IPL 2021: PBKS vs SRH : హమ్మయ్యా హైదరాబాద్ గెలిచింది..

IPL 2021: PBKS vs SRH : హమ్మయ్యా హైదరాబాద్ గెలిచింది..

Srh Vs Punjab

IPL 2021: PBKS vs SRH : సన్ రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది.  7 వికెట్ల తేడాతో పంజాబ్ పై గెలిచింది. 18.4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి సన్ రైజర్స్ 8 బంతులు మిగిలి ఉండగానే 121 పరుగులతో విజయం సాధించింది. డేవిడ్ వార్నర్ (37), జెన్నీ బెయిర్ స్టో (63 నాటౌట్) హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. విలియమ్సన్ (16 నాటౌట్)గా నిలిచాడు. పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని హైదరాబాద్ ఆటగాళ్లు అలవోకగా ఛేదించారు.

121 పరుగుల తక్కువ స్కోర్ ను చేధించడానికి హైదరాబాద్ పకడ్బందీ ప్లాన్ తోనే బ్యాటింగ్ చేసింది. విరోచితమైన ఆటకన్నా… ఎలాంటి ఇబ్బందులు లేకుండా గేమ్ ను గెల్వడానికే సన్ రైజర్స్ ప్రయత్నించారు. జానీతో 73 రన్స్ భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత వార్నర్ ఔట్ అయ్యాడు. ఇలాంటి లో స్కోరింగ్ పిచ్ లకు సరిపోయే విలియమ్సన్ తో కలసి బెయిర్ స్టో మిగిలిన పని పూర్తి చేశాడు.


2021 ఐపీఎల్ ల్లో నిలబడాలంటే గెల్చి తీరాల్సిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ బౌలర్లు మ్యాజిక్ చేశారు. పంజాబ్ బ్యాట్స్ మేన్ ని ముప్పతిప్పలు పెట్టారు. 120 రన్స్ కే లిమిట్ చేశారు. టాస్ గెల్చిన పంజాబ్… బ్యాటింగ్ ను ఎంచుకుంది. చేజింగ్ లో తడబడుతున్న హైదరాబాద్ ను మరోసారి దెబ్బతియాలనుకుంది. మ్యాచ్ మొదలైన తర్వాత పంజాబ్ ప్లాన్ రివర్స్. వరసపెట్టి వికెట్లు పడుతున్నాయి. భాగస్వామ్యం నిలబడుతోందనుకున్న ప్రతిసారీ హైదరాబాద్ బౌలర్లు దెబ్బతీస్తూనే ఉన్నారు. మొత్తం ఆరుగురు బౌల్ చేస్తే… ఐదుగురు వికెట్లు దక్కించుకున్నారు. ఖలీల్ మూడు వికెట్లతో దుమ్మురేపితే, అభిషేక్ శర్మ రెండు వికెట్లు, కౌల్, రషీద్, భువనేశ్వర్లు రన్ ఇవ్వడానికే మొహమాటపడ్డారు. ఇన్నింగ్స్ ను కంట్రోల్ చేశారు.

హైదరాబాద్ బౌలర్ల గతితప్పని బౌలింగ్ ధాటికి పంజాబ్ ఇన్నింగ్స్ లో 22 రన్సే హైయిస్ట్. ఐదురుగురు ఆటగాళ్లు రెండంకెల స్కోర్ చేసినా… ఎవ్వరూ 22 పరుగుల మించి చేయలేదు. మొదటి వికెట్ గా రాహూల్ పెవిలియన్ చేరిన తర్వాత… వరుసపెట్టి వికెట్లు పడుతూనే ఉన్నాయి. చివరకు 19.4 ఓవర్లలో పంజాబ్ జట్టు 120 పరుగులకు ఆలౌట్ అయింది.