ఛాతిపై వెంట్రుకలు మొలిచాయని చావాలనుకుంది.. కానీ!

ఛాతిపై వెంట్రుకలు మొలిచాయని చావాలనుకుంది.. కానీ!

Woman overcome razor learns to embrace her chest hair: ఒక్కొక్కరికి ఒక్కో బాధ.. అందంగా లేమని, కొందరేమో జుట్టు తెల్లబడిపోతుందని తెగ బాధపడిపోతుంటారు. మరికొందరేమో బట్టతల వచ్చిందని హైరానా పడిపోతుంటారు. అవాంఛిత రొమాలను కవర్ చేయలేక ఆందోళన చెందుతుంటారు. కొన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుంది. మరికొన్నింటికి పర్మినెంట్ సొల్యుషన్ ఉండకపోవచ్చు. అందుకే సమస్య ఏదైనా నలుగురితో కలిసేందుకు జంకుతుంటారు. ఆత్మానూన్యత భావం విపరీతంగా పెరిగిపోతుంది. తమ మీద తమకే అసహ్యం కలుగుతుంది. అవమానాలు, ఎగతాళి వంటి ఎదురైనప్పుడు మానసికంగా కృంగిపోతుంటారు.

కొన్నిసార్లు చనిపోవాలనే నిర్ణయం తీసుకుంటారు. అలాంటి పరిస్థితే ఎదురైంది కెనడాకు చెందిన 24ఏళ్ల యువతికి. ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నవారిలానే తాను కూడా అలానే మొదట్లో తెగ బాధపడింది. అవాంఛిత రోమాలను తొలగించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయినా ఫలితం లేదు. చివరికి చనిపోవాలని కూడా ట్రై చేసింది. కానీ, చివరకు డిసిషన్ మార్చుకుంది. తానెందుకు చావాలని గట్టిగా అనుకుంది. తన సమస్యను తన ఇష్టంగా మార్చుకుంది. మొన్నటివరకూ అవాంఛిత రొమాలను చూసి బాధపడిన యువతి ఇప్పుడు అదే ఫ్యాషన్ అంటూ కొత్త ట్రెండ్ సెట్ చేసింది.

ఆ యువతి.. కెనడా, మాన్‌ట్రియల్‌కు చెందిన ఈస్టర్‌ కాలిక్ట్సే బియా.. తనకు 19 ఏళ్లు ఉన్నప్పటినుంచి ఛాతిపై వెంట్రుకలు మొలవటం ప్రారంభమయ్యాయి. ఛాతిపై వెంట్రుకలను ఎన్నిసార్లు తొలగించిన మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. వెంట్రుకలను తొలగించే సమయంలో ఎంత నొప్పినైనా భరించింది. అయినా సమస్యను నుంచి బయటపడలేకపోయింది. చివరికి, చనిపోవాలనుకుంది. కానీ, వాస్తవం తెలుసుకుంది. యువతి వాళ్ల నాన్న బంధువుల్లోని మహిళలకు ఇలా ఛాతిపై వెంట్రుకలు ఉన్నాయని తెలుసుకుంది.

అప్పటినుంచితనను తాను ప్రేమించుకోవడం మొదలుపెట్టింది. వెంట్రుకలను అందరికి కనిపిస్తే గిల్టీగా ఫీల్ అయినా తాను ఇప్పుడు అందరికి కనిపించేలా స్టయిల్ గా ఫోజులిస్తోంది. సమస్యను ఇష్టంగా మార్చుకుని అందులోనే ఆనందాన్ని వెతుక్కుంది. బియా ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పాజిటివ్ ఆలోచనలతో చెదరని ఆత్మవిశ్వాసంతో ఉన్న బియాను నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు. తమలోని లోపాన్ని చూసుకుని బాధపడటం కంటే అందులోనే ఆనందాన్ని వెతుక్కోవడం బియా వంటి వాళ్లే అందరికి ఆదర్శమంటున్నారు.