Visakhapatnam Cannabis : మత్తు స్మగ్లర్లకు అడ్డాగా విశాఖ..! టన్నుల కొద్దీ గంజాయి అక్రమ రవాణ

విశాఖ సిటీ గంజాయి ఎగుమతులకు, మత్తు ఇంజెక్షన్ల దిగుమతులకు కేంద్ర బిందువుగా మారుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాగర నగరం స్మగ్లర్లకు అడ్డాగా, మత్తు పదార్దాలకు నిలయంగా నిలుస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మొన్నటివరకు కొకైన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్, నల్లమందు, హాసిష్ ఆయిల్, ఎల్‌ఎస్‌డీ లతో హడలెత్తించిన స్మగ్లర్లు ఇప్పుడు మత్తును కలిగించే ఏ ఒక్క పదార్దాన్ని వదలకుండా రెచ్చిపోతున్నారు.

Visakhapatnam Cannabis : మత్తు స్మగ్లర్లకు అడ్డాగా విశాఖ..! టన్నుల కొద్దీ గంజాయి అక్రమ రవాణ

Visakhapatnam Cannabis : విశాఖ సిటీ గంజాయి ఎగుమతులకు, మత్తు ఇంజెక్షన్ల దిగుమతులకు కేంద్ర బిందువుగా మారుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాగర నగరం స్మగ్లర్లకు అడ్డాగా, మత్తు పదార్దాలకు నిలయంగా నిలుస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మొన్నటివరకు కొకైన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్, నల్లమందు, హాసిష్ ఆయిల్, ఎల్‌ఎస్‌డీ లతో హడలెత్తించిన స్మగ్లర్లు ఇప్పుడు మత్తును కలిగించే ఏ ఒక్క పదార్దాన్ని వదలకుండా రెచ్చిపోతున్నారు. యువత బలహీనతను ఆసరాగా చేసుకుని నిషేధిత ఉత్పత్తుల విక్రయాలు, సరఫరా జోరుగా పెంచారు.

Also Read..Andhra Pradesh: ఏపీలో రూ.300 కోట్ల విలువైన గంజాయి ధ్వంసం.. కొనసాగుతున్న ‘ఆపరేషన్ పరివర్తన్’

వైజాగ్ లో డ్రగ్స్ సరఫరా వేగంగా పెరిగిపోవడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఏ ప్రాంతంలో గంజాయి పట్టుబడినా.. దానిని మూలాలు మాత్రం విశాఖ ఏజెన్సీ నుంచే సరఫరా అవుతుందని సమాచారం. గంజాయి వ్యాపారులు ఏజెన్సీలో వేల ఎకరాల్లో గంజాయిని పండించి టన్నుల కొద్దీ సరిహద్దులు దాటించి క్యాష్ చేసుకుంటున్నారు.

ఈ అక్రమ రవాణను అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం దృష్టి కేంద్రీకరించడంతో స్మగ్లర్లు తమ రూట్ మార్చారు. మధ్యవర్తులతో సంబంధం లేకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన గంజాయి వ్యాపారులతో డీల్ కుదుర్చుకుంటున్నారు. వారు నేరుగా నగరానికి వచ్చి, ఏజెన్సీకి వెళ్లి తమకు పరిచయం ఉన్నవారి నుంచి గంజాయి కొనుగోలు చేసి తమ రాష్ట్రాలకు తరలిస్తున్నారు.

Also Read.. Andhra Pradesh : ఏపీలో మాయమవుతోన్న సముద్ర తీర గ్రామాలు..విశాఖలో 30 ఏళ్లల్లో..మూడున్నర కిలోమీటర్లు అదృశ్యం..

ఇటీవల విశాఖ ఏజెన్సీతో పాటు ఒడిశాలోని కోరాపుట్ నుంచి గంజాయి రవాణ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కోరాపుట్ నుంచి విశాఖకు 204 కిలోమీటర్ల దూరం. దీంతో వ్యాపారులు నేరుగా విశాఖ నుంచి కోరాపుట్ కి బేరసారాలు సాగించి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. తమ రాష్ట్రాలకు రోడ్డు, రైలు మార్గాల్లో గంజాయిని తరలిస్తున్నారు. ఏజెన్సీలో పండే గంజాయికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. కోరాపుట్, విశాఖ ఏజెన్సీల నుంచి తెచ్చిన గంజాయిని ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఏపీ రాజధానిగా విశాఖ పేరు వినిపిస్తోంది. త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన సాగిస్తామని సీఎం జగన్ కూడా తేల్చి చెప్పేశారు. ఏపీకి రాజధాని విశాఖే అని.. సీఎంగా మాట చెబుతున్నా అంటూ పెట్టుబడిదారులను ఆహ్వానించారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖ నగరం గంజాయి స్మగ్లర్లకు అడ్డాగా మారిందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గంజాయి వాసన గుప్పుమంటుండటం దుమారం రేపింది. ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకుని గంజాయి స్మగ్లర్ల ఆట కట్టించాలని, విశాఖ నగర ప్రతిష్టకు భంగం కలగకుండా చూడాలని కోరుతున్నారు. అలాగే యువత మత్తు పదార్దాలకు బానిస కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందంటున్నారు.