IPL 2021: మ్యాచ్ గెలిచాడట.. జడేజా సెలబ్రేషన్ మామూలుగా లేదుగా

బ్యాట్ తోనే కాకుండా బౌలింగ్ చేసి, క్యాచ్ లు అందుకుని జట్టును...

IPL 2021: మ్యాచ్ గెలిచాడట.. జడేజా సెలబ్రేషన్ మామూలుగా లేదుగా

Ravindara Jadeja

IPL 2021: చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. బ్యాట్ తోనే కాకుండా బౌలింగ్ చేసి, క్యాచ్ లు అందుకుని జట్టును గెలిపించాడు. జోస్ బట్లర్ లాంటి పెద్ద వికెట్ ను తీయడమే కాకుండా నాలుగు క్యాచ్ లు అందుకుని బెస్ట్ ఫీల్డర్ అని ప్రూవ్ చేసుకున్నాడు మరోసారి.

ఇదంతా ఓకే.. మ్యాచ్ గెలిచిన వెంటనే జడేజా సెలబ్రేషన్ ఓ రేంజ్ లో ఉంది. గేమ్ అయిన వెంటనే జడేజా వైపే తిరిగిన కెమెరాలు వీడియోను రికార్డ్ చేశాయి. చేతి వేళ్లతో నాలుగు సిగ్నల్ చూపిస్తూ.. తాను 4క్యాచ్ లు అందుకున్నానని ఆ తర్వాత ఫోన్ సిగ్నల్ చూపిస్తూ ఉన్నాడు. దానిపై క్లారిటీ లేకపోయినా అభిమానులకు మాత్రం తెగ నచ్చేసింది.

ఆస్ట్రేలియా టూర్ లో ఉండగా బొటనవేలికి గాయం అవడంతో ఇంటర్నేషనల్ మ్యాచ్ లకు కాస్త గ్యాప్ ఇచ్చాడు జడేజా. దాని నుంచి రికవరీ అయ్యాక ఐపీఎల్ లోనే రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఫిట్ నెస్ లో ఏ మాత్రం తీసిపోలేదని పర్ ఫార్మాన్స్ లో చూపించాడు.

ఇక చెన్నై సూపర్ కింగ్స్.. రాజస్థాన్ రాయల్స్ పై మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. బుధవారం జరగనున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది.