వాళ్లంతా రిటైర్ అవుతున్నా అనుకున్నారు: ఎంఎస్ ధోనీ

వాళ్లంతా రిటైర్ అవుతున్నా అనుకున్నారు: ఎంఎస్ ధోనీ

MS Dhoni: IPL 2020 జరుగుతుండగా జోస్ బట్లర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్లంత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నెం.7 జెర్సీపై సంతకాలు తీసుకున్నారు. ఇది చూసి దాదాపు అభిమానులు కూడా ధోనీ రిటైర్ అయిపోతాడని భావించి.. రిటైర్ అవ్వొద్దంటూ కోరారు. దీనిపై ధోనీ పర్సనల్‌గా రెస్పాండ్ అయ్యారు.

వరుస పరాజయాల అనంతరం ధోనీ సేన చివర్లో పుంజుకుంది. పంజాబ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌ను కూడా విజయంతో ముగించుకున్నప్పటికీ ఇంటి బాటపట్టక తప్పలేదు. ఇదిలా ఉంటే టాస్ తర్వాత కామెంటేటర్ మాట్లాడుతూ.. ఐపీఎల్ లో ఇదే చివరి మ్యాచ్ ఆ అని అడిగిన ప్రశ్నకు కచ్చితంగా కాదు అని బదులిచ్చి గుడ్ న్యూస్ చెప్పాడు.



ధోనీని టీజ్ చేస్తూ కామెంటేటర్ హర్షా భోగ్లే.. ‘నీ దగ్గర ఇంకా జెర్సీలు ఉన్నాయనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ నిన్నే చూస్తున్నారు’ అని షేక్ జాయెద్ స్టేడియంలో మ్యాచ్ జరిగిన అనంతరం భోగ్లే అన్నాడు. దానికి నవ్వుతూ రిప్లై ఇచ్చిన ధోనీ.. వాళ్లంతా నేను రిటైర్ అవుతున్నానని అనుకుంటున్నారేమో అని రిప్లై ఇచ్చాడు.
https://10tv.in/ipl-2020-rr-vs-mi-hardik-pandya-takes-a-knee-in-solidarity-with-black-lives-matter-movement/
‘నీకు తెలుసా. వాళ్లంతా నేను రిటైర్ అవుతున్నా అనుకోవచ్చు. ఇంటర్నేషనల్ క్రికెట్ తో పాటు ఆ షార్టెస్ట్ ఫార్మాట్ నుంచి కూడా తప్పుకుంటానని అనుకుని ఉండొచ్చు’ అని రెస్పాన్స్ ఇచ్చాడు. థ్యాంక్స్ టు ఎంఎస్ ధోనీ అని రోజు మొత్తం ట్రెండ్ అవుతున్న పదానికి కచ్చితంగా కాదని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు ధోనీ.




కొద్ది నెలల్లో జరిగే ఐపీఎల్ కు తాము రెడీ అవుతున్నట్లు ధోనీ చెప్పాడు. దాంతో పాటుగా లాక్‌డౌన్ కారణంగా ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగింది. ఈ సారికి చాలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంది’ అని ధోనీ కన్‌క్లూజన్ ఇచ్చాడు.

ఐపీఎల్ 2020లో 14గేమ్స్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ ఆరు మాత్రమే గెలిచి ఏడో స్థానంలో నిలిచింది. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ప్లే ఆఫ్ కు రాకుండా చెన్నై నిష్క్రమిస్తుంది.