High Heels Jump: హై హీల్స్‌తో తాడుపై జంపింగ్.. సీక్రెట్ చెప్పిన మహిళ

కాలు నొప్పులు, జారిపడటం లాంటి సమస్యలు తెచ్చే హీహీల్స్ వేసుకుని తాడుపై జంప్ చేసింది ఓ మహిళ. ఈ అసాధారణ ఫీట్ తో గిన్నిస్ బుక్ లో రికార్డు దక్కించుకుంది.

High Heels Jump: హై హీల్స్‌తో తాడుపై జంపింగ్.. సీక్రెట్ చెప్పిన మహిళ

High Heels Jump

High Heels Jump: హై హీల్స్‌తో నడవడం కూడా కొన్ని సందర్భాల్లో కష్టమే. మహిళలకు మాత్రమే తెలుసు వాటితో ఎంత కష్టమో. కాలు నొప్పులు, జారిపడటం లాంటి సమస్యలు తెచ్చే హీహీల్స్ వేసుకుని తాడుపై జంప్ చేసింది ఓ మహిళ. ఈ అసాధారణ ఫీట్ తో గిన్నిస్ బుక్ లో రికార్డు దక్కించుకుంది.

ఓల్గా హెన్రీ అనే క్రీడాకారిణి తాడుపై హై హీల్స్ తో జంప్ చేయడమే కాదు బౌన్సింగ్ కూడా చేస్తూ ఆశ్చర్యం పుట్టించింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న శాంతా మోనికా బీచ్ లో ఒక్క నిమిషంలోనే టాస్క్ కంప్లీట్ చేసింది ఓల్గా.

గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వీడియోను షేర్ చేస్తూ.. ఒక్క నిమిషంలో 25సార్లు జంప్ చేయగలిగిందంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది.

Read Also : 54,740 గాజు గ్లాసులతో పిరమిడ్‌..గిన్నీస్‌ బుక్‌ రికార్డ్

ఆ వీడియోలో కాన్సట్రేటెడ్ గా జంప్ చేస్తూ.. తాడుపై హీల్స్ తో జంప్ చేస్తూ కనిపించింది ఓల్గా. ఆమెను బ్యాలెన్స్ చేసుకోవడంతో పాటు వేసే అడుగుపైనా క్లారిటీతో చేసే టాస్క్ కు.. సోషల్ మీడియాలో మంచి ప్రశంసలు దక్కాయి.

అదెలాగూ కష్టమే.. నువ్వు హీల్స్ తో ఎలా చేయగలిగావంటూ నోరెళ్లబెడుతున్నారు ప్రేక్షకులు. ఓల్గా హెన్రీ గిన్నిస్ వరల్డ్ దక్కడం ఇది రెండోసారి.

ఇలా చేయడానికి ముందు శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడం ముఖ్యం అంటుంది. నడుం భాగంలో ఉండే కండరాలు ఈ జంపింగ్ లో కీలకంగా వ్యవహరిస్తాయని.. లోయర్ హాఫ్, పైన భాగాన్ని సమన్వయపరుచుకోవడానికి కీలకంగా ఉంటుందని తెలిపింది. ఈ విషయాలన్నింటినీ ఓ పుస్తకంలో రాసి రిలీజ్ చేశారు ఓల్గా. ఇటువంటి ఫీట్ సాధించడానికి కండరాలను ఎలా సిద్ధం చేయాలనా అని అందులో వివరించానని తెలిపారు.

Olga Henry

Olga Henry