Hardik pandya: హార్ధిక్ పాండ్యా దశ తిరిగినట్లేనా.. భవిష్యత్ టీం ఇండియా కెప్టెన్ అతడేనట..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)2022 టోర్నీ ముగిసింది. ఐపీఎల్‌లో తొలిసారి అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ జట్టు అద్భుత ప్రతిభను కనబర్చి అరంగేట్రంలోనే టైటిల్ ను దక్కించుకుంది. గుజరాత్ టైటాన్స్ లోని ఆటగాళ్లు అసాధారణ ఆటతీరును కనబర్చారు. ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది.

Hardik pandya: హార్ధిక్ పాండ్యా దశ తిరిగినట్లేనా.. భవిష్యత్ టీం ఇండియా కెప్టెన్ అతడేనట..

Hardik Pandya

Hardik pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)2022 టోర్నీ ముగిసింది. ఐపీఎల్‌లో తొలిసారి అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ జట్టు అద్భుత ప్రతిభను కనబర్చి అరంగేట్రంలోనే టైటిల్ ను దక్కించుకుంది. గుజరాత్ టైటాన్స్ లోని ఆటగాళ్లు అసాధారణ ఆటతీరును కనబర్చారు. ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీని పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు. హార్ధిక్ కెప్టెన్సీ స్కిల్స్ కలిగి ఉన్నాడని, టీం ఇండియా భవిష్యత్ కెప్టెన్ గా హార్ధిక్ సరైన వ్యక్తి అంటూ మాజీలు వాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో హార్ధిక్ పాండ్యా దశ తిరిగినట్లేనా, భవిష్యత్ లో టీం ఇండియా కెప్టెన్ పగ్గాలు హార్ధిక్ పాండ్యా అందుకోనున్నాడా అన్న ఆసక్తికర చర్చ క్రికెట్ ప్రేమికుల్లో సాగుతుంది.

IPL 2022 : Gujarat Titans : ఐపీఎల్ విజేత గుజరాత్ టైటాన్స్‌ను సత్కరించిన సీఎం భూపేంద్రభాయ్

ఐపీఎల్‌-2022లో హార్ధిక్‌ పాండ్యా సారథిగా అద్భుతంగా రాణించాడు. ఈ ఏడాది సీజన్‌ లీగ్‌ దశలో 14 మ్యాచ్‌ల్లో 10 విజయాలు సాధించి గుజరాత్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ప్రస్తుత సీజన్‌లో హార్ధిక్‌ బాల్‌తో, బ్యాట్‌తో కూడా అద్భుతంగా రాణించాడు. 15 మ్యాచ్‌లు ఆడిన హార్ధిక్‌ 487 పరుగులతో పాటు, 8 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక రాజస్తాన్‌తో జరిగిన ఫైనల్లో కూడా పాండ్యా మూడు కీలక వికెట్లతో పాటు, 34 పరుగులు సాధించాడు. అటు కెప్టెన్ గా, బ్యాట్స్ మెన్ గా, బౌలర్ గా త్రిపాత్రాభినయం చేశాడు. దీంతో మాజీలు హార్దిక్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక టీం ఇండియా భవిష్యత్ కెప్టెన్ హార్దికే అవుతాడని మాజీలు గంటాపధంగా చెబుతున్నారు.

IPL Final 2022: ఫైనల్ మ్యాచ్‌లో కోపంతో ఊగిపోయిన బట్లర్.. సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్

టీం ఇండియా మాజీ క్రికెటర్ గవాస్కర్ మాట్లాడుతూ.. హార్దిక్ ఖచ్చితంగా భారత జట్టుకు సారథి అవుతాడని, ఇది నా అంచనా మాత్రమే కాదు, అందరి అంచనా కూడా అంటూ వ్యాఖ్యానించారు. హార్ధిక్ ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ను ముందుకు నడిపించడంలో అద్భుత కెప్టెన్సీని ప్రదర్శించాడు. జాతీయ స్థాయిలో జట్టును నడిపించే అవకాశం కూడా అతనికి రావొచ్చు. హార్దిక్ తో పాటు ఇంకో ముగ్గురు నలుగురు పోటీలో అంటూ గవాస్కర్ పేర్కొన్నారు. మరో మాజీ క్రికెటర్ మైఖెల్ వాన్ మాట్లాడుతూ.. కొత్త ప్రాంఛైజీకి ఇది అద్భుతమైన విజయం. ఒకవేళ టీమ్ ఇండియాకు భవిష్యత్ లో కెప్టెన్ అవసరమైతే నేను పాండ్యను కాదని వేరొకరిని చూడలేను అంటూ వ్యాఖ్యానించారు. సంజయ్ మంజ్రేకర్ తో పాటు పలువురు మాజీ క్రికెటర్లు హార్ధిక్ పాండ్యా భవిష్యత్ టీం ఇండియా కెప్టెన్ అవుతాడంటూ పేర్కొన్నారు.