IPL Final 2022: ఫైనల్ మ్యాచ్‌లో కోపంతో ఊగిపోయిన బట్లర్.. సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్

ఐపీఎల్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ భరింతగా సాగుతుంది.. అదీ ఫైనల్ మ్యాచ్ అయితే.. ఇక చెప్పాల్సిన పనిలేదు.. చూసేవాళ్లకు ఎలా ఉన్నా ఆడేవాళ్లకు మాత్రం టెన్షన్ తారాస్థాయికి చేరుతుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఒక్క పరుగైనా ఎంతో అమూల్యమైనదే. ప్లేయర్లుసైతం ఆచితూచి ఆడుతారు...

IPL Final 2022: ఫైనల్ మ్యాచ్‌లో కోపంతో ఊగిపోయిన బట్లర్.. సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్

Ipl Final 2022

IPL Final 2022: ఐపీఎల్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ భరింతగా సాగుతుంది.. అదీ ఫైనల్ మ్యాచ్ అయితే.. ఇక చెప్పాల్సిన పనిలేదు.. చూసేవాళ్లకు ఎలా ఉన్నా ఆడేవాళ్లకు మాత్రం టెన్షన్ తారాస్థాయికి చేరుతుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఒక్క పరుగైనా ఎంతో అమూల్యమైనదే. ప్లేయర్లుసైతం ఆచితూచి ఆడుతారు. ఆదివారం జరిగిన ఐపీఎల్-2022 ఫైనల్ మ్యాచ్ ఆశించిన స్థాయిలో ఉత్కంఠ భరితంగా సాగకపోయినా ఇరు జట్ల ప్లేయర్లు గెలుపుకోసం తీవ్రంగా శ్రమించారు. 2022 ఐపీఎల్ ప్రారంభం నుంచి వీరబాదుడు బాదుకుంటూ వస్తున్న రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ బట్లర్.. ఆ జట్టు ఫైనల్‌కు చేరడంలో కీలక భూమిక పోషించారు. ఇక ఫైనల్ మ్యాచ్ సమయంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు అభిమానులు మొత్తం బట్లర్ పైనే ఆశలు పెట్టుకున్నారు. బట్లర్ పోరాడినప్పటికి ఆశించిన స్థాయిలో పరుగులు రాబట్టలేక అభిమానులను నిరాశపర్చాడు.

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన కొద్దిసేపటికే యశశ్వి జైశ్వాల్, సంజూ సామ్సన్ పెవిలియన్ దారి పట్టారు. అయినా రాజస్థాన్ జట్టు అభిమానులు మాత్రం బట్లర్ పైనే ఆశలు పెట్టుకున్నారు. టోర్నీ ప్రారంభం నుంచి తనకు తారసపడిన బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ పరుగులు రాబడుతూ వచ్చాడు బట్లర్. దీంతో రాజస్థాన్ జట్టు ఫైనల్‌కు చేరడంలో కీలక భూమిక పోషించాడు. ఫైనల్‌లోనూ భారీగా పరుగులు రాబట్టి అభిమానుల కోరిక నెరవేరుద్దామనుకున్నాడు. కానీ అనూహ్య రీతిలో పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. గుజరాత్ టైటాన్స్ జట్టు బౌలర్ హార్థిక్ పాండ్యా బౌలింగ్ లో వ్యక్తిగత స్కోర్ 39వద్ద బట్లర్ కీపర్‌కు క్యాచ్ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు.

IPL 2022: మ్యాచ్ ఫిక్సింగా.. “రాజస్థాన్ స్కోరు అందుకే అలా”

ఔట్ కావటంతోనే అసహనంతో పెవిలియన్‌వైపు అడుగులు వేసిన బట్లర్.. పెవిలియన్ దగ్గరకు రాగానే ఆవేశాన్ని ఆపుకోలేక పోయాడు. కోపంతో హెల్మెంట్‌ను గిర్రున తిప్పి పెవిలియన్ బయటకు విసిరేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను క్రెడిట్ బౌంటీ అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేయడంతో ఆ వీడియో వైరల్ గా మారింది. ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయింది. అయితే బట్లర్ మాత్రం టోర్నీలో ఆరెంజ్ క్యాప్ ను దక్కించుకున్నారు. ఈ సీజన్ లో అత్యధికంగా 863 పరుగులు చేశాడు.