BJP vs Nitish: బీజేపీతో విభేదాలకు కారణాలు ఇవే..!

మోదీ కేబినె‭ట్‭లో జేడీయూకి ఒకే ఒక స్థానాన్ని ఇవ్వడం నితీష్‭కు బాగా కోపం తెప్పించిందట. 2019లో ఏర్పాటైన మోదీ రెండవ ప్రభుత్వ మంత్రివర్గంలో జేడీయూ నుంచి ఒకరే ఉన్నారు. దీనికి ప్రతిగా బిహార్ మంత్రివర్గ విస్తరణలో తన పార్టీ వారిని ఎనిమిది మందిని నితీష్ తీసుకున్నారు. బీజేపీ నుంచి ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయకుండా వదిలేశారు. అయినప్పటికీ మోదీ తీరుపై ఆయన అసంతృప్తితోనే ఉన్నారట.

BJP vs Nitish: బీజేపీతో విభేదాలకు కారణాలు ఇవే..!

Lok Sabha Polls 2024

BJP vs Nitish: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. తమ తమ అవసరాల్ని బట్టి రాజకీయ మిత్రుత్వాలు, శత్రుత్వాలు ఏర్పడుతుంటాయి. మూడేళ్ల క్రితం శివసేన-బీజేపీ వ్యవహారంలో ఇది స్పష్టమైంది. పాతికేళ్ల స్నేహాన్ని వీడి ఇరు పార్టీలు వైరి పార్టీలుగా మారాయి. ఇలాంటి సంకేతాలే బిహార్‭లో కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీపై నితీష్ కుమార్ చాలా గుర్రుగా ఉన్నారట. రాష్ట్రంలో తాను ఎదగడానికి నితీష్‭ను బీజేపీ టార్గెట్ చేసిందనే విమర్శలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని నితీష్ చూస్తున్నారు. కొన్ని బలమైన కారణాల వల్ల ఎన్డీయే నుంచి బయటికి రావాలని నితీష్ చూస్తున్నట్లు తెలుస్తోంది.

బీజేపీతో విభేదాలకు గల కారణాలు

1. మొదటి ఫిర్యాదు బిహార్ అసెంబ్లీ స్పీకర్. బీజేపీకి చెందిన విజయ్ కుమార్ సిన్హా అసెంబ్లీ స్పీకర్‭గా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రిపై ప్రభుత్వంపై స్వయంగా స్పకరే పలుమార్లు విమర్శలు చేశారు. అలాగే సభలో ఇలాంటివి వచ్చినప్పుడు కట్టడీ చేయకుండా మరింత సమయం సభ్యులకు సమయం ఇచ్చారని నితీష్ ఫిర్యాదు. ఈయనను తొలగించాలని ఆయన పలుమార్లు కోరినప్పటికీ బీజేపీ పట్టించుకోలేదు.

2. ఇక రెండవది.. మోదీ కేబినె‭ట్‭లో జేడీయూకి ఒకే ఒక స్థానాన్ని ఇవ్వడం నితీష్‭కు బాగా కోపం తెప్పించిందట. 2019లో ఏర్పాటైన మోదీ రెండవ ప్రభుత్వ మంత్రివర్గంలో జేడీయూ నుంచి ఒకరే ఉన్నారు. దీనికి ప్రతిగా బిహార్ మంత్రివర్గ విస్తరణలో తన పార్టీ వారిని ఎనిమిది మందిని నితీష్ తీసుకున్నారు. బీజేపీ నుంచి ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయకుండా వదిలేశారు. అయినప్పటికీ మోదీ తీరుపై ఆయన అసంతృప్తితోనే ఉన్నారట.

3. మోదీ తరుచూ ప్రస్తావిస్తున్న జమిలి ఎన్నికల ప్రతిపానను నితీష్ వ్యతిరేకిస్తున్నారు. జాతీయ, రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి జరపాలన్న మోదీ సూచనను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇందులో ఎన్డీయే మిత్ర పక్షమైన నితీష్ కూడా ఉండడం గమనార్హం.

4. తన కేబినెట్ విస్తరణలో బీజేపీ నుంచి నేతలను తానే ఎంపిక చేయాలని నితీష్ అనుకున్నారు. కానీ, అమిత్ షా తాను ప్రతిపాదించిన వారిని మాత్రమే కేబినెట్‭లోకి తీసుకోవాలని ఒత్తిడి చేశారు. తన కేబినెట్ విస్తరణలో అమిత్ షా ప్రమేయంపై నితీష్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగే తనతో పాటు చాలా ఏళ్లుగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సుశీల్ కుమార్ మోదీని తప్పించడం కూడా నితీష్‭కు మింగుడు పడలేదు.

5. కేంద్ర ప్రభత్వంలో ఎన్డీయే మిత్రపక్షాలను బీజేపీ ఏమాత్రం లేక్కచేయకపోవడాన్ని నితీష్ ఓర్చుకోలేకపోతున్నారు. సుదీర్ఘకాలంగా బీజేపీతో స్నేహ చేస్తున్న వారిని సైతం బీజేపీ పక్కన పెట్టేయడం నితీష్‭ను ఆగ్రహానికి గురి చేస్తోందట.

6. ఇక 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకి వ్యతిరేకంగా ఎల్‭జేపీని బీజేపీనే రెచ్చగొట్టిందని, బీజేపీ అండతోనే కేవలం జేడీయూ పోటీ చేసిన స్థానాల్లో చిరాగ్ పోటీకి దిగి, నితీష్‭ను బలహీన పర్చారనే ప్రచారం అప్పటి నుంచి బలంగా వినిపిస్తోంది. దీనిపై కూడా నితీష్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు.

7. బీజేపీ నేతలు నితీష్‭పై తరుచూ విమర్శలు చేస్తుండడం, ప్రభుత్వ విధానాలను తప్పు పడుతుండడం ఆయనకు ఎంతమాత్రం రుచించట్లేదు. మిత్ర ధర్మాన్ని పాటించకుండా పార్టీ ప్రయోజనాల కోసం సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించడం నితీష్‭ సహనాన్ని దెబ్బ తీస్తోందని, అందుకే బీజేపీకి దూరంగా జరిగేందుకు నితీష్ నిర్ణయించుకున్నారని అంటున్నారు.

Venkaiah Retirementమనవి రెండు భావజాలాలు కానీ..: వెంకయ్య రిటైర్మెంట్‭పై ఖర్గే