worm moon : సూయజ్ కాల్వ, ఎవర్ గివెన్ ఎలా కదిలింది..చందమామ సహాయం చేసిందా

సూయజ్ కాల్వలో చిక్కుకుని ఆర్థికంగా ఎంతో నష్టానికి గురి చేసిన భారీ సరుకు రవాణా చేసే నౌక ఎవర్ గివెన్ ఎలా కదిలింది.

worm moon : సూయజ్ కాల్వ, ఎవర్ గివెన్ ఎలా కదిలింది..చందమామ సహాయం చేసిందా

full worm moon

Suez Canal : సూయజ్ కాల్వలో చిక్కుకుని ఆర్థికంగా ఎంతో నష్టానికి గురి చేసిన భారీ సరుకు రవాణా చేసే నౌక ఎవర్ గివెన్ ఎలా కదిలింది. ప్రపంచంలోనే అతిపెద్ద రద్దీ జలమార్గమైన సూయిజ్ కెనాల్‌లో ఎవర్ గివెన్ భారీ నౌక చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇంతటి భారీ నౌక కెనాల్‌కు అడ్డంగా ఇరుక్కుపోయింది. అతిపెద్ద రాకసి ఇసుక తుపాను గాలుల బీభత్సానికి ఈ భారీ నౌక కంట్రోల్ తప్పింది. దాంతో ఇసుకలో నౌక కూరుకుపోయింది. దాంతో అటుగా వెళ్లే నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ప్రతి రోజు ఇదే జలమార్గంలో సగటున 106కు పైగా భారీ కంటైనర్ నౌకలు వెళ్తుంటాయి. ప్రపంచపు అతిపెద్ద నౌకలన్నీ ఈ మార్గంలోనే వందలాది కంటైనర్లను రవాణా చేస్తుంటాయి. మార్చి 23 నుండి ఈజిప్టులోని సూయజ్ కాలువలో ఇరుక్కొని ట్రాఫిక్ జామ్‌కు కార‌ణ‌మైన ఎవ‌ర్‌ గివెన్ కంటైన‌ర్ షిప్ 2021, మార్చి 29వ తేదీ కదిలింది. సోమవారం ఇంజినీర్లు ఎంతగానో శ్రమించి..భారీ నౌకను సముద్రంలో తేలేలా చేయగలిగారు. అయితే..అత్యంత భారీ నౌక అయిన..దీనిని పక్కకు తీయడానికి టగ్ బోట్లు, సహాయక సిబ్బంది, ఇంజినీర్లు ఎంతగానో కృషి చేశారు. అయితే..వీరికి ఖగోళంలో జరిగిన అద్బుతం కూడా ఒక కారణమని టాక్. పౌర్ణమి సమయంలో..సముద్రంలో ఏర్పడే పోటు కూడా తోడు కావడంతో..నౌకను కదిలించడం జరిగిందని ఇంజినీర్లు వెల్లడిస్తున్నారు.

ఆదివారం పౌర్ణమి సందర్భంగా..సముద్రంలో పోటు ఏర్పడిందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నానా చెబుతోంది. మధ్యదరా సముద్రం, ఎర్ర సముద్రాల్లో చాలా పెద్ద అలలు ఏర్పడాయని, పోటు కారణంగా..18 అంగుళాల ఎత్తులో అలలు ఏర్పడ్డాయని నాసా చెబుతోంది. ఈ బలమైన అలలు ఓడను తాకడంతో…కదిలిందని, పెద్ద అలల శక్తి…రెండు టగ్ బోట్ల శక్తికి సమానంగా ఉంటుందని తెలిపింది. టగ్ బోట్లు, ఇంజినీర్ల శ్రమ, అలల పోటు కూడా తోడు కావడంతో..ఎవర్ గివెన్ కదిలిందని వెల్లడిస్తోంది. పౌర్ణమి, అమవాస్య అటు పోట్ల కారణంగా సముద్రంలో అతిపెద్ద కెరటాలు ఏర్పడుతాయనే సంగతి తెలిసిందే. రెండు సముద్రాల మధ్యలో ఉన్న సూయజ్ కాల్వలో ఇలాంటి భారీ కెరటాలు ఏర్పడ్డాయి. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే రేఖపై ఉన్న సమయంలో పౌర్ణమి వస్తే..ఇలాంటి అలలు ఏర్పడుతాయని నాసా అధికారులు వెల్లడిస్తున్నారు.