కిలో తేనె ఖరీదు రూ.8.8 లక్షలు..గుహల్లో లభ్యమయ్యే రమ్యమైన హనీ..బంగారం కంటే కాస్ట్లీ..

కిలో తేనె ఖరీదు రూ.8.8 లక్షలు..గుహల్లో లభ్యమయ్యే రమ్యమైన హనీ..బంగారం కంటే కాస్ట్లీ..

Worlds Expensive Honey

worlds expensive honey : తేనె. ఎన్నో ఔషధ గుణాలుంటాయి. రోజుకు ఒక్క స్పూన్ తేనె తీసుకుంటే ఎన్నో లాభాలుంటాయని నిపుణులు చెబుతుంటారు. అటువంటి తేనె ఖరీదు మహా ఉంటే రూ.500, లేదా రూ.1000లు ఉంటుంది. కానీ టర్కీకి చెందిన సెంటారీ హనీ అనే కంపెనీ ఉత్పత్తి చేసే తేనె ఖరీదు తెలిస్తే హా..అంటూ నోరెళ్లబెట్టాల్సిందే. సెంటారీ హనీ కిలో అక్షరాలా రూ.808 లక్షలు..!! ఈ తేనె ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తేనెగా పేరొందింది. మరి ఇంత ఖరీదైనదీ అంటే ప్రత్యేక ఉంటుంది కదూ..మరి స్పషాలిటీ ఏంటో చూద్దాం..

3

టర్కీకి చెందిన సెంటారీ హనీ అనే కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తేను ఉత్పత్తి చేస్తున్న కంపెనీగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. సెంటారీ హనీ కంపెనీ బంగారం కన్నా ఖరీదైనదీ.ఈ కంపెనీ తయారు చేసిన ఒక రకం తేనె కిలో అక్షరాలా రూ.8.8 లక్షలు.తేనే ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధం. పువ్వు పువ్వులో ను ఉండే తేనెను తేనెటీగలు సేకరించి తెస్తాయి. చక్కెర కంటే ఎన్నో రెట్టు తియ్యగా ఉండే తెనే ఆయుర్వేదంలో చాలా ప్రత్యేకత కలిగినది. ప్రతీరోజు ఒక్క స్ఫూన్ తెనే తాగితే ఎన్నో లాభాలుంటాయని నిపుణులు పదే పదే చెబుతుంటారు. పసిబిడ్డలకు తేనె నాకించేవారు మన పెద్దవారు. కానీ ఇప్పుడలా చేయటంలేదు.

Honey

టర్కీకి చెందిన సెంటారీ హనీ అనే కంపెనీ ఫిబ్రవరి 16 న ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తేను ఉత్పత్తి చేస్తున్న కంపెనీగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఈ కంపెనీ తయారు చేసిన ఒక రకం తేనె ఏకంగా కిలోకు రూ.8.8 లక్షలు పలుకుతోంది. అందుకే ఈ రికార్డ్ వచ్చేసింది. ప్రపంచంలో మరే తేనె కూడా ఇంత ఖరీదు లేదు.

5

ఈ తేనెను జనావాసాలకు దూరంగా.. సముద్ర మట్టానికి 2500 అడుగుల ఎత్తులో ఉండే గుహల నుంచి సేకరిస్తారు. కొన్నిసార్లు ఇతర దేశాల్లోని అడవులకు వెళ్లి.. అక్కడ గుహల్లో తేనె కోసం అన్వేషించీ అన్వేషించి ఆ అరుదైన తెనును సేకరిస్తుంది ఈ కంపెనీ. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ తేనే లభ్యమవుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

2

ఈ తేనె సాధారణ తేనెలా బంగారపు రంగులో ఉండదు. డార్క్ కలర్‌లో ఉంటుంది. రుచి కూడా సాధారణ తేనె కంటే డిఫరెంట్ గా ఉంటుందట. సాధారణ తేనెలు తియ్యంగా ఉంటే…ఇది కాస్త చేదుగా (చిరు చేదుగా) అనిపిస్తుంది. రుచిలోను. రూపంలోను కాస్త భిన్నంగా ఉన్నా..సాధారణ తేనెలో ఉండే ఔషధ గుణాల కంటే దీంట్లో ఎన్నో రకాల ఔషద గుణాలు ఉన్నాయని తెలిపారు. అందుకే ధర ఎక్కువైనా టర్కీ సహా పలు దేశాల్లో చాలా మంది ఈ తేనెను కొనేందుకు ఇష్టపడుతుంటారట..!