Why eight months?: కోవిడ్ బూస్టర్ ఎనిమిది నెలలు తర్వాతే ఎందుకు?

రెండు డోసుల వ్యాక్సిన్‌లను వేయించుకోవడం వల్ల కరోనా ఉదృతి నుంచి తప్పించుకునే అవకాశం ఉంది

Why eight months?: కోవిడ్ బూస్టర్ ఎనిమిది నెలలు తర్వాతే ఎందుకు?

Dose

Why eight months?: కరోనాను తట్టుకోవాలంటే, మూడో డోసు కూడా అవసరమే అంటూ నివేదికలు వస్తున్నవేళ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మూలాల ప్రకారం, ఫెడరల్ హెల్త్ ఆఫీసర్స్ రెండవ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్న ఎనిమిది నెలల తర్వాత ప్రజలకు కోవిడ్-19 బూస్టర్‌ డోస్ ఎందుకు అవసరం అవుతుందో? ఆధారాలు సమర్పించేందుకు సిద్ధం అవుతున్నారు.

ఎనిమిది నెలల కాల వ్యవధి తర్వాత ఎందుకు బూస్టర్ డోస్ అవసరమో? కాలక్రమేణా వ్యాక్సిన్‌లు ఎలా నిలిచిపోతాయో? అవి దేశంలో విస్తరిస్తున్న డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొని నిలబడగలవా? అనే విషయాలను చర్చిస్తున్నారు. బూస్టర్‌లు డెల్టా వేరియంట్‌పై ప్రభావం చూపుతాయని, అట్లాంటాలోని ఎమోరీ యూనివర్సిటీ హాస్పిటల్ అసోసియేట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కొలీన్ క్రాఫ్ట్ అన్నారు. డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌లు ఎంత బాగా పనిచేస్తాయో? కాలక్రమేణా వ్యాక్సిన్ సామర్ధ్యం తగ్గిపోతుందా? అనే ప్రశ్నలు మిగిలి ఉండగా.. బూస్టర్‌లు ఎప్పుడు అవసరమవుతాయో? స్పష్టం చేసే విధంగా ముఖ్యమైన ఆధారాలను అందిస్తాయి.

వాస్తవానికి దేశంలో కరోనాకు పూర్వమున్న పరిస్థితులు నెలకొల్పడానికి అందించాల్సిన వ్యాక్సిన్‌ల పరిమాణానికి బ్రిటన్, ఇజ్రాయెల్, అమెరికా లాంటి దేశాలు దగ్గరగా వచ్చినట్లే కనిపిస్తున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియలో పేద, ధనిక దేశాల్లో అసమానతలు బయటపడినా.. గుర్తింపు పొందిన చాలా వ్యాక్సీన్లు సీరియస్ కేసులపై, మరణాల నియంత్రణపై ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి.

మరికొన్ని గుర్తింపు లేని వ్యాక్సీన్లు ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. విస్తృతంగా వ్యాక్సిన్‌ను ప్రారంభించిన మొదటి దేశాలలో ఒకటైన ఇజ్రాయెల్ నుండి పరిమిత పరిశోధన వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇక్కడ ఫైజర్-బయోఎంటెక్ నుండి వ్యాక్సిన్‌ను ఉపయోగించింది. అమెరికా ఔషధ నియంత్రణ అధికారుల నుంచి థర్డ్ బూస్టర్ డోస్‌ను అభ్యర్థించేందుకు ఫైజర్ కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

వైరస్‌ హాని అధికంగా ఉన్న రోగులకు థర్డ్ డోసు వ్యాక్సిన్‌ను అందిస్తున్నట్లుగా చెబుతున్నాయి కంపెనీలు.ఇజ్రాయెల్ కూడా క్యాన్సర్ వ్యాధిగ్రస్థులకు, అవయవ మార్పిడి చేయించుకున్న వారికి, వ్యాక్సీన్ రక్షణ అవసరమైన వారికి థర్డ్ డోస్ టీకాను ఇవ్వడం మొదలు పెట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మూడో డోసును వ్యతిరేకిస్తూ, పేద దేశాలకు వ్యాక్సీన్ డోసులను విరాళంగా ఇచ్చేందుకు ప్రాధాన్యమిస్తోంది.

అయినప్పటికీ ఈ మూడో డోసు అందించడానికి అవసరమైన ప్రయోగాలు గురించి నిపుణుల విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఇటువంటి సమయంలోనే ఎనిమిది నెలల గ్యాప్ తర్వాత బూస్టర్ డోస్ తీసుకుంటే మంచిదని, వేరియంట్ పురోగతి ఇన్‌ఫెక్షన్‌లతో ముడిపడి ఉంది కాబట్టి, పూర్తిగా వ్యాక్సిన్‌లు వేయించుకున్న వ్యక్తులకు వైరస్ సోకినట్లయితే వైరస్ వ్యాప్తి చెందదు కాబట్టి, అందరూ ముందు రెండు డోసుల వ్యాక్సిన్‌లను వేయించుకోవడం వల్ల కరోనా ఉదృతి నుంచి తప్పించుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అయితే, ఎనిమిది నెలల్లో బూస్టర్ షాట్‌లు ఎందుకు సిఫారసు చేయబడతాయో వీరు చెబుతున్నారు. కాలక్రమేణా క్షీణిస్తున్న రోగనిరోధక శక్తి మళ్లీ పెంచేందుకు, చెత్త ప్రభావాలను తగ్గించేందుకు మూడో డోసు సాయపడుతుందని చెబుతున్నారు.