Women’s T20 World Cup: టీ20 మహిళా వరల్డ్ కప్.. రేపే ఇండియా-పాక్ మ్యాచ్… గాయం కారణంగా కీలక ప్లేయర్ దూరం?

జట్టులో కీలక ప్లేయర్‌గా ఉన్న స్మృతి మంధాన ఆడటం అనుమానంగా ఉంది. గాయం కారణంగా ఆమె ఈ మ్యాచ్‌లో ఆడుతుందా లేదా అని అనుమానం తలెత్తుతోంది. జట్టు కూర్పు గురించిన వివరాల్ని బ్యాటింగ్ కోచ్ హృషికేష్ కనిత్కర్ శనివారం మీడియాకు వెల్లడించారు.

Women’s T20 World Cup: టీ20 మహిళా వరల్డ్ కప్.. రేపే ఇండియా-పాక్ మ్యాచ్… గాయం కారణంగా కీలక ప్లేయర్ దూరం?

Women’s T20 World Cup: ‘ఐసీసీ టీ20 మహిళా వరల్డ్ కప్-2023’ శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాలో ఈ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో ఆదివారం కీలక మ్యాచ్ జరగబోతుంది. టీమిండియా-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ‘గ్రూప్-బి’లో ఉన్న ఇండియా-పాక్ జట్ల మధ్య ఆదివారం సాయంత్రం 06.30 గంటలకు ఈ మ్యాచ్ జరుగుతుంది.

Visakhapatnam Cannabis : మత్తు స్మగ్లర్లకు అడ్డాగా విశాఖ..! టన్నుల కొద్దీ గంజాయి అక్రమ రవాణ

ఈ నేపథ్యంలో జట్టులో కీలక ప్లేయర్‌గా ఉన్న స్మృతి మంధాన ఆడటం అనుమానంగా ఉంది. గాయం కారణంగా ఆమె ఈ మ్యాచ్‌లో ఆడుతుందా లేదా అని అనుమానం తలెత్తుతోంది. జట్టు కూర్పు గురించిన వివరాల్ని బ్యాటింగ్ కోచ్ హృషికేష్ కనిత్కర్ శనివారం మీడియాకు వెల్లడించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మ్యాచ్ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నరని, అయితే వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మాత్రం మ్యాచ్‌లో ఆడకపోవచ్చన్నారు. వేలికి తగిలిన గాయం కారణంగా స్మృతి మ్యాచ్‌కు దూరం కావొచ్చన్నారు. కనిత్కర్ చెప్పిన వివరాల ప్రకారం.. స్మృతి మంధాన ప్రస్తుతం కోలుకుంటోంది. ఫిబ్రవరి 15న వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో స్మృతి ఆడే అవకాశం ఉంది.

Delhi Liquor Scam: మాగుంట రాఘవకు 10 రోజుల ఈడీ కస్టడీ.. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

కెప్టెన్ హర్మన్ కూడా జట్టుతో ఆడేందుకు సిద్ధమవుతోంది. రెండు రోజులుగా హర్మన్ బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచుల్లో గాయం కారణంగా హర్మన్ ప్రీత్ కౌర్ ఆడలేదు. దీంతో పాకిస్తాన్ మ్యాచులో ఆడుతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ఆటగాళ్లలో చాలా మందికి గతంలో పాకిస్తాన్‌తో ఆడిన అనుభవం ఉంది. దీంతో ఈ అనుభవంతో భారత ఆటగాళ్లు పై చేయి సాధించే అవకాశం ఉంది. పాకిస్తాన్‌తో మ్యాచ్ తర్వాత భారత జట్టు ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లతో తదుపరి మ్యాచులు ఆడుతుంది.