Tiger Nageswararao : రవితేజ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కోసం.. ఏకంగా 7 కోట్లతో ఒక్క సెట్..

. రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' అనే సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. ఈ సినిమా కోసం 70వ దశకంలో ఉన్నట్టు అప్పటి స్టువర్టుపురంని....

Tiger Nageswararao : రవితేజ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కోసం.. ఏకంగా 7 కోట్లతో ఒక్క సెట్..

Tiger

 

Raviteja :  ఇటీవల రవితేజ తన స్పీడ్ పెంచుతున్నాడు. వరుస సినిమాలని అనౌన్స్ చేసి చాలా ఫాస్ట్ గా షూటింగ్స్ కూడా చేసేస్తున్నాడు. ఇక ఇటీవల అందరు హీరోలు పాన్ ఇండియా మీద పడ్డారు. దీంతో రవితేజ కూడా పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. కొత్త దర్శకుడు వంశీ తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు ఈ సినిమాని.

Suriya : మరోసారి సూర్య గొప్ప మనుసు.. షూటింగ్ కోసం కట్టినవి వారికే ఇచ్చేస్తా అంటూ..

70వ దశకంలో స్టువర్టుపురం రాబిన్‌ హుడ్‌గా పేరు తెచ్చుకున్న టైగర్‌ నాగేశ్వరరావు జీవిత కథతో బయోపిక్ గా తెరకెక్కుతుంది ఈ సినిమా. త్వరలోనే ఈ షూట్ మొదలవ్వనుంది. అయితే ఈ సినిమా కోసం 70వ దశకంలో ఉన్నట్టు అప్పటి స్టువర్టుపురంని తలపించేలా భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. శంషాబాద్‌ సమీపంలో 5ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 7కోట్లతో ఏకంగా ఓ ఊరినే కట్టేస్తున్నారు చిత్ర యూనిట్. ప్రొడక్షన్‌ డిజైనర్‌ అవినాష్‌ కొల్లా ఈ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సెట్ నిర్మాణం అయ్యాక ఇందులో షూట్ ని మొదలు పెట్టనున్నారు. సినిమాలోని కీలక ఎపిసోడ్లన్నీ ఇక్కడే తెరకెక్కిస్తారని సమాచారం. రవితేజ సినిమా కోసం ఒక్క సెట్ కి 7 కోట్లు ఖర్చుపెట్టారంటే అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.