ఆన్ లైన్ లో పాఠాలు : యాప్ Zoom లో అశ్లీల సీన్స్..షాక్ తిన్న టీచర్లు, స్టూడెంట్స్

  • Published By: madhu ,Published On : April 11, 2020 / 06:02 AM IST
ఆన్ లైన్ లో పాఠాలు : యాప్ Zoom లో అశ్లీల సీన్స్..షాక్ తిన్న టీచర్లు, స్టూడెంట్స్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఎన్నో దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. ఆఫీసులు, కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు మూత పడ్డాయి. ఇందులో పాఠశాలలు, స్కూల్స్ కూడా ఉన్నాయి. విద్యా సంవత్సరం ఆలస్యం అవుతుండడంతో ఆన్ లైన్ పాఠాలపై పలు స్కూల్స్ దృష్టి పెట్టాయి. విద్యార్థులు ఎంచక్కా ఇళ్లలో నుంచే పాఠాలు నేర్చుకుంటున్నారు.

కానీ ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆన్ లైన్ పాఠాలు చెబుతుండగా అశ్లీల దృశ్యాలు కనిపించడంతో అందరూ షాకింగ్  గురయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న యాప్ జూమ్ ను బహిష్కరించింది. ఈ ఘటన సింగపూర్ లో చోటు చేసుకుంది. 

కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో పాఠశాలలను మూసివేస్తున్నట్లు సింగపూర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ లో ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారు. ఎప్పటిలాగానే విద్యార్థులకు క్లాసులు చెబుతున్నారు. అకస్మాత్తుగా తెరపై అసభ్యకరమైన చిత్రాలు ప్రత్యక్షమయ్యాయయి. దీంతో షాక్ కు గురయ్యారు. అవాక్కైన టీచర్లు వెంటనే క్లాసులను నిలిపివేశారు.

తాము దీనిపై దర్యాప్తు చేయడం జరుగుతోందని, అవసరమయితే..పోలీసు కేసు నమోదు చేస్తామని విద్యాశాఖ వెల్లడిస్తోంది. భద్రతా లోపాలను సవరించే వరకు ఉపాధ్యాయులెవరూ జూమ్ అప్లికేషన్ ను వాడొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఘటనపై తీవ్రంగా చింతిస్తున్నామని జూమ్ సంస్థ వెల్లడించింది. భద్రతను పెంచేందుకు యాప్ లో డీఫాల్ట్ సెట్టింగ్ లు మార్చడం జరిగిందని, ఆన్ లైన్ తరగతుల నిర్వాహణకు ప్రత్యేక సూచనలు చేయడం జరిగిందని తెలిపింది.(సాయం అడిగితే ఇండియాకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా: రఘురామ్ రాజన్ )

అసలు ఆన్ లైన్ క్లాసులోకి హ్యాకర్లు ఎలా ప్రవేశించారనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. జామ్ మీటింగ్స్ కు ఓ యూజర్ ఐడీ ఉంటుందని, సెక్యూర్టీ సెట్టింగ్స్ సరిగ్గా లేకుంటే..గుర్తు తెలియని వ్యక్తులు అందులో ప్రవేశించే వీలు ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు.