Turkey: శిథిలాల కింద 104 గంటలు పోరాడిన మహిళ.. కానీ, చివరకు..

శిథిలాల కింద నుంచి బయటపడ్డప్పటికీ, ప్రాణాలు దక్కడం లేదు. తాజాగా ఒక 40 ఏళ్ల మహిళ దాదాపు 104 గంటలు శిథిలాల కింద చిక్కుకుని, బయటపడింది. అయితే, ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయింది. సోమవారం ఉదయం టర్కీ, సిరియాల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Turkey: శిథిలాల కింద 104 గంటలు పోరాడిన మహిళ.. కానీ, చివరకు..

Turkey: టర్కీ భూకంప శిథిలాల కింద నుంచి బయటపడిన వాళ్లలో ఆ తర్వాత కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. శిథిలాల కింద చిక్కుకుని ఏదో ఒక రకంగా ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న వాళ్లెందరో ఉన్నారు. రోజుల తర్వాత వాళ్లు బయటపడుతున్నారు.

Turkey Earthquake : టర్కీ శిథిలాల్లో మృత్యుంజయుడు.. 94 గంటలు మూత్రం తాగి బతికాడు

వారిలో ఒక్కొక్కరి గాథ ఒక్కోలా ఉంది. శిథిలాల కింద నుంచి బయటపడ్డప్పటికీ, ప్రాణాలు దక్కడం లేదు. తాజాగా ఒక 40 ఏళ్ల మహిళ దాదాపు 104 గంటలు శిథిలాల కింద చిక్కుకుని, బయటపడింది. అయితే, ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయింది. సోమవారం ఉదయం టర్కీ, సిరియాల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రోజూ వేలాది మృతదేహాల్ని సహాయక బృందాలు కనుగొంటున్నాయి. అయితే, అరుదుగా కొందరు ప్రాణాలతో బయటపడుతున్నారు. దాదాపు ఐదు రోజులుగా శిథిలాల కిందే చిక్కుకుని సహాయం కోసం ఎదురు చూస్తున్న వారిని రక్షణ బృందాలు వెలికితీస్తున్నాయి.

Women’s T20 World Cup: టీ20 మహిళా వరల్డ్ కప్.. రేపే ఇండియా-పాక్ మ్యాచ్… గాయం కారణంగా కీలక ప్లేయర్ దూరం?

శనివారం ఉదయం 40 ఏళ్ల జెనెప్ కరామన్ అనే మహిళలను సహాయక బృందాలు వెలికితీశాయి. అనేక మృతదేహాలు, శిథిలాల మధ్య ఆమెను జర్మన్ బృందాలు గుర్తించాయి. అక్కడి పరిస్థితుల్లో ఆమె అప్పటివరకు బతకడం అరుదైన విషయమని సహాయక బృందాలు చెప్పాయి. వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ, అక్కడ చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీనిపై సహాయక బృందాలు కూడా విచారం వ్యక్తం చేశాయి. ఇలాంటి ఎన్నో హృదాయవిదారక ఘటనలు టర్కీ, సిరియాల్లో వెలుగు చూస్తున్నాయి. రెండు దేశాల్లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.