IIT Experts : కొండ చరియలు విరిగిపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

భారీ వర్షాలకు తిరుమల ఘాట్‌ రోడ్‌లో కొండచరియలు విరిగి పడిన ప్రాంతాలను ఐఐటీ నిపుణులు పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు అలిపిరి, తిరుమలలో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.

10TV Telugu News

Tirumala Ghat Road : భారీ వర్షాలకు తిరుమల ఘాట్‌ రోడ్‌లో కొండచరియలు విరిగి పడిన ప్రాంతాలను ఐఐటీ నిపుణులు పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు అలిపిరి, తిరుమలలో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా.. కొండ చరియలు విరిగిపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అనే అంశంపై టీటీడీ అధికారులు ఐఐటీ సూచనలు కోరింది. దీంతో.. కొండచరియలు విరిగి పడిన ప్రాంతంలో మరమ్మతులు ఎలా చేపట్టాలి.. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే  అంశాలపై చెన్నై నుంచి వచ్చిన ఐఐటి నిపుణుల బృందం పరిశీలించింది.

Read More : Janasena : రాజధాని రైతుల పాదయాత్ర.. జనసేన కీలక నిర్ణయం

వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, గోడలు, ఘాట్ ప్రాంతాలను టీటీడీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఐఐటీ బృందానికి చూపించారు. పరిస్థితిని వివరించారు. అన్ని వివరాలు సేకరించిన ఐఐటీ సభ్యులు… త్వరలోనే టీటీడీకి సమగ్ర నివేదిక సమర్పించనున్నారు. దాని ఆధారంగా.. భవిష్యత్‌లో కొండచరియలు విరిగి పడకుండా పటిష్టమైన చర్యలను టీటీడీ చేపట్టనుంది. మరోవైపు… మొన్న కురిసిన వర్షాల నుంచే.. ఏపీలోని 4 జిల్లాలు ఇంకా కోలుకోవడం లేదు. ఇంతలోనే.. మరో వాన గండం అంటూ వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. దీంతో.. సీఎం జగన్ కలెక్టర్లతో రివ్యూ నిర్వహించారు. నివేదికలు పంపించాలని కోరారు. ఇక.. ఏపీలో సంభవించిన వరద నష్టంపై.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు లేఖలు రాశారు సీఎం జగన్. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు.. తక్షణమే వెయ్యి కోట్లు విడుదల చేయాలని కోరారు.

Read More : Arctic Sea : మంచులో చిక్కుకున్న 18 కార్గో షిప్‌లు..స్తంభించనున్న రవాణా!

కనీవినీ ఎరుగని వర్షాలు కడప జిల్లాను అతలాకుతలం చేశాయి. ఎన్నో కుటుంబాల్ని ఛిన్నాభిన్నం చేశాయి. భారీ వర్షాలతో 40మంది గల్లంతైతే ఇప్పటిదాకా 24 మృతదేహాలే దొరికాయి. మిగతా 16మంది ఏమయ్యారో తెలియదు. కుండపోత వానలకు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైపోయింది. భారీ వర్షాలు, వరదలపై.. కడప, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో.. సీఎం జగన్ రివ్యూ నిర్వహించారు. వరద ప్రభావిత జిల్లాల్లో జరుగుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు, 2 వేల రూపాయల పంపిణీతో పాటు మిగతా చర్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.