Fake Funeral: చుట్టూ ఉన్నవాళ్లు ఏం చేస్తారో చూద్దామని ‘చనిపోయింది’!

సమాజంలో కొందరికి వింత కోరికలు ఉంటాయి. తమ కోరికలు తీర్చుకునేందుకు కొందరు సాహసాలు చేస్తుంటారు.. మరికొందరు నటిస్తుంటారు.. ఇక ఈ కోవకు చెందిందే చిలీ దేశానికి చెందిన ఓ మహిళ.

Fake Funeral: చుట్టూ ఉన్నవాళ్లు ఏం చేస్తారో చూద్దామని ‘చనిపోయింది’!

Fake Funeral

Fake Funeral: సమాజంలో కొందరికి వింత కోరికలు ఉంటాయి. తమ కోరికలు తీర్చుకునేందుకు కొందరు సాహసాలు చేస్తుంటారు.. మరికొందరు నటిస్తుంటారు.. ఇక ఈ కోవకు చెందిందే చిలీ దేశానికి చెందిన ఓ మహిళ.. తను చనిపోతే ఎవరి రియాక్షన్ ఎలా ఉంటుందో అని తెలుసుకునే ప్రయత్నం చేసింది. చిలీ రాజ‌ధాని శాంటియాగోకు చెందిన మైరా అలోంజో అనే మ‌హిళ తాను చ‌నిపోతే తరువాత తన చుట్టు జరిగే పరిణామాలను చూడాలనుకుందంట.

దీంతో ఎలాగైనా తన కోరిక నెరవేర్చుకోవాలనుకుంది. అందుకోసం డెత్ రిహార్సల్ చేయాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చింది. అనుకున్నదే తడవుగా ఓ లగ్జ‌రీ శవపేటిక తెప్పించుకుంది. ఫొటోగ్రాఫర్లను పిలిపించుకుంది. ముందే తన చేస్తున్న రిహార్సల్ ని కుటుంబ సభ్యులకు తెలిపింది. తెల్లటి వస్త్రాలు ధరించి శవపేటికలో పడుకుంది. నెత్తిన కిరీటం, ముక్కులో దూదిని పెట్టుకుని.. సంతాప స‌భ జ‌రుగుతున్న‌ట్లుగా ఏర్పాట్లు చేయించింది. ఇలా మూడు గంటలపాటు శవపేటికలో పడుకొని మృతి చెందినట్లుగా నటించారు. ఇక ఇంట్లోవాళ్ళు నిజంగానే మరణించినట్లు యాక్ట్ చేశారు.

కన్నీరు పెట్టుకున్నారు. స్నేహితులు కూడా వచ్చి కొద్దీ సేపు కన్నీరు కార్చి పూలదండలు వేసి నివాళి అర్పించారు. మూడు గంటల తర్వాత మెల్లిగా శవపేటికలోంచి లేచి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక మైరా అలోంజో చేసిన పనిని కొందరు మెచ్చుకుంటుండగా మరికొందరు తిట్టిపోస్తున్నారు. కరోనా సమయంలో ఈ వెకిలి చేష్టలు ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.