6 Wickets In 6 Balls : 6 బంతుల్లో 6 వికెట్లు.. క్రికెట్‌ చరిత్రలో అద్భుతం

క్రికెట్ చరిత్రలో ఇదో అరుదైన ఫీట్. క్రికెట్ చరిత్రలో ఇదో అద్భుతం. ఒకే ఓవర్‌లో వరుసగా 6 బంతుల్లో 6 వికెట్లు పడిపోయాయి.(6 Wickets In 6 Balls)

6 Wickets In 6 Balls : 6 బంతుల్లో 6 వికెట్లు.. క్రికెట్‌ చరిత్రలో అద్భుతం

6 Wickets In 6 Balls (1)

6 Wickets In 6 Balls : క్రికెట్ చరిత్రలో ఇదో అరుదైన ఫీట్. క్రికెట్ చరిత్రలో ఇదో అద్భుతం. ఒకే ఓవర్‌లో వరుసగా 6 బంతుల్లో 6 వికెట్లు పడిపోయాయి. నమ్మబుద్ధి కావడం లేదు కదూ.. కానీ.. ఇది నిజం.. ఈ అరుదైన ఫీట్ నేపాల్ ప్రో కప్ టీ20 చాంపియన్‌షిప్‌లో భాగంగా మలేషియా క్లబ్ ఎలెవన్ వర్సెస్ పుష్ స్పోర్ట్స్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్‌లో నమోదైంది. మలేషియా క్లబ్ ఎలెవన్ బౌలర్ విరన్ దీప్ సింగ్ దెబ్బకు పుష్ స్పోర్ట్స్ ఢిల్లీ 6 బంతుల్లో 6 కోల్పోయింది. అందులో ఒకటి రనౌట్.

నేపాల్‌ ప్రొ కప్‌ టీ20 చాంపియన్‌షిప్‌లో భాగంగా మలేషియా క్లబ్‌ ఎలెవెన్‌, పుష్‌ స్పోర్ట్స్‌ ఢిల్లీ జట్లు తలపడ్డాయి. మలేషియా బౌలర్ విరన్ దీప్‌ సింగ్‌ బౌలింగ్‌కు రాకముందు పుష్‌ స్పోర్ట్స్‌ ఢిల్లీ స్కోరు 131-3 గా ఉంది. అతని ఓవర్‌ పూర్తయ్యేసరికి 132-9గా మారిపోయింది. ఓవర్‌ తొలి బంతిని వైడ్‌ వేశాడు. ఆ తర్వాత రెండో బంతికి రనౌట్‌. ఆ తర్వాత మిగిలిన ఐదు బంతుల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇందులోనే విరన్ దీప్‌ సింగ్‌ హ్యాట్రిక్‌ నమోదు చేయడం విశేషం.(6 Wickets In 6 Balls)

Ambati Rayudu : గాల్లోనే సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్.. అంబటి అదరహో.. షాకింగ్ వీడియో..!

మొత్తంగా 2 ఓవర్లు వేసి 9 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి బెస్ట్‌ ప్రదర్శన నమోదు చేశాడు విరన్ సింగ్. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇంతకముందు ఆస్ట్రేలియాకు చెందిన అలెడ్‌ క్యారీ క్లబ్‌ క్రికెట్‌లో ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీశాడు.

133 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన మలేషియా క్లబ్ ఎలెవన్ జట్టు ఈజీగానే టార్గెట్ ని ఛేదించింది. 17.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేజ్ చేసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా విరన్ దీప్ సింగ్ ఎంపికయ్యాడు. బౌలింగ్ లో చెలరేగిన విరణ్ దీప్ సింగ్… అనంతరం బ్యాటింగ్‌లోనూ రెచ్చిపోయాడు. 19 బంతుల్లోనే 33 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉండటం విశేషం. కెప్టెన్ అహ్మద్ ఫైజ్ (39), మహ్మద్ అమీర్ (25) రాణించారు.

తొలుత బ్యాటింగ్ చేసిన పుష్ స్పోర్ట్స్ ఢిల్లీ జట్టు 19వ ఓవర్ నాటికి అంతా బాగానే ఉంది. మయాంక్ గుప్తా (33), అభిషేక్ అగర్వాల్ (26), కెప్టెన్ మృగాంక్ పాఠక్ (39) మంచి ఇన్నింగ్స్ ఆడారు. చివరి ఓవర్‌కు ముందు పాఠక్, ఇషాన్ పాండే (19) క్రీజులో ఉన్నారు. ఈ పరిస్థితిలో జట్టు 140 నుంచి 145 స్కోర్ చేయగలదని అంచనా వేశారు. కానీ ఆఖరి ఓవర్‌లో సీన్ మారిపోయింది.

IPL 2022: ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలిచేంతవరకూ పెళ్లి చేసుకోనంటోన్న యువతి

తొలి బంతి వైడ్‌ వచ్చింది. దీంతో పుష్ స్పోర్ట్స్ ఢిల్లీకి ఒక పరుగు లభించింది. తర్వాత బంతికే మృగాంక్ పాఠక్ ఔటయ్యాడు. రెండో బంతికి ఇషాన్ పాండే రనౌట్ అయ్యాడు. రెండో పరుగు తీసేందుకు ప్రయత్నించి అవుటయ్యాడు. మూడో బంతికి అనిందో నహరాయ్ బౌల్డ్ అయ్యాడు. నాలుగో బంతికి విశేష్ సరోహా బౌల్డ్ అయ్యాడు. ఐదో బంతికి జతిన్ సింఘాల్.. బౌలర్ విరన్ దీప్ సింగ్‌కి క్యాచ్ ఇచ్చాడు. అలా హ్యాట్రిక్‌ పూర్తయింది. ఆరో బంతికి విరన్ దీప్ సింగ్‌ బౌలింగ్‌లో స్పర్ష్‌ ఔటయ్యాడు. వీరణ్ దీప్ సింగ్ వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి అద్భుతం చేశాడు. అలాగే ఓవర్‌లోని అన్ని బంతుల్లో వికెట్ పడినట్లయింది.