Venkatesh Prasad: ప్రతిభ వల్ల కాదు.. ఫేవరెటిజం వల్లే కేఎల్ రాహుల్ జట్టుకు ఎంపిక: వెంకటేశ్ ప్రసాద్

కేఎల్ రాహుల్ శక్తిసామర్ధ్యాలపై నాకెలాంటి సందేహం లేదు. కానీ, అతడి ప్రదర్శన మాత్రం అంచనాలకు చాలా దూరంలో ఉంది. ఎనిమిదేళ్లుగా 46 టెస్టు మ్యాచులు ఆడి, 34 మాత్రమే సగటు ఉందంటే.. అది చాలా సాధారణం. ఇంకెవరైనా ఇలా ఆడుంటే అతడికి అన్ని అవకాశాలు వచ్చుండేవి కావు.

Venkatesh Prasad: ప్రతిభ వల్ల కాదు.. ఫేవరెటిజం వల్లే కేఎల్ రాహుల్ జట్టుకు ఎంపిక: వెంకటేశ్ ప్రసాద్

Venkatesh Prasad: భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌పై ఇండియా మాజీ బౌలింగ్ కోచ్ విమర్శలు చేశారు. ప్రతిభ, ప్రదర్శన వల్ల కాకుండా ఫేవరెటిజం వల్లే కేఎల్ రాహుల్ అనేకసార్లు తుది జట్టుకు ఎంపికయ్యాడని వెంకటేశ్ ప్రసాద్ విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఐసీసీ షాక్.. వేలికి క్రీమ్ రాసుకున్నందుకు మ్యాచ్ ఫీజులో కోత

‘‘కేఎల్ రాహుల్ శక్తిసామర్ధ్యాలపై నాకెలాంటి సందేహం లేదు. కానీ, అతడి ప్రదర్శన మాత్రం అంచనాలకు చాలా దూరంలో ఉంది. ఎనిమిదేళ్లుగా 46 టెస్టు మ్యాచులు ఆడి, 34 మాత్రమే సగటు ఉందంటే.. అది చాలా సాధారణం. ఇంకెవరైనా ఇలా ఆడుంటే అతడికి అన్ని అవకాశాలు వచ్చుండేవి కావు. మంచి ఫామ్‌లో ఉన్న చాలా మంది అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్ వంటి వాల్లు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. రాహుల్ బదులు అవకాశం దక్కాల్సిన వాళ్లు చాలా మంది ఉన్నారు. కొంతమందికి సక్సెస్ అయ్యేవరకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. కానీ, వేరే వాళ్లకు అవకాశాలు ఉండవు.

Visakhapatnam Cannabis : మత్తు స్మగ్లర్లకు అడ్డాగా విశాఖ..! టన్నుల కొద్దీ గంజాయి అక్రమ రవాణ

అందులోనూ రాహుల్ వైస్ కెప్టెన్ కావడం మరో అంశం. అశ్విన్‌కు మంచి దృక్పథం ఉంది. అతడ్ని టెస్టుల్లో వైస్ కెప్టెన్ చేయొచ్చు. లేదంటే పుజారా, జడేజాల్లో ఒకరికి అవకాశం ఇవ్వొచ్చు. మయాంక్ అగర్వాల్ టెస్టుల్లో రాహుల్ కంటే మంచి ప్రతిభ చూపగలడు. హనుమ విహారి కూడా బాగా ఆడగలడు. రాహుల్ ప్రతిభకన్నా బోర్డుకు ఉన్న ఫేవరెటిజం వల్ల మాత్రమే మాజీ క్రికెటర్లు ఈ విషయంలో స్పందించలేకపోతున్నారు’’ అని వెంకటేశ్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. వరుస ట్వీట్లలో రాహుల్‌పై వెంకటేశ్ ప్రసాద్ విరుచుకుపడ్డారు.