ప్రసవానికి 4గంటల ముందే తను ప్రెగ్నెంట్ అని తెలిసిందట.. Big Surprise

  • Published By: Subhan ,Published On : May 29, 2020 / 05:56 AM IST
ప్రసవానికి 4గంటల ముందే తను ప్రెగ్నెంట్ అని తెలిసిందట.. Big Surprise

టీచర్ గా పనిచేస్తున్న 23ఏళ్ల లిజ్జి క్వాహ్ అనే మహిళకు పీరియడ్ సమయంలో వచ్చే నొప్పి కంటే భయంకరంగా వస్తుంది.  భరించలేకపోతుండటంతో కిడ్నీలో రాయి ఉన్నట్లు భావించి హాస్పిటల్ కు వెళ్లింది. ఆమెను చెక్ చేసిన డాక్టర్లు చెప్పిన విషయం విని ఆమె షాక్ అయింది. మరి కొద్ది గంటల్లో నీకు డెలివరీ కాబోతుందని చెప్పారు. 

ఆ ఘటన మరువలేనిదని.. బ్లూమింగ్ టన్ నుంచి లిజ్జి TikTokలో పంచుకుంది. విషయం తెలిసిన వెంటనే ఆమెను ఎమర్జెన్సీ రూంకు 23 జూన్ 2019న తీసుకెళ్లారట. కొద్ది రోజుల ముందు ఆమెకు కిడ్నీలో స్టోన్ ఉన్నట్లు తెలిసింది. దానికి ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్లు కొన్ని మందులు కూడా ఇచ్చారు. కానీ, ప్రెగ్నెంట్ అనే అనుమానమే రాకపోవడంతో ఎటువంటి పరీక్షలు చేయలేదు. 

నిజానికి ఆమె పొట్ట భాగంలో 8సెంటిమీటర్ల ఎత్తుగా ఉన్నా కామన్ గా ఫీలయ్యారు. ‘నాకు ఆ రోజు పురిటి నొప్పులు వచ్చి.. డెవలివరీ అయ్యేదాకా విషయం తెలియలేదు’ అని ఆమె టిక్ టాక్ లో చెప్పింది. పరీక్షలు నిర్వహించిన తర్వాత నార్మల్ డెలివరీ చేసి ప్రసవం చేయించారు డాక్టర్లు. ఇది తన జీవితంలోనే అత్యంత అరుదైన విషయంగా చెప్తోంది.

@lizziequah

I think I win this challenge ?? *also she is safe she climbs everything. ##crazypregancy ##fyp ##babiesoftiktok ##storytime ##putafingerdown ##wildstory

♬ original sound – lizziequah

‘నా శరీరాన్ని పరీక్ష చేసిన డాక్టర్ నువ్వు ప్రెగ్నెంట్. మరి కొద్ది గంటల్లో డెలివరీకి రెడీ ఉండు అని చెప్పారు. నా పెయిన్ తగ్గడానికి ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయింది. నాకు బాబు పుడుతుందా.. పాప పుడుతుందా అనే ఆలోచనే కాదు. అస్సలు లోపల బేబి పూర్తిగా రెడీ అయిందా.. ఏదైనా సమస్య ఉందా అని కూడా ఆలోచించుకునే సమయం లేదు’ అని లిజ్జీ చెప్పింది. 

అన్ని నెలలుగా తన కడుపులో చిన్న బిడ్డ పెరుగుతున్నట్లు ఆమెకు అస్సలు తెలియలేదట. కాస్త బరువు పెరిగినట్లుగా అనిపిస్తే జిమ్ చేయకపోవడం, ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల అని భావించిందట. ఆమెకు నెలసరి కూడా క్రమం తప్పకుండా వస్తూనే ఉందట. దాంతో అనుమానమే రాలేదు. సాధారణంగా రక్తస్రావం అవుతుంటే గర్భిణీలకు ప్రమాదం. 

Read: ఆకుపచ్చ సొనలతో గుడ్లు పెడుతున్న ఆరు కోళ్లు..ఎందుకంటే..