Woman Beggar : ఆంజనేయస్వామి గుడికి రూ.20వేలు విరాళం ఇచ్చిన యాచకురాలు

తాను రోజు బిక్షం ఎత్తుకునే గుడిలోని దేవుడికే సుమారు రూ. 20 వేలు దానంగా ఇచ్చింది ఓ వృద్ధురాలు. కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమంగుళూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. భిక్షం ఎత్తుకోవడం వృత్తి

Woman Beggar :  ఆంజనేయస్వామి గుడికి రూ.20వేలు విరాళం ఇచ్చిన యాచకురాలు

Karnataka2

Woman Beggar తాను రోజు బిక్షం ఎత్తుకునే గుడిలోని దేవుడికే సుమారు రూ. 20 వేలు దానంగా ఇచ్చింది ఓ వృద్ధురాలు. కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమంగుళూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. భిక్షం ఎత్తుకోవడం వృత్తి అయినా..ఆలయ గోడపై తన పేరు కూడా వద్దని రూ.20వేలు ఇచ్చిన ఆ అవ్వ మనసు గొప్పదని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

చిక్కమంగుళూరు జిల్లాలోని కడూర్ లోని సాయిబాబా ఆలయం ఎదుట కెంపాజీ అనే 80 ఏళ్ల వృద్ధురాలు భిక్షాటన చేస్తూ జీవనం సాగించేది. సాయిబాబా ఆలయం పక్కనే ఉండే వినాయక కేష్ ఓనర్ భాస్కర్..ప్రతిరోజూ కెంపాజీకి టిఫిన్,మధ్యాహ్నా భోజనం ఉచితంగా అందించేవాడు.

అయితే ఈ నెల 15-17 తేదీల్లో అదే ప్రాంతంలో శ్రీ పాతాళంజనేయ స్వామి ఆలయం ప్రారంభోత్సం జరిగింది. ఈ సమయంలో శ్రీ పాతాళంజనేయ స్వామి గుడికి వెళ్లి తను దాచుకున్న సొమ్మును ముట్టజెప్పాలని అనుకుంది. అయితే మె ఆలయంలోకి ప్రవేశించేది చూసి కమిటీ సభ్యులు భిక్షం కోసం అని భావించి బయటకు వెళ్లమని చెప్పారు. కానీ ఆమె మాత్రం తాను దేవుడికి తన దగ్గర ఉన్న మొత్తం డబ్బులు ఇచ్చేయాలనుకుంటున్నట్లు అక్కడున్న వారికి తెలిపింది.

ఆలయంలో ఉన్న శ్రీ సంచారీ రామాంజనేయ స్వామి పీఠం హెడ్ దత్తు వాసుదేవ స్వామిని కలిసి తన దగ్గర ఉన్న రూ. 10వేలు అందించింది. ఆ మొత్తంతో ఆంజనేయ స్వామికి వెండి ఫేస్​ మాస్క్ కొనిమని చెప్పింది. అంతకుముందే ఆలయ నిర్మాణం కోసం కెంపాజీ రూ.10వేలు ఇచ్చింది. శ్రీ పాతాళంజనేయ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ మాట్లాడుతూ.. కెంపాజీ సంరక్షణ బాధ్యతను సమితి తీసుకుంటుందని తెలిపారు.

ALSO READ IIT Experts : కొండ చరియలు విరిగిపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి