Woman Another Pregnant : గర్భం దాల్చిన కొద్దిరోజులకే మరో గర్భం..

ఇంగ్లాండ్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. గర్భం దాల్చిన తర్వాత మహిళ శరీరంలో అండాలు ఉత్పత్తి కావడం అద్భుతమైతే.. కొద్ది రోజుల్లోనే మరో గర్భం దాల్చిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Woman Another Pregnant : గర్భం దాల్చిన కొద్దిరోజులకే మరో గర్భం..

Woman Another Pregnant Just A Few Days After Getting Pregnant

woman Another pregnant : ఇంగ్లాండ్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ గర్భం దాల్చిన కొద్దిరోజులకే మరో గర్భం దాల్చింది. గర్భం దాల్చిన తర్వాత మహిళ శరీరంలో అండాలు ఉత్పత్తి కావడం అద్భుతమైతే.. కొద్ది రోజుల్లోనే మరో గర్భం దాల్చిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. రోజుల తేడాతో పిండాలుగా రూపాంతరం చెందినప్పటికీ.. ఒకే రోజు పుట్టడం, ఇద్దరూ క్షేమంగా ఉండటం వైద్య వర్గాలను సైతం ఆలోచింపజేస్తోంది. మొదట ఒక బిడ్డతో గర్భం దాల్చిన రెబెక్కా రాబర్ట్స్‌.. కొద్ది వారాలకే మరో బిడ్డను కూడా కడుపులో మోస్తున్నట్లు డాక్టర్లు వెల్లడించారు.

పిల్లలు పుట్టడం లేదంటూ అనేక ఆస్పత్రులకు తిరిగిన రెబెక్కా ఎట్టకేలకు గర్భం దాల్చినట్లు తెలుసుకొని సంతోషంలో మునిగిపోయింది. ఆల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌లో ఒక బిడ్డ ఉన్నట్లు రెబెక్కా-రీస్‌ వీవర్స్‌ దంపతులు తెలుసుకున్నారు. అయితే పిండానికి 12 వారాల వయసు ఉన్న సమయంలో మరోసారి పరీక్షలు జరుపగా.. కడుపులో మరో పిండం ఉండటాన్ని డాక్టర్లు గుర్తించారు. దీంతో వైద్యులతోపాటు ఆ దంపతులు కూడా షాక్‌కు గురయ్యారు.

ఇద్దరు బిడ్డల మధ్య కొన్ని వారాల తేడా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇది అరుదైన ఘటనగా పేర్కొన్నారు. మొదట గర్భం దాల్చిన 3, 4 వారాల తర్వాత మరో అండం రెబెక్కా శరీరంలో విడుదలైనట్లు డాక్టర్లు తెలిపారు. అద్భుత రీతిలో అది పిండంగా మారిందని వివరించారు. అయితే చిన్న బిడ్డలో ఎదుగుదల సరిగ్గా లేదని, పుట్టినా ఆమె జీవించి ఉండలేకపోవచ్చేమోనని భావించారు. కానీ గతేదాడి సెప్టెంబర్‌ 17న రెండు నిమిషాల వ్యవధిలో రెబెక్కా ఇద్దరు బిడ్దలకు జన్మనిచ్చింది.

మగబిడ్డ (పెద్దవాడు) 4 పౌండ్ల 10 ఔన్సులు, ఆడబిడ్డ 2 పౌండ్ల 7 ఔన్సుల బరువు ఉన్నారు. ఇద్దరినీ కొద్ది రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచగా ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వారి చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నట్లు రెబెక్కా దంపతులు తెలిపారు.