత్రం పుతిన్‌ మలమూత్రాలను తీసుకెళ్తుంటారు. పుతిన్ విదేశీ పర్యటలకు వెళితే ఆయనఆ మలమూత్రాలను ప్రత్యేక సూట్‌కేసులో జాగ్రత్తగా రష్యాకు తీసుకెళ్తారట..!

మీరు బాత్రూమ్‌కి వెళ్తే ఏం చేస్తారు? ఇదేం పిచ్చి ప్రశ్న అనుకుంటున్నారా? అందరూ చేసేదే చేస్తాం. పనయ్యాక.. హ్యాండ్‌వాష్ చేస్కుని బయటకు వచ్చేస్తాం అంటారా! ఇంత వరకూ ఓకే.. మనం మామూలు మనుషులుం. అందరం అదే చేస్తాం. కానీ.. రష్యా ప్రెసిడెంట్‌ వ్లాదిమిర్‌ పుతిన్‌ బాత్రూమ్‌కి వెళ్తే ఏం జరుగుతుందో తెల్సా? ఈ వీడియోలో ఉన్నది వ్లాదిమిర్‌ పుతిన్‌. రష్యా అధ్యక్షుడు. ఆయన బాత్రూమ్‌ నుంచి బయటకు వస్తున్నారు. ఇందులో స్పెషాలిటీ ఏముందని విసుక్కోకుండా.. మళ్లీ ఒకసారి ఈ వీడియోను స్లో మోషన్‌లో చూడండి.

ఇప్పుడు అర్థమైందా? పుతిన్‌ బాత్రూమ్‌కు వెళ్తే.. బయట ఆయన బాడీ గార్డులు కాపలాగా ఉన్నారు. అయితే ఏంటీ అంటారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్‌. అక్కడున్న బాడీగార్డులు పుతిన్‌ సెక్యూరిటీ కోసం కాదు. ఆయన మలం, మూత్రాన్ని సేకరించి దాచిపెట్టడమే వాళ్ల పని. వింటానికి చీప్‌గా.. చికాకుగా.. ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది అక్షరాలా నిజం. మనుషుల మలం, మూత్రాన్ని టెస్ట్‌ చేస్తే చాలు.. వాళ్ల ఆరోగ్యం ఎలా ఉందో.. ఎలాంటి అనారోగ్య సమస్యలున్నాయో తెల్సుకోవచ్చు. అందుకే ఈ విషయంలో పుతిన్‌ అంత జాగ్రత్తగా ఉంటారు. విదేశాలకు వెళ్లినప్పుడు పుతిన్‌ ఎక్కడ బస చేసినా.. అక్కడున్న బాత్రూంలను వాడరు. ఆయన కోసం ఎప్పుడూ ఒక స్పెషల్‌ టాయిలెట్‌ రెడీగా ఉంటుంది. అందులోనే కార్యక్రమాలన్నీ కానిచ్చేస్తారు. ఆ తర్వాత ఆ మలమూత్రాలను సిబ్బంది సేకరించి.. అక్కడ్నుంచి రష్యాకు తరలించేస్తారు.

వ్లాదిమిర్‌ పుతిన్‌ విదేశాల్లో పర్యటించినప్పుడు ఆయన రక్షణ బాధ్యత ఫెడరల్‌ ప్రొటెక్షన్‌ సర్వీస్‌ చూస్కుంటుంది. పుతిన్‌ మల విసర్జనకు వెళ్లిన ప్రతిసారీ.. ఓ ఏజెంట్‌ వాటిని సేకరించి ఓ ప్రత్యేకమైన ప్యాకెట్‌లో దాచిపెడతారు. అనంతరం వాటిని ఓ సూట్‌కేసులో ఉంచి రష్యాకు తీసుకెళ్తారు. పుతిన్‌ 2019 మే నెలలో ఫ్రాన్స్‌ పర్యటన, 2019 అక్టోబర్‌లో సౌదీ అరేబియాలో పర్యటించినప్పుడు ఈ విషయం బయటపడింది. 2019లో ఫ్రాన్స్‌లో పర్యటన సమయంలో పుతిన్‌ బాత్‌రూమ్‌కు వెళ్లినప్పుడు ఆయన వెంట ఆరుగురు బాడీగార్డులు తోడుగా ఉన్నారు. అందులో ఒక వ్యక్తి చిన్న సూట్‌కేసును తీసుకొని బాత్‌రూమ్‌ నుంచి బయటకు వచ్చినట్లు ఉన్న ఓ వీడియోను ఒక జర్నలిస్టు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

ప్రపంచంలోని అత్యంత కీలక వ్యక్తులందరికీ శత్రువుల నుంచో.. ప్రత్యర్థి దేశాల నుంచో ముప్పు ఉంటుంది. కానీ.. కట్టుదిట్టమైన సెక్యూరిటీని దాటుకుని వారిని టచ్‌ చేయడం కుదరని పని. అందుకే మల మూత్రాల ద్వారా గూఢచర్యం చేస్తుంటారు. వాటిని సేకరించి.. టెస్ట్‌ చేసి.. వారికి ఎలాంటి హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ ఉన్నాయో తేల్చుకుంటారు. ఆ వ్యక్తుల్ని మట్టుబెట్టడానికి అదే యాంగిల్‌లో ట్రై చేస్తుంటారు. విష ప్రయోగాల లాంటివి ప్లాన్‌ చేస్తుంటారు. అందుకే కీలక వ్యక్తుల ఆరోగ్య రహస్యాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు. పుతిన్‌ విషయంలోనూ ఇదే జరుగుతోంది.

ప్రపంచ చరిత్రను చూస్తే.. చాలామంది పెద్దోళ్ల మీద ఇలాంటి గూఢచర్యాలు జరిగాయి. ఒకసారి మావో జెడాంగ్‌ వియన్నాకు వెళ్లినప్పుడు ఆయన మలాన్ని విశ్లేషించి సోవియట్‌ యూనియన్‌కు రిపోర్టులు పంపించారు. కోల్డ్‌వార్‌ సమయంలో తూర్పు జర్మనీలో సోవియట్‌ బలగాలు ఉపయోగించిన టాయిలెట్‌ పేపర్లను బ్రిటిష్‌ నిఘా సంస్థలు జల్లెడ పట్టాయనే వాదన ఉంది. ఈ విషయం తెలిశాక సోవియట్‌ సైన్యానికి టాయిలెట్‌ పేపర్లను ఇవ్వడం మానేశారు. అందుకే.. పుతిన్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.