బంగారం దాచిపెట్టాడని ఎయిర్‌పోర్టులో కృనాల్ పాండ్యాను ఆపేసిన అధికారులు

10TV Telugu News

Krunal Pandya: ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాను ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద అధికారులు అడ్డుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి తిరిగి వెళ్తున్న కృనాల్ నుంచి డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకి విలువైన వస్తువులతో పాటు, దాచి ఉంచిన బంగారం దొరికినట్లు సమాచారం.

IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్లో ముంబై ఇండియన్స్ కు ఆడిన కృనాల్ తిరుగుప్రయాణమయ్యాడు. ఈ సీజన్ ను గెలిచి ఐదోసారి టైటిల్ విజేతగా నిలిచింది ముంబై ఇండియన్స్. 2013, 2015, 2017, 2019లతో పాటు 2020టైటిల్ కూడా ముంబైకే దక్కింది.ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా ఇప్పటికీ ముంబై ఇండియన్స్ తరపున 71మ్యాచ్ లలో ఆడాడు. ఐపీఎల్ 2017లో రైజింగ్ సూపర్ జయంట్ ను ఓడించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.

ఈ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ అందుకోగా, ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ కగిసో రబాడ పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. 17మ్యాచ్ లలో 30వికెట్లు పడగొట్టాడు రబాడ. ముంబై ఇండియన్స్ ఫేసర్ బుమ్రా 27వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

10TV Telugu News