Virat Kohli: నేను తీసుకున్నా.. ఇక మీ వంతు – విరాట్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లి కొవిడ్‌–19 వ్యాక్సిన్‌ తొలి డోస్‌ను వేయించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను పోస్టు చేస్తూ.. అభిమానులు కూడా వ్యాక్సిన్ ను వీలైనంత త్వరగా వేయించుకోవాలంటూ సూచించాడు. ఒకవైపు కరోనా విజృంభిస్తున్నా ఛాలెంజింగ్ గా..

Virat Kohli: నేను తీసుకున్నా.. ఇక మీ వంతు – విరాట్ కోహ్లీ

Virat Kohli

Virat Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లి కొవిడ్‌–19 వ్యాక్సిన్‌ తొలి డోస్‌ను వేయించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను పోస్టు చేస్తూ.. అభిమానులు కూడా వ్యాక్సిన్ ను వీలైనంత త్వరగా వేయించుకోవాలంటూ సూచించాడు. ఒకవైపు కరోనా విజృంభిస్తున్నా ఛాలెంజింగ్ గా నిర్వహించిన ఐపీఎల్ ఎట్టకేలకు వాయిదా పడింది.

దీంతో ఈ ఆర్సీబీ కెప్టెన్ .. సతీమణి అనుష్కతో కలిసి డొనేషనల్ కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. కోవిడ్‌పై పోరుకు ముందుగా తమ వంతుగా రూ. 2 కోట్లు దానం చేయడంతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విరుష్క దంపతుల చేసిన విజ్ఞప్తికి భారీ స్పందనే వచ్చింది.

దీనిని ప్రారంభించిన 24 గంటల్లోనే రూ. 3.6 కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ విషయాన్ని కోహ్లి స్వయంగా వెల్లడించాడు. దాదాపు అనుకున్న దాని కంటే త్వరగానే చేరుకున్నాం. అదే విధంగా కరోనాపై పోరాటంలో ముందుండి సేవలు అందిస్తున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ను హీరోలుగా అభివర్ణించి.. వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు.

ఇక వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించే క్రమంలో సోమవారం టీకా తొలి డోసు తీసుకున్నాడు. టీమిండియా ప్లేయర్లు శిఖర్‌ ధావన్, ఇషాంత్‌ శర్మలు కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు.