Zheng Qinwen: నేను అబ్బాయినైతే బాగుండు.. నెలసరి నొప్పి ఆమె ఆశలను ఆవిరిచేసింది
ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది.. ఒక్కొక్కటి అదిగమించుకుంటూ వచ్చింది.. ఆమె కలలుగన్న ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కు కొన్ని అడుగుల దూరంకు వెళ్లింది.. కానీ ఎన్నోఏళ్లుగా కంటున్న కలలు ఒక్కసారిగా ఆమె ఆశలను ఆవిరి చేశాయి. చెప్పుకోలేని బాధను అనుభవిస్తూనే పోరాటాన్ని కొనసాగించింది.

Zheng Qinwen
Zheng Qinwen: ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది.. ఒక్కొక్కటి అదిగమించుకుంటూ వచ్చింది.. ఆమె కలలుగన్న ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కు కొన్ని అడుగుల దూరంకు వెళ్లింది.. కానీ ఎన్నోఏళ్లుగా కంటున్న కలలు ఒక్కసారిగా ఆమె ఆశలను ఆవిరి చేశాయి. చెప్పుకోలేని బాధను అనుభవిస్తూనే పోరాటాన్ని కొనసాగించింది. చివరికి తనకు ఎదురైన సమస్యకు తలొగ్గి ఓటమిని అంగీకరించింది.. వెంటనే ఆమె అన్న మాట ఒక్కటే.. నేను అబ్బాయిని అయితే ఎంత బాగుండు అని. ఆమె ఎవరో కాదు చైనాకు చెందిన 19ఏళ్ల టెన్నిస్ క్రీడాకారిణి క్వినెస్ జెంగ్. వరల్డ్ నవంబర్ 74వ క్రీడాకారిణి.
Hardik pandya: హార్ధిక్ పాండ్యా దశ తిరిగినట్లేనా.. భవిష్యత్ టీం ఇండియా కెప్టెన్ అతడేనట..
చైనా టెన్నీస్ క్రీడాకారిణి క్వినెస్ జెంగ్ ఫ్రెంచ్ ఓపెన్ లో క్వాలిఫయర్ తో పాటు తొలి మూడు రౌండ్లు గెలిచి ఫ్రీ క్వార్టర్స్ లోకి అడుగు పెట్టింది. ప్రపంచ నవంబర్ వన్ ప్లేయర్, పోలెండ్ స్టార్ ఇగా స్వైటెక్ తో సోమవారం తలపడింది. తొలిసెట్ లో స్వైటెక్ కు గట్టి షాకిచ్చింది. హోరాహోరీగా సాగిన తొలి సెట్ లో క్వినెస్ జెంగ్ విజయం సాధించింది. రెండవ సెంట్ లోనూ అదే ఉత్సాహంతో అడుగుపెట్టింది. కానీ ఆమె ఉత్సాహం కొద్దిసేపే కొనసాగింది. అధికశాతం మంది మహిళలను ఇబ్బంది పెట్టే నెలసరి నొప్పి క్వినెస్ జెంగ్ ఆశలను అడియాశలు చేసింది. జెంగ్ కు నెలసరి నొప్పి తీవ్రంగా రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయిన భరించలేని బాధను భరిస్తూనే రెండో సెట్ మొదలు పెట్టింది. కానీ ఆమె పట్టుదలను నెలసరి నొప్పి నెగ్గనివ్వలేదు. రెండవ సెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే కన్వెన్ జెంగ్ నొప్పి భరించలేక ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలిగింది.

Zheng Qinwen
ఆ సమయంలో ఆమె అన్న ఒక్కమాట అందరి హృదయాలను కలిచివేసింది. నేను అబ్బాయి అయితే మ్యాచ్ గెలిచేదాన్ని అంటూ ఉద్వేగానికి గురైంది. రుతుక్రమ సమయంలో మహిళలు పడే ఇబ్బందులు ఎవరికీ అర్థం కావంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కానీ ప్రకృతికి విరుద్ధంగా మనమేం చేయాలేం కాదా.. అంటూ భావోద్వేగానికి గురైంది.