China Viral Video : ఎండ వేడి తట్టుకోలేక ఫ్రిజ్‌లో కూర్చున్న యువకుడు
ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. చైనాలో సైతం ఎండలు మండిపోతుండటంతో జనం విలవిలాడుతున్నారు. ఎండ వేడి తట్టుకోలేక ఓ యువకుడు ఫ్రిజ్‌లో కూర్చున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

China Viral Video
China Viral Video : చైనాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండ వేడిని జనం తట్టుకోలేకపోతున్నారు. చల్లదనం కోసం ఓ యువకుడు ఫ్రిజ్‌లో కూర్చున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
China : భూమి పుట్టుక, మార్పులను తెలుసుకునేందుకు.. చైనాలో భూమి లోపలికి 10 కిలోమీటర్ల లోతుగా బోర్ వెల్
చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌లో ఉష్ణోగ్రత 39°C కి చేరడంతో జనం విలవిలలాడుతున్నారు. ఓ యువకుడు రిఫ్రిజిరేటర్‌లో స్టూలు వేసుకుని కూర్చున్న వీడియో వైరల్ అవుతోంది. అతని పక్కనే రకరకాల పానీయాలు కనిపిస్తున్నాయి. ఫ్రిజ్‌లో కూర్చుని అతను సెల్ ఫోన్ చూసుకోవడం విశేషం. మధ్యలో కాలుతో ఫ్రిజ్ డోర్ తెరిచి చూస్తాడు. ఇక ఈ వీడియో చూసిన వారికి బహుశా ఇంట్లో ఏసీ లేకపోవడం.. లేదంటే అది పనిచేయకపోవడం జరిగి ఉండాలనే అనుమానాలు తలెత్తాయి. ఏది ఏమైనా ఇలాంటి ఫీట్లు చేయడం ప్రమాదకరం అని నెటిజన్లు సూచిస్తున్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు ఎదుర్కోవడానికి జనం ఐస్ ప్యాక్‌లు, చల్లటి పుచ్చకాయ రసం, ఐస్డ్ టీ వంటి పానీయాలపై ఆధారపడుతున్నారు.
Diabetes Oral Insulin : మధుమేహానికి ఓరల్ ఇన్సులిన్.. ప్రపంచంలోనే తొలిసారి చైనాలో
గ్వాంగ్‌డాంగ్‌లో కొద్దిరోజులుగా వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పెరగడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూన్ నెలలో కూడా ఇదే పరిస్థితి కనిపించినా త్వరలోనే ఈ ప్రాంతంలో వర్షాలు పడతాయని అక్కడ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.