ఫాదర్స్ డే రోజున ఇచ్చే ఈ 5 టెక్ గిఫ్ట్స్ మీకోసం.. 

  • Published By: srihari ,Published On : June 16, 2020 / 11:14 AM IST
ఫాదర్స్ డే రోజున ఇచ్చే ఈ 5 టెక్ గిఫ్ట్స్ మీకోసం.. 

Updated On : June 16, 2020 / 11:14 AM IST

ఫాదర్స్ డే.. వస్తోంది.. మీ నాన్నకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా ఏయే గిఫ్ట్ లు కొంటే బాగుంటుందా? అని సెర్చ్ చేస్తున్నారా? అయితే ఈ ఏడాది ఫాదర్స్ డేకు మాత్రం టెక్ గిఫ్ట్‌లతో సర్ ప్రైజ్ చేయండి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టెక్ స్మార్ట్ గాడ్జెట్లను ఎంపిక చేసుకోండి.

షాపింగ్ చేసే ముందు మీ నాన్నకు నచ్చిన వస్తువులేంటో చూసి కొనేసుకోండి. హెడ్ ఫోన్ లు, వీడియో గేమ్‌లు లేదా స్మార్ట్ వాచ్ లు ఇలా ఎన్నో ఉంటాయి. ఫాదర్స్ డే రోజున మీ తండ్రికి ఇచ్చే ఎట్రాక్టివ్ 5 టెక్ గిప్ట్స్ మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన గిఫ్ట్ సెలెక్ట్ చేసుకుని ఫాదర్స్ డే రోజున మీ ఫాదర్ ను సర్ ప్రైజ్ చేయండి. ఇంతకీ ఆ 5 టెక్ గాడ్జెట్లు ఏంటో ఓసారి చూద్దాం… 

1. Lavatools Javelin Pro Duo ధర 53.99 డాలర్లు :
duo

లావాటూల్స్ జావెలిన్ ప్రో డుయో ఎలక్ట్రిక్ మీట్ థర్మామీటర్. దీనిపై మాంసాన్ని 2 నుంచి 3 సెకన్ల పాటు ఉడికించే టెంపరేచర్ తెలియజేస్తుంది. బ్యాక్‌లిట్, ఆటోమేటిక్ రొటేటింగ్ డిస్‌ప్లే, మోషన్ సెన్సార్ అంటే.. మీరు ప్రో డుయోను ఎంచుకోవడం ద్వారా ఆన్ చేయవచ్చు. రెండు చేతుల్లోనూ సులభంగా ఉపయోగించుకోవచ్చు. 4,000 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తోంది. మీరు బ్యాటరీలను మార్చడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ డివైజ్ వెనుకవైపు మ్యాగ్నిటిక్ ఉంటుంది. డుయోను ఫ్రిజ్‌కు అటాచ్ చేయొచ్చు. ఇది ఎల్లప్పుడూ చేతికి దగ్గరలోనే ఉంటుంది. 

2. Apple Watch Series 3 ప్రారంభ ధర 179 డాలర్లు :

Lavatools
ఆపిల్ ( AAPL ) మూడో జనరేషన్ వాచ్. అమెజాన్ లో 199 డాలర్లు లేదా 179 డాలర్లుగా లభ్యం అవుతోంది. మీరు GPS, ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫంక్షనాలిటీ, యాప్ కనెక్టివిటీ, ఆపిల్ మెసేజ్ ద్వారా టెక్స్ట్ పంపుకోవచ్చు. ప్రపంచంలోని అగ్రశ్రేణి స్మార్ట్‌వాచ్‌లలో ఇదొకటిగా చెప్పవచ్చు. మీ వాలెట్‌లో మీకు కొంత అదనపు నగదు లభిస్తే.. లేటెస్ట్ ఆపిల్ వాచ్, సిరీస్ 5, అమెజాన్‌లో 100 డాలర్లకు తక్కువకు అందిస్తోంది. దీని కొత్త ప్రారంభ ధర 299 డాలర్లుగా ఉంటుంది. 

3. Bose Noise Cancelling Headphones 700 ధర 299 డాలర్లు :
head phones

హెడ్ ఫోన్లు ఉంటే చాలు.. మంచి మ్యూజిక్ వింటూ కాలక్షేపం చేయొచ్చు. ఇలాంటి టెక్ గిఫ్ట్ ఫాదర్స్ డే రోజున మీ నాన్నకు ఇస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. సంగీతం విన్న ప్రతిసారీ మీరొచ్చిన గిఫ్ట్ గుర్తుచేసుకుంటుంటారు. ల్యాప్‌టాప్ మాగ్, టామ్స్ గైడ్‌లోని నిపుణుల అభిప్రాయం ప్రకారం.. Bose Noise Cancelling Headphones 700 ఓవర్ ది ఇయర్ హెడ్‌ఫోన్స్. 10 స్థాయిల యాక్టివ్ నాయిజ్ క్యాన్సిలేషన్, బోస్-క్వాలిటీ ఆడియో, అద్భుతమైన డిజైన్‌ను అందిస్తున్న 700 జత హెడ్‌ఫోన్‌ల హెక్ అమెజాన్ లో 100 డాలర్ల డిస్కౌంట్ అందిస్తోంది. ఒకవేళ 299 డాలర్లు చాలా ఖరీదైనది అంటే.. ఆపిల్ అందించే ఎయిర్‌పాడ్‌లను ఎంచుకోవచ్చు. కానీ, ఇందులో నాయిజ్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ ఉండదు. అమెజాన్‌లో వీటి ధర 159 డాలర్లు లేదా 129 డాలర్ల వద్ద లభ్యమవుతోంది. 

4. Roku Smart Soundbar ధర 149 డాలర్లు :
switch

డాడ్స్ హోమ్ థియేటర్ సెటప్‌లకు సౌండ్‌బార్లు ఎంతో బాగుంటాయి. రోకు ( ROKU ) రకమైన సౌండ్‌బార్ ఒకటి మార్కెట్లోకి వచ్చింది. 149 డాలర్ల నుంచి రోకు స్మార్ట్ సౌండ్‌బార్‌లో అద్భుతమైన ఫీచర్ల సౌండ్ కోసం నాలుగు 2.5-అంగుళాల ఆడియో డ్రైవర్లు, అలాగే బుల్ట్ ఇన్ రోకు ప్లేయర్ ఉన్నాయి. మార్కెట్లో ఏ టీవీ నుంచి అయినా మీరు సౌండ్ బార్ కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రపంచంలోని బెస్ట్ ఆడియోను అందించే టూ ఇన్ వన్ ప్యాకేజీగా చెప్పవచ్చు. స్మార్ట్ సౌండ్‌బార్ సోనోస్ బీమ్ క్వాలిటీతో పోల్చలేం.. అయితే ధర మాత్రం చౌకగానే పొందవచ్చు.

5. Nintendo Switch ధర 299 డాలర్లు :
switch

మీ తండ్రి గేమరా… అయితే నింటెండో ( NTDOY ) స్విచ్  ఫాదర్స్ డే గిఫ్ట్‌గా ఇవ్వండి. మొబైల్ కన్సోల్‌గా ఉపయోగించడం లేదా టీవీకి కనెక్ట్ చేయొచ్చు. స్విచ్ 299 డాలర్ల ఖర్చు అవుతుంది. Super Mario Odyssey, The Legend of Zelda: Breath of the Wild, Pokemon Sword, Pokemon Shield, Animal Crossing: New Horizons అది సరిపోకపోతే, నింటెండో స్విచ్ ఆన్‌లైన్, నింటెండో NES, సూపర్ NES కన్సోల్‌ల నుంచి గేమ్స్ యాక్సస్ చేసుకోవచ్చు. గిఫ్ట్ కోసం ఎక్కువ ఖర్చు చేయకూడదని భావిస్తే.. మీరు నింటెండో స్విచ్ లైట్‌ను 199 డాలర్లకు పొందొచ్చు. టీవీతో కనెక్ట్ చేయలేం. స్మాల్ డిస్ ప్లేతో పాటు అదే ఆటలకు యాక్సస్ చేసుకోవచ్చు. ట్రావెల్ సమయంలో కూడా వినియోగించడం చాలా ఈజీగా ఉంటుంది.