షాకింగ్… కరోనా బారిన పడిన 80 రోజుల తర్వాత కూడా కొవిడ్ లక్షణాలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి రోజుకో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. ఈ వైరస్

  • Published By: naveen ,Published On : May 27, 2020 / 11:20 AM IST
షాకింగ్… కరోనా బారిన పడిన 80 రోజుల తర్వాత కూడా కొవిడ్ లక్షణాలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి రోజుకో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. ఈ వైరస్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి రోజుకో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. ఈ వైరస్ రోజురోజుకి తన స్వభావం మార్చుకుంటోంది. సైంటిస్టులకు కరోనా పెద్ద మిస్టరీగా మారింది. దీన్ని పూర్తిగా స్టడీ చేయలేకపోతున్నారు. కరోనా వైరస్ గురించి ప్రపంచవ్యాప్తంగా స్టడీ జరుగుతోంది. కంటికి కనిపించని ఈ శత్రువు గురించి అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. 

80 రోజుల తర్వాత కూడా కరోనా లక్షణాలు:
ఈ క్రమంలో కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్ వెలుగుచూసింది. కరోనా బారిన పడిన ఇద్దరు మహిళల్లో 80 రోజుల తర్వాత కూడా కొవిడ్ వైరస్ లక్షణాలు కనిపించడం కలకలం రేపింది. క్వీన్స్ ల్యాండ్ లో ఈ ఘటన జరిగింది. రూబీ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ లో ప్రయాణించిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇక రెండు నెలల క్రితం భారత్ లో పర్యటించిన మరో మహిళ కూడా కరోనా బారిన పడింది. దాదాపు 80 రోజుల తర్వాత వారికి టెస్టులు చేయగా ఇంకా వారిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది చాలా అరుదుగా జరిగే సంఘటన అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామం ఆందోళన కలిగించే విషయం అన్నారు. 

నొప్పులతో బాధపడుతున్న కరోనా బాధితురాలు:
ఇక బ్రిస్బేన్ కు చెందిన డెబ్బీ కిల్ రాయ్ అనే మహిళ మార్చిలో కరోనా బారిన పడింది. అయితే 80 రోజుల తర్వాత కూడా ఆమెలో కొవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. నొప్పులతో బాధపడుతున్న ఆమెకు టెస్టులు చేయగా రిపోర్టులో నెగిటివ్ అని వచ్చింది. కానీ కరోనా వైరస్ లక్షణాలు మాత్రం కనిపించాయి. కరోనా వైరస్ కారణంగా ఆమె దేహానికి తీవ్ర స్థాయిలో నష్టం జరిగి ఉండొచ్చని డాక్టర్లు అభిప్రాయపడ్డారు. 

ఈ కేసు చాలా అరుదు:
చాతిలో నొప్పిగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. తలనొప్పి. ఒళ్లు నొప్పులు కూడా ఉన్నాయని బాధితురాలు వాపోయింది. నొప్పులతో బాధపడుతున్న ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్లింది. కరోనా వైరస్ సోకిన రెండు నెలల తర్వాత కూడా నొప్పులతో బాధపడుతున్న విషయం తెలిసి వారు షాక్ అయ్యారు. ఇది చాలా అరుదైన కేసుగా వారు చెప్పారు. చాలా తక్కువ మందికి ఇలా జరుగుతుందన్నారు. కరోనా నుంచి కోలుకున్నా కొన్ని నెలల పాటు అంటే సుమారు 6 నెలల వరకు దాని లక్షణాలు అలాగే ఉంటాయని డాక్టర్లు చెప్పారని, ఆ కేటగిరిలోకి తాను వస్తానని డెబ్బీ తెలిపింది. నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా, ఎక్స్ రే తీయించుకున్నా, గుండె ఎకో టెస్ట్ చేయించాను. అసలు నా దేహంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఈ టెస్టులన్నీ చేయించాను అని డెబ్బీ తెలిసింది.

కరోనా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత కొన్ని నెలల వరకు కొవిడ్ లక్షణాలు కనిపించడం డాక్టర్లను షాక్ కి గురి చేసింది. ఇలాంటి కేసులు చాలా అరుదు అని చెబుతున్నారు. ఒకసారి కరోనా బారిన పడ్డ వారిలో రెండోసారి కరోనా అటాక్ అవుతుందా లేదా అనే దానికి సంబంధించి ఆధారాలు సేకరించాల్సి ఉందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 56లక్షల కరోనా కేసులు, 3లక్షల 52వేల మరణాలు:
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 56లక్షల 81వేల 601 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 28లక్షల 98వేల 972. కోవిడ్‌-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3లక్షల 52వేల 168 మంది చనిపోయారు. వ్యాధి నుంచి కోలుకుని 24లక్షల 30వేల 461 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 

అమెరికాలో లక్ష దాటిన కరోనా మరణాలు:
ప్రపంచంలో కరోనా కారణంగా అత్యధిక ప్రభావానికి గురైన దేశం అగ్రరాజ్యం అమెరికా. అమెరికాలో కరోనా మృత్యుతాండవం చేస్తోంది. మహమ్మారి కారణంగా ఆ దేశంలో మంగళవారం నాటికి మృతుల సంఖ్య లక్ష దాటింది. ప్రపంచవ్యాప్తంగా మూడున్నర లక్షల మంది మరణిస్తే, దాంట్లో 28 శాతానికి పైగా మరణాలు అమెరికాలోనే చోటుచేసుకున్నాయి. కరోనాతో అమెరికాలో ఇప్పటివరకు 1 లక్ష 579 మంది చనిపోయారు. కరోనా వల్ల అమెరికాలో ఫిబ్రవరి 29న తొలి మరణం సంభవించింది. దాదాపు మూడు నెలల వ్యవధిలో మరణాల సంఖ్య ఒక లక్ష 103కు చేరడం ఆందోళన కలిగిస్తోంది. అంటే రోజుకు సగటున 1,111 మంది మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. న్యూయార్క్‌ నగరంలో అత్యధికంగా 29,310 మరణాలు చోటుచేసుకున్నాయి. కాగా అమెరికాలో ఇప్పటివరకూ 17లక్షల 14వేల 327 మందికి కరోనా సోకింది.

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు సంభవించిన దేశాల వివరాలు:
* బ్రెజిల్‌-24,549
* రష్యా-3,807
* స్పెయిన్‌-27,117
* యూకే-37,048
* ఇటలీ-32,955
* జర్మనీ-8,498
* ఇరాన్‌-7,508
* పెరూ-3,788
* కెనడా-6,639
* చైనా-4,634
* మెక్సికో-8,134
* పాకిస్థాన్‌-1,197
* బెల్జియం-9,334
* నెదర్లాండ్స్‌-5,856
* స్వీడన్‌-4,125
* పోర్చుగల్‌-1,342
* స్విట్జర్లాండ్‌-1,915
* ఐర్లాండ్‌-1,615
* ఇండోనేషియా-1,418
* పోలాండ్‌-1,024

Read: అమెరికన్ల మెంటల్ హెల్త్ లో భారీ మార్పులు…1/3వంతు మందిలో డిప్రెషన్,యాంగ్జైటీ