Russia-Ukraine War : రష్యా సైనిక దాడితో.. నిరాశ్రయులుగా మారిన 4.8 మిలియన్ ఉక్రెయిన్ చిన్నారులు

ఉక్రెయిన్‌పై రష్యా సైనికుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నెలరోజులుగా రష్యన్ దళాలు ఉక్రెయిన్‌లోని ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే కీవ్‌తో పాటు పలు పట్టణాలు ...

Russia-Ukraine War : రష్యా సైనిక దాడితో.. నిరాశ్రయులుగా మారిన 4.8 మిలియన్ ఉక్రెయిన్ చిన్నారులు

Russia Ukrein

Russia-Ukraine War :  ఉక్రెయిన్‌పై రష్యా సైనికుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నెలరోజులుగా రష్యన్ దళాలు ఉక్రెయిన్‌లోని ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే కీవ్‌తో పాటు పలు పట్టణాలు స్మశాన దిబ్బలుగా మారాయి. తమ నగరాలను కాపాడుకొనేందుకు ఉక్రెయిన్ సైన్యం కూడా వీరోచితంగా పోరాడుంది. ప్రపంచ దేశాలు ఉక్రెయిన్‌పై రష్యా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ రష్యా ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. రష్యన్ సైనికులు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు విమర్శలొచ్చాయి. రష్యన్ సైనికుల లైంగిక దాడుల ముప్పును తప్పించుకునేందుకు ఉక్రెయిన్ పట్టణంలో ఇవాన్ కివ్ అనేక బాలిక తన జుట్టును చిన్నగా కత్తిరించుకున్న ఘటన సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌గా మారింది.

Russia-ukraine war : యుద్ధ నేరాలకు పాల్పడుతున్న రష్యాను శిక్షించండి..లేదంటే ఐరాసను మూసేయండి : జెలెన్‌స్కీ

మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం దాడులతో అనేక మంది పిల్లలు నిరాశ్రయులుగా మారుతున్నారు. మహిళలపై రష్యా సైనికుల హింస, పిల్లల రక్షణ వంటి విషయాలపై ఐక్య‌రాజ్య సమితిలోని ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. న్యూ‌యార్క్‌లో జరిగిన భద్రతా మండలి సమావేశంలో యుద్ధం ఆగాలని యూఎన్ మహిళా ఏజెన్సీ డైరెక్టర్ సిమా బహఔస్ అన్నారు. రష్యాసైన్యం నుండి ఎదురవుతున్న అత్యాచారం, లైంగిక హింస గురించి ఉక్రెయిన్ మహిళల వ్యాఖ్యలను ఎక్కువగా వింటున్నామని, న్యాయం, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి ఈ ఆరోపణలపై స్వతంత్రంగా దర్యాప్తు చేయాలని అన్నారు. అయితే భద్రతా మండలిలోని ఇతర సభ్యులు చేసిన ఆరోపణలను రష్యా మరోసారి తిరస్కరించింది. యూఎన్‌లోని రష్యన్ డిప్యూటీ రాయబారి డిమిత్రి పాలియన్ స్కీ మాట్లాడుతూ.. అమాయకత్వంపు ఊహాగానాలకు తాము వివరణ ఇవ్వమని అన్నారు. ఉక్రెయిన్ భవిష్యత్తు‌ను కాపాడటానికే ప్రత్యేక సైనిక చర్య అని పాలియన్ స్కీ స్పష్టం చేశారు.

Russia-Ukraine War : శవాల దిబ్బగా యుక్రెయిన్ లోని బుచా నగరం.. వందలాది మంది ఊచకోత..ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు

యూనిసెఫ్‌లోని ఎమర్జెన్సీ ప్రోగ్రామ్‌ల డైరెక్టర్ మాన్యుల్ ఫోంటైన్ కూడా యుధ్దాన్ని ముగించాలని రష్యాకు పిలుపునిచ్చారు. యుద్ధం కారణంగా చిన్నారులు నిరాశ్రయులుగా మారుతున్నారని అన్నారు. 3.2 మిలియన్ల మంది చిన్నారులు తమ ఇళ్లలో ఉండిపోయారని అంచనా అని, వీరిలో దాదాపు సగం మందికి తగినంత ఆహారం లేదని అతను కౌన్సిల్‌కు చెప్పాడు. ఉక్రెయిన్‌లోని 7.5 మిలియన్ల పిల్లలలో మూడింట రెండు వంతుల మంది ప్రస్తుతం ఇతర ప్రాంతాలకు వెళ్లారని, 2.8 మిలియన్లు దేశంలో అంతర్గతంగా వేరే ప్రాంతాల్లో తలదాచుకున్నారని, ఉక్రెయిన్ వెలుపల మరో రెండు మిలియన్ల మంది శరణార్థులుగా ఉన్నారని, మొత్తం 4.8 మిలియన్ల చిన్నారులు నిరాశ్రయులుగా ఉన్నారని ఫాంటైన్ వెల్లడించారు.