ప్రపంచంలో కరోనా సోకిన వారి సంఖ్య 1.84 కోట్లు.. టాప్ 10 దేశాలు ఇవే!

  • Published By: vamsi ,Published On : August 4, 2020 / 08:35 AM IST
ప్రపంచంలో కరోనా సోకిన వారి సంఖ్య 1.84 కోట్లు.. టాప్ 10 దేశాలు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇవాళ కరోనా వైరస్ వల్ల తీవ్రమైన ఆందోళనలో ఉన్నాయి. ఈ క్రమంలోనే కరోనా సోకిన వారి సంఖ్య 1.84 కోట్లు దాటింది. భారత్, అమెరికా మరియు బ్రెజిల్‌లో కరోనా కేసుల సంఖ్య మరియు మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 1.99 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 4,366 మంది చనిపోయారు. ఇప్పటివరకు కోటి 84 లక్షల మందికి కరోనా సోకింది. 6 లక్షల 96 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.



అదే సమయంలో ఈ వ్యాధి నుంచి కోలుకున్న రోగుల సంఖ్య కోటి 16 లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఇంకా 6 మిలియన్ల క్రియాశీల కేసులు ఉన్నాయి. వారికి ఆస్పత్రులలో ఇళ్లలో చికిత్స కొనసాగుతోంది. కరోనా ఎక్కువగా ప్రభావితమైన దేశాల జాబితాలో అమెరికా ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు 48.62 లక్షల మందికి అగ్రరాజ్యంలో కరోనాకు గురయ్యారు. లక్షా 58 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో అమెరికాలో 48 వేలకు పైగా కొత్త కేసులు నమోదవగా, 568 మంది చనిపోయారు. అదే సమయంలో, కరోనా బ్రెజిల్‌లో వినాశనం కొనసాగిస్తోంది. తర్వాత స్థానంలో భారత్ ఉంది.

అమెరికా : కేసులు- 4.862.133, మరణాలు- 158.929
బ్రెజిల్ : కేసులు- 2.751.665, మరణాలు- 94.702
భారతదేశం : కేసులు- 1.855.331, మరణాలు- 38.971
రష్యా : కేసులు- 856.264, మరణాలు- 14.207
సౌత్ ఆఫ్రికా : కేసులు- 516.862, మరణాలు- 8.539
మెక్సికో : కేసులు 439.046 , మరణాలు- 47,746
పెరూ : కేసులు- 433,100, మరణాలు- 19,811
చిలీ : కేసులు- 361,493, మరణాలు- 9,707
స్పెయిన్ : కేసులు- 344,134, మరణాలు- 28,472
కొలంబియా : కేసులు- 327,850, మరణాలు- 11,017



ప్రపంచవ్యాప్తంగా 18 దేశాలలో రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదై ఉన్నాయి. వీటిలో ఇరాన్, పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా, ఇటలీ, జర్మనీ మరియు బంగ్లాదేశ్ ఉన్నాయి. ప్రపంచంలో గరిష్టంగా సోకిన వారి సంఖ్య ప్రకారం భారతదేశం మూడవ స్థానంలో ఉండగా, మరణాల పరంగా ఐదవ స్థానంలో ఉంది.