కరోనాతో ఉద్యోగం పోయింది..కానీ..రూ. 31 కోట్ల లాటరీ గెలుచుకున్న యంగ్ ఫాదర్

  • Published By: madhu ,Published On : July 31, 2020 / 07:02 AM IST
కరోనాతో ఉద్యోగం పోయింది..కానీ..రూ. 31 కోట్ల లాటరీ గెలుచుకున్న యంగ్ ఫాదర్

కరోనా రాకాసి వల్ల ఎన్నో జీవితాలు అస్తవ్యస్థమయ్యాయి. ఉద్యోగాలు పోవడంతో కూలీలుగా మారిపోతున్నారు. ఇలాగే..ఓ యంగ్ ఫాదర్ కు జరిగింది. కానీ లాటరీ రూపంలో అదృష్టం తన్నుకొచ్చింది. ఏకంగా రూ. 31 కోట్ల లాటరీ గెలుచుకున్నాడు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.



ఓ యంగ్ ఫాదర్ సెక్యూర్టీ గార్డుగా (Armadal In perth south Eastern Outskirts) పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, కుమార్తె ఉన్నారు. కానీ కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో ఉద్యోగం పోయింది. దీంతో ఏమి చేయాలో అర్థం కాలేదు. మూడేళ్ల కుమార్తె కోసం కిరాణ సరుకులు కొంటున్నాడు. తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాడు.

Oz Lotto’s లాటరీ టికెట్ కొన్నాడు. అనంతరం న్యూస్ ఎజెంట్ ద్వారా వివరాలు కనుక్కొన్నట్లు, చివరకు తాను విజేతగా తెలుసుకున్నానని తెలిపారు. ఇంటికి వెళ్లి..తన కూతురును కౌగిలించుకున్నాన్నారు. Oz Lotto’s లాటరీ గురించి వార్తలను వింటానని, కానీ తాను విజేత అవుతానని కలలో కూడా ఊహించుకోలేదన్నారు.



తాను కాలేజీకి వెళ్లి..కామర్స్ డిగ్రీ పూర్తి చేస్తానని, అమ్మకు కొత్త కారు, కొత్త ఇల్లును కొంటానన్నారు. పెర్త్ లోని దక్షిణ కన్నింగ్ వేల్ న్యూస్ ఎజెన్సీలో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే డబ్బుతో ఏమి చేయాలనే దానిపై ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇల్లు కొనడానికి డబ్బు కోసం కష్టపడుతున్నాడని, ప్రస్తుతం వచ్చిన డబ్బుతో ఎలాంటి కష్టం లేకుండానే..ఇల్లు కొనబోతున్నాడని ఓ వ్యక్తి వెల్లడించాడు.

Oz Lotto’s లాటరీ డ్రాలో ఒకరు విజేతగా నిలిచారని $ 5.8 మిలియన్లతో ఇంటికి వెళుతాడని, తమపై విశ్వాసం ఉంచినందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు న్యూస్ ఏజెంట్ వెల్లడించింది. లాటరీ వెస్ట్ టికెట్ల నుంచి సేకరించిన లాభాలన్నీ…కోవిడ్ -19 రిలీఫ్ ఫండ్ లోకి వెళుతున్నాయన్నారు.