Delhi Liquor Scam: మాగుంట రాఘవకు 10 రోజుల ఈడీ కస్టడీ.. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవ రెడ్డిని అరెస్టు చేసిన ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడికి 10 రోజుల ఈడీ కస్టడీ విధించింది. మాగుంట రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక అంశాల్ని ప్రస్తావించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సౌత్ గ్రూప్ పేర్లను ఈడీ పొందుపరిచింది.

Delhi Liquor Scam: మాగుంట రాఘవకు 10 రోజుల ఈడీ కస్టడీ.. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవ రెడ్డిని అరెస్టు చేసిన ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడికి 10 రోజుల ఈడీ కస్టడీ విధించింది. మాగుంట రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక అంశాల్ని ప్రస్తావించింది.

Indian died in Turkey: టర్కీ భూకంప శిథిలాల్లో భారతీయుడి మృతదేహం లభ్యం.. వెల్లడించిన భారత ఎంబసీ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సౌత్ గ్రూప్ పేర్లను ఈడీ పొందుపరిచింది. ఈడీ రిమాండ్ రిపోర్టు ప్రకారం.. ఎర్నికా మద్యం ఉత్పత్తి కంపెనీ కలిగివున్న రాఘవ ఢిల్లీ రిటైల్ జోన్స్ లో రెండు జోన్లలో వ్యాపారం దక్కించుకున్నారు. హోల్‌సేల్ వ్యాపారంలో ఎల్ 1 గా వచ్చిన ఇండో స్పిరిట్ కంపెనీ ప్రేమ్ రాహుల్ మండూరి పేరు మీదు 32.5 శాతం వాటాను రాఘవ పొందారు. ఢిల్లీ లిక్కర్ స్కాం పెద్ద కుట్ర. ఈ స్కాంలో ముడుపుల వ్యవహారంలో రాఘవ కీలక పాత్ర పోషించాడు. ఆప్ నేతలకు రూ.100 కోట్లను సౌత్ గ్రూప్ ముడుపులుగా ఇచ్చిన వ్యవహారంలో రాఘవ పాత్ర కూడా ఉంది. ఈ రూ.100 కోట్లలో రూ.31 కోట్ల ముడుపులు రాఘవ రెడ్డి ద్వారానే చేరినట్లు విజయ్ నాయర్ స్నేహితుడైన దినేష్ అరోరా చెప్పారు.

Venkatesh Prasad: ప్రతిభ వల్ల కాదు.. ఫేవరెటిజం వల్లే కేఎల్ రాహుల్ జట్టుకు ఎంపిక: వెంకటేశ్ ప్రసాద్

అభిషేక్ బోయినపల్లితో కలిసి 31 కోట్ల రూపాయాలు హవాలా మార్గంలో మళ్ళించినట్లు దినేష్ అరోరా వెల్లడించారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ క్యాంపు కార్యాలయం నుంచే విజయ్ నాయర్ పనిచేశారు. కేబినెట్ మంత్రి కైలాష్ గెహ్లాట్ కు కేటాయించిన అధికారిక నివాసంలో విజయ్ నాయర్ నివసించారు. సమీర్ మహేంద్రు, కేజ్రీవాల్ మధ్య విజయ్ నాయర్ అనుసంధాన కర్తగా వ్యవహరించారు. విజయ్ నాయర్ ఒక బ్రోకర్, లైజన్ మధ్యవర్తిగా వ్యవహరించారు. కవిత, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ నుంచి విజయ్ నాయర్ రూ.100 కోట్ల ముడుపులు అందుకున్నారు. ముడుపులు ఇచ్చిన కారణంగా సౌత్ గ్రూపు అయాచిత లబ్ది పొందింది.

Hyderabad E-Race: ముగిసిన ఫార్ములా ఈ-రేసింగ్.. విజేతగా నిలిచిన జీన్ ఎరిక్ వెర్గ్నే

అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి రూ.100 కోట్లు విజయ్ నాయర్ కు బదిలీ చేశారు. హోల్ సేల్, రిటైల్ వ్యాపారంలో సౌత్ గ్రూపు లబ్ది పొందింది. ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చేలా వ్యవహరించేలా కేజ్రీవాల్ నివాసంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆదేశించినట్లు ఆయన కార్యదర్శి అరవింద్ చెప్పారు. ఈ కుంభకోణం కారణంగా మొత్తం ప్రభుత్వ ఖజానాకు 2873 కోట్ల నష్టం వాటిల్లింది. మద్యం విధానం ప్రకారం ఉత్పత్తిదారులు హోల్ సేల్, రిటైల్ వ్యాపారంలో వుండకూడదు.