No LPG subsidy: వంట గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ కట్.. ఇకపై ఉజ్వల పథక లబ్ధిదారులకే

గృహ వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్‌పై అందిస్తున్న రూ.200 సబ్సిడీని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఉజ్వల పథకం కింద సిలిండర్ పొందిన లబ్ధిదారులకు మాత్రమే ఇకపై సబ్సిడీ అందనుంది.

No LPG subsidy: వంట గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ కట్.. ఇకపై ఉజ్వల పథక లబ్ధిదారులకే

No Lpg Subsidy

No LPG subsidy: గృహ వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్‌పై అందిస్తున్న రూ.200 సబ్సిడీని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఉజ్వల పథకం కింద సిలిండర్ పొందిన లబ్ధిదారులకు మాత్రమే ఇకపై సబ్సిడీ అందనుంది. ఈ పథకం కింద సిలిండర్ పొందిన తొమ్మిది కొట్ల మంది పేద మహిళలకు మాత్రమే ఈ సబ్సిడీ వర్తిస్తుంది. మిగతా గృహ వినియోగదారులు మార్కెట్ ధర చెల్లించి వంట గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేంద్ర తాజా నిర్ణయంతో 21 కోట్ల మందికి సబ్సిడీ దూరమైనట్లే. ఈ విషయాన్ని ఆయిల్ సెక్రటరీ పంకజ్ జైన్ గురువారం వెల్లడించారు.

Vikram: ‘విక్రమ్’ బ్లాక్‌బస్టర్ అంటున్నతమిళ హీరో

ఉజ్వల యోజన పథకం కింద సిలిండర్ పొందిన వినియోగదారులకు ఏడాదికి 12 సిలిండర్లపై, రూ.200 చొప్పున సబ్సిడీ అందుతుంది. ఈ సబ్సిడీ లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. మిగతా వినియోగదారులు ఎప్పటికప్పుడు మార్కెట్ ధరకు అనుగుణంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. చమురుపై సబ్సిడీ ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం గతంలోనూ జరిగింది. 2010లో పెట్రోల్‌పై కేంద్రం సబ్సిడీని ఎత్తివేయగా, 2014లో డీజిల్‌పై సబ్సిడీని ఎత్తివేసింది. తాజాగా ఎల్పీజీ వంట గ్యాస్‌పై సబ్సిడీ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది మోదీ సర్కారు.