మాస్క్ వేసుకోమన్నారని అందరూ చచ్చిపోతారంటూ మహిళ వార్నింగ్.. విమానం నుంచి దించేసిన సిబ్బంది

మాస్క్ వేసుకోమన్నారని అందరూ చచ్చిపోతారంటూ మహిళ వార్నింగ్.. విమానం నుంచి దించేసిన సిబ్బంది

Mask ధరించలేదని బెల్‌ఫాస్ట్ నుంచి ఎడిన్‌బర్గ్ కు వెళ్తున్న ఈజీజెట్ విమానం నుంచి మహిళను దించేశారు. మాస్క్ వేసుకోకుండా విమానం ఎక్కడమే కాకుండా తప్పనిసరిగా మాస్క్ వేసుకోవాలని చెప్పడంతో నిరాకరించింది ఆ మహిళ.. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ చనిపోతారంటూ బెదిరించింది.

నార్తరన్ ఐర్లాండ్‌లో ఉన్న బెల్‌ఫాస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో ఆదివారం జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్కాటిష్ యాసతో తిడుతున్న మహిళ మాటలు ఇలా ఉన్నాయి. ‘ప్రతి ఒక్కరూ చనిపోతారు. మీకు తెలుసా? అది కరోనా అయినా కాకపోయినా’ అని బ్యాగ్, జాకెట్ తీసుకుని విమానం నుంచి దిగిపోయింది.



దిగిపోతూ తోటి ప్రయాణికులపై దగ్గుతున్నట్లుగా నటించి భయపెట్టింది. ఈజీజెట్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. పోలీసులను పిలిచి ఘటనను వివరించామని తెలిపారు. ‘ఓ ప్రయాణికురాలి అనుచిత ప్రవర్తన, మాస్క్ వేసుకోకపోవడంతో విమానం నుంచి దించేశామని’ పేర్కొన్నారు.
https://10tv.in/indonesia-lets-wear-masks-takes-flight-as-airbus-a330-900neo-sports-a-painted-mask/
‘EASA గైడ్ లైన్స్ ప్రకారం.. ప్రయాణికులంతా ప్రస్తుతం బోర్డింగ్ సమయంలో ముఖాలకు మాస్క్ లు ధరించి ఉండాలి. కేవలం తినేటప్పుడు, తాగేటప్పుడు మాత్రమే తీసేసినా పరవేలేదు’ అని అధికార ప్రతినిధి వెల్లడించారు.

ఆ మహిళ చేసిన పనికి విమానంలో ఉన్న వారే కాదు.. ప్రయాణికులను రిస్క్‌లో పెట్టే విధంగా ప్రవర్తించినందుకు సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్ ఎదుర్కొంటుంది.