Daily Meat Product: మన ఆకలి తీర్చడం కోసం రోజుకు ఎన్ని లక్షల జంతువులను వధిస్తున్నారో తెలుసా?

ప్రపంచంలోని మంచు, ఎడారి లేని భూమిలో దాదాపు సగం వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నారు. ఇక మాంసం, పాల ఉత్పత్తి కోసం మొత్తం ప్రపంచ భూ వినియోగంలో 37 మిలియన్ చదరపు కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది అమెరికాతో సమానం.

Daily Meat Product: మన ఆకలి తీర్చడం కోసం రోజుకు ఎన్ని లక్షల జంతువులను వధిస్తున్నారో తెలుసా?

Daily Meat Product: ఉత్తర భారతంలో శాఖాహారుల కాస్త ప్రబలంగానే ఉండొచ్చు కానీ, దక్షిణ భారతంలో అయిత ముక్క లేనిదే ముద్దదిగదు అన్నట్లు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా 80 శాతం మంది మాంసాహారులు ఉన్నారు. ప్రపంచంలో ఎక్కువగా జరుగుతున్న వ్యాపారాల్లో మాంసం వ్యాపారం కూడా ఒకటి. ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నానుకుంటున్నారా? తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో మనుషులు ఎంత మాంసం తింటున్నారో లెక్కించారు. అంతే కాదండోయ్.. దాని కోసం ఎన్ని ఆవులు, మేకలు, కోళ్లు, చేపలు మాంసపు ముద్దలు అవుతున్నారో కూడా వెల్లడించారు.

రోజుకి 10 లక్షల కిలోల మాంసం వినియోగం అవుతోందట. వాస్తవానికి ఇలాంటి నంబర్లు చెప్తే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. అదే ఎన్ని జంతువులను వధిస్తున్నారో చెబితే మరింత సులభంగా ఉంటుంది. అందుకే మీకోసం ఆ సంఖ్యను కూడా చెప్తున్నాం. ప్రతిరోజూ దాదాపు 9,00,000 ఆవులు వధించబడుతున్నాయట. ప్రతి ఆవు 2 మీటర్ల పొడవు ఉండి, అవన్నీ ఒకదానికొకటి సరిగ్గా నడిస్తే, ఈ ఆవుల శ్రేణి 1800 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది.

London Bridge : తెరుచుకున్న లండన్ బ్రిడ్జ్, ట్రాఫిక్ జామ్ సమస్యలోనూ అద్భుతాన్ని ఆస్వాదించిన నగరవాసులు

ఇందులో కోళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ప్రతిరోజూ 202 మిలియన్ కోళ్లు అంటే మన సంఖ్యలో చెప్పాలంటే.. 20 కోట్ల కోళ్లను వధిస్తున్నారు. ప్రతి నిమిషానికి 1,40,000 కోళ్లు వధించబడుతున్నాయట. అలాగే 38 లక్షల పందులు, 1.18 కోట్ల బాతులు, 17 లక్షల గొర్రెలు, 14 లక్షల మేకలు ప్రతిరోజు వధకు గురవుతున్నాయి. ఇక ఈ వరుసలో చేపల సంఖ్య అయితే లెక్కకు కూడా అందకుండా ఉందట. కోళ్ల కంటే కొన్ని ఎక్కవ రెట్లే చేపలు వధించబడుతున్నట్లు చెప్పారు. అయితే కచ్చితమైన సంఖ్యేదీ చెప్పలేదు. జంతువులను వధించడం వల్ల అవి బాధలు పడతాయని మీరు విశ్వసిస్తే, ఆ హింసను నైతిక ప్రాముఖ్యతన కొలిస్తే.. ఈ వాస్తవికత నైతిక స్థాయి అపారమైనది. బహుశా దాన్ని ఊహించడం కూడా కష్టమే.

ఎన్ని వ్యవసాయ జంతువులు కబేళాలకు వెళ్లడం ఒకటైతే, పెంపకం సమయంలో కూడా అవి అనేక రకాల బాధల్ని అనుభవిస్తున్నాయని సర్వేలో పేర్కొన్నారు. ప్రపంచంలోని అత్యధిక వ్యవసాయ జంతువులు దుర్భరమైన పరిస్థితుల్లో పెరుగుతున్నాయట. పందులు ఇరుకైన, ఒత్తిడితో కూడిన పరిస్థితులలో, దీర్ఘకాలిక అసౌకర్యం, బాధలలో జీవితాన్ని గడుపుతాయి. ఆవులు తమ దూడలను మానవ వినియోగం కోసం పాలను ఉత్పత్తి చేయడానికి వెళ్తాయి. ఈ పద్ధతిలో తల్లి, దూడ బంధాలు చెరిగిపోతాయి. చాలా జంతువులను మత్తుమందు లేకుండా కాస్ట్రేట్ చేస్తారు. కోళ్లు అయితే ఇక చెప్పనవసరమే లేదు. నొప్పితో కదలడానికి కూడా లేకుండా కోసేస్తారు.

iPhone 15 Pro Models Sale : భారత్ సహా 20కి పైగా దేశాల్లో ఐఫోన్ 15 ప్రో మోడల్స్ సేల్.. విదేశాల్లో ఉన్నా ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

మాంసం వినియోగం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిసిందే. అయితే మాంసం వినియోగాన్ని తగ్గించడం వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. మాంసం ఉత్పత్తి పర్యావరణం, వన్యప్రాణులు, మానవ ఆరోగ్యంపై అనేక ప్రతికూల ప్రభావాలను చూపిస్తుందట. వీటితో పాటు మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు. మాంసం తగ్గించడం వల్ల వ్యవసాయం కోసం తక్కువ భూ వినియోగం అవుతుంది. దీని వల్ల ఎక్కువ జీవవైవిధ్యం పెరుగుతుంది. వాస్తవానికి జీవవైవిధ్య నష్టానికి వ్యవసాయం ప్రధాన కారణంగా ఉంది. ప్రపంచంలోని మంచు, ఎడారి లేని భూమిలో దాదాపు సగం వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నారు. ఇక మాంసం, పాల ఉత్పత్తి కోసం మొత్తం ప్రపంచ భూ వినియోగంలో 37 మిలియన్ చదరపు కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది అమెరికాతో సమానం.