Tomatoes : టమాట మొక్కకు 839 కాయలు

ఒక టమాట మొక్కకి 839 కాయలు కసాయి. దీంతో గిన్నీస్ బుక్ అధికారులు మొక్కను పరిశీలించి రికార్డుల్లో చేర్చారు.

Tomatoes : టమాట మొక్కకు 839 కాయలు

Tamota

Tomatoes : సాధారణంగా ఒక టమాట చెట్టుకు ఒకేసారి ఎన్నికయాలు కాస్తాయి.. ఓ 10 నుంచి 20 కాస్తాయి. అదే హైబ్రీడ్ అయితే 50 నుంచి 100 మధ్య కాస్తాయి. అయితే లండన్ లో ఒక టమాట మొక్కకు 839 టమాటాలు కసాయి. దీంతో గిన్నీస్ రికార్డులలో స్థానం దక్కించుకుంది.

Read More : MLA Seethakka: ఎమ్మెల్యే సీతక్కకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

వివరాల్లోకి వెళితే లండన్ కు చెందిన ఐటీ మేనేజర్ డగ్లస్ స్మిత్ కి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం.. తన పెరట్లో రాకరాక మొక్కలు పెంచుతుంటారు డగ్లస్. అయితే మార్చి నెలలో చెర్రీ టమాట మొక్క నాటారు.. వారానికి రెండు మూడు గంటలు దాని పోషణ సంరక్షణకు కేటాయించేవాడు. ఆ మొక్క ఎదిగి టమాటాలు కాసి గిన్నీర్ రికార్డులను బద్దలు కొట్టింది. చిన్న మొక్క ఏకంగా 839 టమాటాలు కాసింది. దీంతో డగ్లస్ గిన్నీస్ బుక్ అధికారులకు సమాచారం అందించారు.

Read More : Canada : కెనడా ఎన్నికల్లో 17 మంది భారత సంతతి వ్యక్తులు విజయం

చెట్టును కాయలను పరిశీలించిన ఈ బృందం గిన్నీస్ బుక్ రికార్డులలో చేర్చించి. కాగా గతంలో ఈ రికార్డు గ్రాహం టాంటెర్ అనే వ్యక్తిపై ఉంది. అతడు ఒక్క టమాటా చెట్టుకి 448 టమాటాలు కాయించాడు. ఇక ఇప్పుడు 839 కాయలు కాయడంతో టాంటెర్ రికార్డు బద్దలైంది. గతంలో కూడా 3.1 కేజీల అతిపెద్ద టమాటాను కాయించి గిన్నీస్‌లో చోటు దక్కించుకున్న డగ్లస్‌ తాజా పరిణామంతో మరోసారి వార్తల్లో కెక్కాడు.