Buried Alive: రెండ్రోజుల పాటు సమాధిలో యూట్యూబర్.. 50గంటల పాటు ప్రాణాలతో వీడియో

పాపులర్ పర్సన్.. యూట్యూబర్ మరో కొత్త ఫీట్ చేశాడు. నోరెళ్లబెట్టి ఔరా అనిపించేలా ఫీట్లు చేసే..

Buried Alive: రెండ్రోజుల పాటు సమాధిలో యూట్యూబర్.. 50గంటల పాటు ప్రాణాలతో వీడియో

Buried Alive

Buried Alive: పాపులర్ పర్సన్.. యూట్యూబర్ మరో కొత్త ఫీట్ చేశాడు. నోరెళ్లబెట్టి ఔరా అనిపించేలా ఫీట్లు చేసే జిమ్మీ డొనాల్డ్ సన్.. ఈ సారి చేసిన ప్రయోగం మాత్రం వెన్నులో వణుకుపుట్టేలా ఉంది. తాను చేసిన వీడియోలకు దాదాపు 100మిలియన్ వరకూ వ్యూస్ వచ్చినవి ఉన్నాయి. కనీసం 30మిలియన్ కంటే తక్కువ వ్యూస్ లేని జిమ్మీ రీసెంట్ ఎక్సపరిమెంట్ గురించి మీరు తెలుసుకోండి.

మిస్టర్ బీస్ట్ బర్గర్స్ అనే ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ఓపెన్ చేశాడు జమ్మీ. అతని కొత్త వెంచర్ లో తినేవారికి క్యాష్, ఐప్యాడ్ లు, ఎయిర్ పాడ్స్ ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా డీలర్ షిప్ నుంచి అన్ని కార్లు కొనేయడం, కుక్కలకు షెల్టర్ ఇప్పించడం, కొత్త వ్యక్తులకు కూడా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ ఏర్పాటు చేయడం వంటివి చేయడం మొదలుపెట్టాడు.

అదే ఆ రేంజ్ పర్ ఫార్మాన్స్ ఉంది కాబట్టే.. ఈ వ్యక్తి లేటెస్ట్ స్టంట్ ను 51మిలియన్ మంది ఆల్రెడీ చూసేశారు. దాదాపు 50గంటల పాటు భూమి లోపల ఉండిపోయాడు. తన అనుభవం మొత్తాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టేశాడు. తనకు తానే పాతి పెట్టించుకున్న ఈ వీడియో మొత్తం 12నిమిషాల నిడివితో ఉంది.

వీడియోలో అతణ్ని చూసి యూరిన్ కూడా బిగబట్టి ఆపుకుంటున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. తీరా బయటకు వచ్చిన తర్వాత క్లాస్ట్రోఫోబియా వచ్చేసింది. నా వెనుక భాగం చాలా నొప్పిగా అనిపిస్తుంది. క్లాస్ట్రోఫోబిక్ గా ఫీల్ అవుతున్నా. నాకు బోరింగ్ గా అనిపిస్తుంది. ఇంకా దుర్వాసన కూడా వస్తుందని వీడియోలో చెప్పుకొచ్చాడు.