Arctic Sea : మంచులో చిక్కుకున్న 18 కార్గో షిప్‌లు..స్తంభించనున్న రవాణా!

ఐస్ బ్రేకర్లు షిప్‌లను చేరుకోవడానికి వారం రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు షిప్పింగ్ కంపెనీలు చెబుతున్నాయి. అప్పటి వరకు రవాణా వ్యవస్థ స్థంభించిపోతుందంటున్నారు.

Arctic Sea : మంచులో చిక్కుకున్న 18 కార్గో షిప్‌లు..స్తంభించనున్న రవాణా!

Ships

Cargo Ships Russia : రష్యా తీరంలో ఆర్కిటిక్ సముద్రంలో నీరు గడ్డకట్టడంతో 18 కార్గో షిప్‌ లు మంచులో చిక్కుకుపోయాయి. దీంతో జల రవాణా పూర్తిగా నిలిచిపోయింది. గత కొంత కాలంగా వాతావరణం అనూకూలంగా ఉండటంతో రష్యా ఉత్తర సముద్ర మార్గంలో కొన్నిప్రాంతాలకు కార్గో షిప్‌లను అనుమతించారు. అయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో సముద్రం గడ్డకట్టుకుపోయింది. రష్యా వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేయకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని షిప్పింగ్ కంపెనీలు ఆరోపిస్తున్నాయి.

Read More : Delhi : హైదరాబాద్‌కు వచ్చేసిన సీఎం కేసీఆర్

దాదాపు 30 సెం.మీ మందంలో మంచు పేరుకుపోవడంతో షిప్‌లు ముందుకు కదలడం కష్టతరంగా మారింది. ఐస్ బ్రేకర్లు షిప్‌లను చేరుకోవడానికి వారం రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు షిప్పింగ్ కంపెనీలు చెబుతున్నాయి. అప్పటి వరకు రవాణా వ్యవస్థ స్థంభించిపోతుందని, వాతావరణ మార్పులు జరిగితే తప్ప అంత త్వరగా పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం లేదంటున్నారు. ఈ షిప్‌లలో హాంకాంగ్, మార్షల్ దీవులకు సంబంధించిన షిప్‌లు కూడా ఉన్నాయని రష్యా అధికారులు చెబుతున్నారు.

Read More : Varanasi : వీధుల్లో మహిళ నివాసం..ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంది, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్!

షిప్‌లన్నీ వేరువేరు ప్రదేశాల్లో చిక్కుకుపోవడంతో రవాణాను పునరుద్ధరించడానికి మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. రష్యా  అధికారులు రెండు ఆయిల్ ట్యాంకర్లు, కార్గో షిప్‌లతో సహా చిక్కుకుపోయిన షిప్‌లను విడిపించేందుకు రెండు ఐస్ బ్రేకర్లను పంపించారు. వచ్చే నెలలోగా షిప్‌లను బయటకు తీసుకురావచ్చని భావిస్తున్నారు. రష్యా ఆర్కిటిక్ తీరంలో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు 4C వరకు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ సముద్రం గడ్డకట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.