High Cholesterol : అధిక కొలెస్ట్రాల్ సమస్య గురించి కళ్లు, కాళ్ళు, నాలుకలో కనిపించే 5 సంకేతాలు !

అధిక కొలెస్ట్రాల్‌ను సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. అధిక కొలెస్ట్రాల్ వల్ల ధమనులలో ఏర్పడే ఫలకం కారణంగా స్ట్రోకులు , గుండెపోటు వంటి అత్యవసర సంఘటనలకు కారణం కావచ్చు. గుండె జబ్బులతోపాటు ఇతర సమస్యలను కూడా కలిగిస్తుంది.

High Cholesterol : అధిక కొలెస్ట్రాల్ సమస్య గురించి కళ్లు, కాళ్ళు, నాలుకలో కనిపించే 5 సంకేతాలు !

High Cholesterol

High Cholesterol : శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు మీ కాళ్లు, కళ్ళు మరియు నాలుక ద్వారా కొన్ని సంకేతాలు బహిర్గతమవుతాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. కొలెస్ట్రాల్ అనేది రక్తంలో కనిపించే ఒక మైనపు, కొవ్వు లాంటి పదార్ధం. దీనిని కాలేయం ఉత్పత్తి చేస్తుంది. ఇది కణాల తయారీలో లేదా నిర్మాణంలో సహాయపడుతుంది. విటమిన్లు మరియు ఇతర హార్మోన్లను తయారు చేస్తుంది.

READ ALSO : Benefits Of Cowpeas : రక్తంలో కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గించటంతోపాటు, హృదయ సంబంధిత సమస్యల నుండి రక్షించే బొబ్బర్లు !

అధిక కొలెస్ట్రాల్‌ను సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. అధిక కొలెస్ట్రాల్ వల్ల ధమనులలో ఏర్పడే ఫలకం కారణంగా స్ట్రోకులు , గుండెపోటు వంటి అత్యవసర సంఘటనలకు కారణం కావచ్చు. గుండె జబ్బులతోపాటు ఇతర సమస్యలను కూడా కలిగిస్తుంది. అధిక కొలెస్ట్రాల్‌ అన్నది జీవనశైలి అలవాట్లతో ముడిపడి ఉంది. అధిక మొత్తంలో కొవ్వును కలిగి ఉన్న ఆహారాలను తినడం వల్ల రక్తంలో (చెడు కొలెస్ట్రాల్) LDL స్థాయి పెరుగుతుంది. దీనిని అధిక కొలెస్ట్రాల్, హైపర్ కొలెస్టెరోలేమియా లేదా హైపర్లిపిడెమియా అని కూడా పిలుస్తారు.

అధిక కొలెస్ట్రాల్ ను సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

కళ్లు, కాళ్ళు , నాలుకలో కనిపించే లక్షణాలు ;

కళ్ళలో అధిక కొలెస్ట్రాల్ యొక్క లక్షణాలు ఒకటి కంటి చూపులో మార్పు. ఇది దృష్టిని అస్పష్టంగా చేస్తుంది. దృష్టిలో చీకటి గీతలు, మచ్చలు ఏర్పడేలా చేయటంతోపాటు కంటిలో నొప్పిని కలిగించవచ్చు. అధిక కొలెస్ట్రాల్ ఆర్కస్ సెనిలిస్ రూపంలో కంటిలో ఉంటుంది.

READ ALSO : Meal Maker : చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచే మీల్ మేకర్ !

కాళ్లు మరియు పాదాల ధమనులలో కొలెస్ట్రాల్ ఏర్పడటం పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (PAD) అనే ప్రాణాంతక పరిస్థితికి దారి తీస్తుంది. PADకి సంబంధించిన సంకేతాలు , లక్షణాలు శారీరక వ్యాయామం సమయంలో దీర్ఘకాలిక కాలు నొప్పిగా ఉండవచ్చు. ఇతర సంకేతాలు ఉండవచ్చు. కాళ్లు, పాదాలలో భౌతిక మార్పులు, ముఖ్యంగా గోర్లు , చర్మంలో సంభవిస్తాయి.

అధిక కొలెస్ట్రాల్ వల్ల నాలుక కూడా ప్రభావితమవుతుంది. నాలుక ఉపరితలంపై చిన్న గడ్డలు పెద్దవిగా , రంగు మారినప్పుడు వింత ఆరోగ్య పరిస్థితి ఏర్పడుతుంది. ఈ లక్షణం కనిపిస్తే జాగ్రత్త వహించి , తక్షణ శ్రద్ధ అవసరం.

READ ALSO : Blood Sugar And Cholesterol : రక్తంలో షుగర్ లెవల్స్ , కొలెస్ట్రాల్ తగ్గాలంటే వీటిని తీసుకోండి !

అధిక కొలెస్ట్రాల్ సంకేతాలు, లక్షణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే, ఇది సైలెంట్ కిల్లర్ అయినందున, కొలెస్ట్రాల్‌ను పరీక్షించుకోవడం ముఖ్యం. ఏడాదికి ఒకసారైనా పరీక్షల ద్వారా కొలెస్ట్రాల్ స్దాయిల గురించి తెలుసుకోవాలి. ఇలా తెలుసుకోవటం వల్ల పరిస్ధితిని నియంత్రణలో ఉంచుకునేందుకు , రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది.