ShivSena: షిండే భారీ స్కాం, శివసేన కోసం ₹ 2,000 కోట్ల డీల్.. ఉద్ధవ్ వర్గం తీవ్ర ఆరోపణలు

తనకు మద్దతుగా మాతోశ్రీ(ఉద్ధవ్ నివాసం)కి భారీ సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన ర్యాలీలో ఉద్ధవ్ థాకరే పాల్గొన్నారు. ఈ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘‘ప్రధాని మోదీకి ఎన్నికల సంఘం బానిసగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు జరిగినట్లు గతంలో ఎప్పుడూ జరగేలేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్ థాకరే లాగే కారు రూఫ్ మీద నిలబడి ఉద్ధవ్ ప్రసంగించారు.

ShivSena: షిండే భారీ స్కాం, శివసేన కోసం ₹ 2,000 కోట్ల డీల్.. ఉద్ధవ్ వర్గం తీవ్ర ఆరోపణలు

₹ 2,000 Crore charge for Sena name, alleges Uddhav faction

ShivSena: శివసేనపై ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగింది. పార్టీ పేరు, ఎన్నికల గుర్తు కోల్పోయిన ఉద్ధవ్ థాకరే వర్గం.. విమర్శలు ఎక్కుపెడుతోంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘంపై భారతీయ జనతా పార్టీపై ఏక్‭నాత్ షిండేపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఎన్నికల సంఘం బానిసగా మారిందంటూ ఉద్ధవ్ థాకరే శనివారం ఆరోపణలు గుప్పించగా, ఆదివారం ఉద్ధవ్ వర్గంలోని సీనియర్ రాజకీయ నేత సంజయ్ రౌత్ మరో తీవ్ర ఆరోపణలు చేశారు. శివసేన పేరు కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ జరిగిందని, సుమారు 2,000 వేల కోట్ల రూపాయల డీల్ కుదిరిందని రౌత్ ఆరోపించారు.

Maharashtra: తన వెనకాల అమిత్ షా ఉన్నారట.. సీఎం షిండే ఆసక్తికర వ్యాఖ్యలు

ఇంత పెద్ద డీల్ 100 శాతం వాస్తవమని, పాలకవర్గానికి దగ్గరగా ఉండే ఒక బిల్డర్ తనతో ఈ సమాచారం పంచుకున్నాడని ఆదివారం విలేకర్లతో అన్నారు. ఈ విషయాన్ని అన్ని రుజువులతో తొందరలో వెల్లడిస్తానని రాజ్యసభ చైర్మన్ అయిన రౌత్ ఛాలెంజ్ విసిరారు. ‘‘నా దగ్గర కచ్చితమైన సమాచారం ఉంది. శివసేన పేరు, గుర్తు కోసం 2,000 కోట్ల రూపాయల డీల్ కుదిరింది. వందకు వంద శాతం ఇది కచ్చితమైన నంబర్, కచ్చితమైన సమాచారం. ఇంకా చాలా విషయాలు తొందరలోనే వెల్లడి అవుతాయి. భారతదేశ చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటివి జరగలేదు’’ అని రౌత్ అన్నారు. అయితే రౌత్ ఆరోపణలను షిండే శిబిరంలోని ఎమ్మెల్యే సదా సర్వాంకర్ తోసిపుచ్చారు. “సంజయ్ రౌత్ క్యాషియర్ కాదా?” అంటూ ప్రశ్నించారు.

Delhi Liquor Scam: విచారణకు హాజరుకాలేనన్న సిసోడియా.. సరేనన్న సీబీఐ

ఇక శనివారం తనకు మద్దతుగా మాతోశ్రీ(ఉద్ధవ్ నివాసం)కి భారీ సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన ర్యాలీలో ఉద్ధవ్ థాకరే పాల్గొన్నారు. ఈ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘‘ప్రధాని మోదీకి ఎన్నికల సంఘం బానిసగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు జరిగినట్లు గతంలో ఎప్పుడూ జరగేలేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్ థాకరే లాగే కారు రూఫ్ మీద నిలబడి ఉద్ధవ్ ప్రసంగించారు. ‘‘దొంగలు పార్టీని దొంగిలించారు. పార్టీ గుర్తును దొంగిలించారు. వారికి గుణపాఠం చెప్పాలి’’ అని తొందరలో జరగబోయే ముంబై మున్సిపల్ ఎన్నికలను (బీఎంసీ) ఉద్దేశించి ఉద్ధవ్ అన్నారు.

Gujarat: మాజీ సర్పండ్ మేనల్లుడి వివాహం.. గాల్లోకి రూ.లక్షల నోట్ల కట్టలు విసురుతూ సంబరాలు

ఎన్నికల సంఘం శుక్రవారం ఏకనాథ్ షిండే నేతృత్వంలోని వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తించి, 1996లో పార్టీ ఏర్పడ్డ నాటి నుంచి ఉన్న ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ను కేటాయించాలని ఆదేశించింది. మహారాష్ట్రలోని శివసేనలో తిరుగుబాటు జరిగిన ఎనిమిది నెలల హైడ్రామా అనంతరం ఏక్‌నాథ్ షిండే వేసిన దావాకు అనుకూలంగా ఎన్నికల సంఘం తీర్పు వెలువడడం గమనార్హం. ఈ మేరకే ఈసీఐ త్రిసభ్య కమిషన్‌ శుక్రవారం 78 పేజీల ఆదేశాల్లో తిరుగుబాటు తర్వాత ముఖ్యమంత్రి అయిన షిండేకు 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీ గెలిచిన ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, పార్టీ సాధించిన ఓట్లలో ఇది 76 శాతమని కమిషన్ పేర్కొంది. ఉద్ధవ్‌ వైపు 23.5శాతం మందే ఉన్నట్లు వెల్లడించింది.

Vande Bharat Express : నల్లగొండ మీదుగా తిరుపతికి వందేభారత్ ఎక్స్ ప్రెస్!

శివసేనలోని 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మందిని, 18 మంది ఎంపీల్లో 13 మందిని షిండే తన వైపుకు తిప్పుకుని ఉద్ధవ్ థాకరే మీద తిరుగుబావుటా ఎగరవేశారు. దీంతో మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం కొద్ది రోజులకే భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనూహ్యంగా ఎవరి అంచనాలకు కూడా అందకుండా ముఖ్యమంత్రిగా ఏక్‭‭నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేశారు.