Janasena : రాజధాని రైతుల పాదయాత్ర.. జనసేన కీలక నిర్ణయం

ఏపీకి ఒక్కటే రాజధాని ఉండాలని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ..

Janasena : రాజధాని రైతుల పాదయాత్ర.. జనసేన కీలక నిర్ణయం

Janasena

Janasena : ఏపీకి ఒక్కటే రాజధాని ఉండాలని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు పాదయాత్ర చేపట్టారు. రైతుల ఉద్యమానికి ప్రతిపక్షాలు ఇప్పటికే మద్దతు తెలిపాయి. ఇటీవలే బీజేపీ అగ్ర నాయకత్వం పాదయాత్రలో కూడా పాల్గొంది. ఇక తాజాగా జనసేన పార్టీ కీలక ప్రకటన చేసింది. రైతుల మహా పాదయాత్రకు మద్దతు తెలిపింది.

CM Jagan : వారందరికి కొత్త ఇళ్లు.. సీఎం జగన్ శుభవార్త

ఈ నెల 26న రాజధాని రైతుల పాదయాత్రలో జనసేన ముఖ్య నేతలు పాల్గొననున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటన చేసింది. నెల్లూరు జిల్లాలో రాజధాని రైతులను కలిసి జనసేన పీఏసీ (రాజకీయ వ్యవహారాల కమిటీ) ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సంఘీభావం తెలపనున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు… నెల్లూరు జిల్లా నార్త్‌ రాజుపాలెం దగ్గర పాదయాత్రలో నాదెండ్ల పాల్గొననున్నారు. ఇప్పటివరకు రాజధాని అమరావతికి మద్దతు తెలిపినా రైతుల పాదయాత్రలో జనసేన పాల్గొన లేదు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో అమరావతి రైతుల మహా పాదయాత్ర కొనసాగుతోంది. ఇక్కడే జనసేన నేత నాదెండ్ల మనోహర్ రైతులను కలిసి సంఘీభావం తెలపడంతో పాటు రైతులతో కలిసి పాదయాత్రలోనూ పాల్గొంటారని జనసేన తెలిపింది.

మూడు రాజధానుల ఏర్పాటుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడంతో మొదలైన రాజధాని అమరావతి ఉద్యమం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలని రాజధాని అమరావతి ప్రాంత రైతులు 700 రోజులకు పైగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, పంటలు పండే భూములను త్యాగం చేశామని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసం తాము త్యాగం చేస్తే జగన్ సర్కార్ మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని, ఏపీ రాజధానిగా అమరావతి నగరమే కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు.

రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు చేస్తున్న ఉద్యమంలో భాగంగా రాజధాని ప్రాంత రైతులు నిర్వహిస్తున్న మహా పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. వర్షాలు, వరదలతో అనేక ఆటంకాలు ఎదురవుతున్నా పాదయాత్రను కొనసాగిస్తున్నారు.

SBI కస్టమర్లకు ముఖ్య గమనిక.. వెంటనే ఆ పని చేయండి

ఏపీ రాజధాని పరిరక్షణ కోసం అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న మహా పాదయాత్రకు రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. గత 24 రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. అమరాతి పరిరక్షణే ధ్యేయంగా రాజధాని ప్రాంత రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట ఈ పాదయాత్రను ముందుకు సాగిస్తున్నారు.