వికీలీక్స్ వ్యవస్థాపకుడు అరెస్ట్!

తన లీక్స్ తో ప్రపంచంలోని అవినీతిపరులను ముప్పుతిప్పలు పెట్టిన వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులైన్ అసాంజేని అరెస్ట్ చేసేందుకు లండన్ తో ఈక్వేడార్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందంటూ విక్సీలీక్స్ ట్వీట్ చేసింది.

  • Published By: veegamteam ,Published On : April 5, 2019 / 09:59 AM IST
వికీలీక్స్ వ్యవస్థాపకుడు అరెస్ట్!

తన లీక్స్ తో ప్రపంచంలోని అవినీతిపరులను ముప్పుతిప్పలు పెట్టిన వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులైన్ అసాంజేని అరెస్ట్ చేసేందుకు లండన్ తో ఈక్వేడార్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందంటూ విక్సీలీక్స్ ట్వీట్ చేసింది.

తన లీక్స్ తో ప్రపంచంలోని అవినీతిపరులను ముప్పుతిప్పలు పెట్టిన వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులైన్ అసాంజేని అరెస్ట్ చేసేందుకు లండన్ తో ఈక్వేడార్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందంటూ విక్సీలీక్స్ ట్వీట్ చేసింది. ఈక్వేడార్ ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి అధికారుల నుంచి తమకు ఈ సమాచారం అందినట్లు వికీలీక్స్ తెలిపింది.INA పేపర్స్ లీక్ చేసి ఆఫ్షోర్ కుంభకోణం బయటపెట్టాడన్న  కారణంతో ఈక్వేడార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అవినీతి కుంభకోణంలో ఈక్వేడార్ ప్రెసిడెంట్ లెనిన్ మొరానో పాత్ర ఉన్నదానికి సంబంధించిన ఐఎన్ ఏ పేపర్లు వికీలీక్స్ లీక్ చేయడమే దీనికి కారణమని తెలిపింది.
Read Also : అవినీతి కోట తలుపులు బద్దలు కొడతా : పవన్

లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు,స్వీడన్ కు అప్పగించబడకుండా ఉండేందుకు 2012 నుంచి అసాంజే లండన్ లోని ఈక్వేడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. అయితే అసాంజే తన ఆశ్రయ నిబంధనలు వరుసగా ఉల్లంఘిస్తున్నాడని రెండు రోజుల క్రితం అధ్యక్షుడు లెనిన్ మొరానో ఆరోపించాడు.అసాంజేని తమ రాయబార కార్యాలయం నుంచి పంపించేందుకు బ్రిటన్ తో ఓ ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్లు తెలిపాడు.అసాంజే,అతని లీగల్ టీమ్ తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అతడు తరచూ ఉల్లంఘిస్తున్నాడని,అతను స్వేచ్ఛగా మాట్లాడకూడదు,అభిప్రాయాలు వ్యక్తం చేయకూడదు తాము భావించడం లేదని,కాకపోతే అతడు అబద్దాలు చెప్పకూడదని మొరానో తెలిపారు.ఆశ్రయ అగ్రిమెంట్ నిబంధనల ప్రకారం..అతడు అకౌంట్స్,ప్రైవేట్ ఫోన్ కాల్స్ హ్యాక్ చేసుకోవచ్చని అన్నారు.ఈ సమయంలో గురువారం వికీలీక్స్ చేసిన ట్వీట్ చేసిన సంచలనంగా మారింది.

 వికీలీక్స్ చేసిన ట్వీట్ పై ఈక్వేడార్ అధికారులు స్పందించారు.అసాంజేని రాయబార కార్యాలయం నుంచి పంపించే విషయానికి సంబంధించి తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఈక్వేడార్ కు చెందిన సీనియర్ అధికారి తెలిపారు.అసాంజేని పంపించివేస్తున్నారంటూ వార్తలు రావడంతో ఆయన ఉంటున్న లండన్ లోని ఈక్వేడార్ ఎంబసీ దగ్గరకు వందలాదిగా చేరుకున్న ప్రజలు ఆందోళనకు దిగారు.

Read Also : పట్టుబడుతున్న కట్టలు : బంజారాహిల్స్ లో మూడున్నర కోట్లు