RR Vs PBKS IPL 2021 : రెచ్చిపోయిన రాహుల్.. పంజాబ్ పరుగుల వరద.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు పరుగుల వరద పారించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. భారీ స్కోర్ చేసింది. 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 రన్స్ చేసింది. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కెప్టెన్

RR Vs PBKS IPL 2021 : రెచ్చిపోయిన రాహుల్.. పంజాబ్ పరుగుల వరద.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్

Rr Vs Pbks Ipl

RR Vs PBKS IPL 2021 : ఐపీఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు పరుగుల వరద పారించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. భారీ స్కోర్ చేసింది. 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 రన్స్ చేసింది. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ముందుండి జట్టుని నడిపించాడు.

kl rahul

ఓపెనర్ గా బరిలోకి దిగిన రాహుల్.. చివరి వరకు క్రీజ్ లో ఉన్నాడు. ఫోర్లు, సిక్సులతో చెలరేగాడు. రాజస్తాన్ బౌలర్లను ఆడుకున్నాడు. 50 బంతుల్లోనే 91 పరుగులు చేశాడు. జస్ట్ లో సెంచరీ మిస్ అయ్యాడు. రాహుల్ ఇన్నింగ్స్ లో 5 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో గెలవాలంటే రాజస్తాన్ జట్టు 222 పరుగులు చేయాలి. ఈ మ్యాచ్ లో టాస్ గెల్చిన రాజస్తాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. రాజస్తాన్ బౌలర్లలో చేతర్ సకారియా 3వికెట్లు, క్రిస్ మోరిస్ 2 వికెట్లు తీశారు.

kl rahul

పంజాబ్ బ్యాటింగ్..
కేఎల్ రాహుల్(50 బంతుల్లో 91 పరుగులు-5 సిక్సులు, 7ఫోర్లు)
మయాంక్ అగర్వాల్(9 బంతుల్లో 14 పరుగులు-2ఫోర్లు)
క్రిస్ గేల్(28 బంతుల్లో 40 పరుగులు-2సిక్సులు,4ఫోర్లు)
దీపక్ హుడా(17 బంతుల్లో 41 పరుగులు-5సిక్సులు, 1ఫోర్)