Omicron Rajasthan : ఒమిక్రాన్ టెర్రర్, రాజస్థాన్‌‌లో కొత్తగా ఎన్ని కేసులో తెలుసా

రాజస్థాన్ రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయపెడుతోంది... ఒమిక్రాన్ వేగంగా వ్యాపించడంతో అన్ని రాష్ట్రాల్లో ఆందోళన పెరుగుతోంది.

Omicron Rajasthan : ఒమిక్రాన్ టెర్రర్, రాజస్థాన్‌‌లో కొత్తగా ఎన్ని కేసులో తెలుసా

Rajasthan omicron

Updated On : December 25, 2021 / 5:41 PM IST

Omicron Cases In India : దేశంలో ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 437కు చేరుకుంది. అత్యధికంగా మహారాష్ట్రలో 108 కేసులు నమోదైనట్టు కేంద్రం ప్రకటించింది. మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్‌లో ఒమిక్రాన్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా..రాజస్థాన్ రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయపెడుతోంది. ఒక్క రోజులోనే…21 ఒమిక్రాన్ కేసులు రికార్డయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 43కు చేరుకున్నాయి. ఒమిక్రాన్ వేగంగా వ్యాపించడంతో అన్ని రాష్ట్రాల్లో ఆందోళన పెరుగుతోంది.

Read More : Leopard attack pet dog: గేటు దూకి వచ్చి పెంపుడు కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత

రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిని కూడా ఒమిక్రాన్ వేరియంట్ వదిలిపెట్టడం లేదు… కేంద్రం చెబుతున్న లెక్కల ప్రకారం… ప్రతి పది మంది ఒమిక్రాన్ బాధితుల్లో తొమ్మిది మంది రెండు డోసుల టీకా తీసుకున్న వారే. టీకా తీసుకున్నంత మాత్రం ఒమిక్రాన్‌ నుంచి ప్రొటక్షన్ దొరుకుందన్న నమ్మకమైతే లేదు. కేవలం టీకా మాత్రమే వైరస్ నుంచి కాపాడదని.. మాస్క్‌లు ధరించడం… కోవిడ్ రూల్స్‌ను తూచ తప్పకుండా పాటించడం తప్పనిసరిని కేంద్రం చెబుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 70 శాతం ఒమిక్రాన్ బాధితులకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు బయటపడలేదు. 25 శాతం ప్రయాణికులకు ట్రావెల్ హిస్టరీ కూడా లేదు. దీంతో కమ్యూనిటీలోనే ఒమిక్రాన్ వేరియంట్ ఉండొచ్చని… కేంద్రం భావిస్తోంది.