Maglev Trains : వెయ్యి కిలోమీటర్లు రెండున్నర గంటలు..చైనా అత్యాధునిక మాగ్లెవ్ రైలు

చైనా మాగ్లెవ్ టెక్నాలజీ రైళ్ళపై అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. జపాన్, జర్మనీ దేశాలు ఇప్పటికే చైనాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది.

Maglev Trains : వెయ్యి కిలోమీటర్లు రెండున్నర గంటలు..చైనా అత్యాధునిక మాగ్లెవ్ రైలు

Train

Maglev Trains : ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కరోనా సంక్షోభంలో కూరుకుపోయి విలవిల లాడుతుంటే చైనా మాత్రం అత్యాధునిక టెక్నాలజీలను ఆవిష్కరిస్తూ పోటీ ప్రపంచంలో తమకెవరు సాటిలేరని నిరూపించుకుంటుంది. తాజాగా స్వదేశీ పరిజ్షానంతో నడిచే మాగ్లెవ్ టెక్నాలజీ రైలును ఆవిష్కరించింది. అయస్కాంత శక్తితో నడిచే ఈ మాగ్లెవ్ రైలు పట్టాలను తాకకుండా గాల్లో తెలుతూ మెరుపు వేగంతో దూసుకుపోతుంది. గంటకు 620 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణించనుంది.

అత్యధిక వేగంతో ప్రయాణించగలిగిన వాహనం ప్రపంచంలో ఇదొక్కటేనని చైనా గర్వంగా ప్రకటించుకుంది. రెండు దశబ్ధాలుగా మాగ్లెవ్ రైళ్ళపై చైనా ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే తేలికపాటి మాగ్లెవ్ రైళ్ళను నడుపుతున్న చైనా.., వాటికంటే అధిక వేగంతో దూసుకు పోగల కొత్త మాగ్లేవ్ రైలును ఆవిష్కరించింది. ఇది అందుబాటులోకి వస్తే అనేక నగరాలకు గంటల వ్యవధిలోనే చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.   చైనాలోని ప్రధాన నగరాలైన బీజింగ్ నుండి షాంఘైకు వెయ్యి కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దూరాన్ని కేవలం రెండున్నర గంటల్లో మాగ్లెవ్ రైలులో చేరుకోవచ్చు. ఇదే ప్రయాణం విమానంలో అయితే 3గంటలు పడుతుంది.

చైనా మాగ్లెవ్ టెక్నాలజీ రైళ్ళపై అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. జపాన్, జర్మనీ దేశాలు ఇప్పటికే చైనాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది. మరికొన్ని దేశాలు ఆసక్తిగా ఉన్నప్పటికీ మాగ్లెవ్ రైళ్ళకోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి ఉండటం కొంత వెనుకడుగు వేస్తున్నారు. షాంఘాయ్ లోని పుడాంగ్ ఎయిర్ పోర్టును ప్రస్తుతం దగ్గరలోని మరో నగరం వరకు ఈ మాగ్లెవ్ రైలును నడుపుతున్నారు. రానున్నరోజుల్లో చైనా వ్యాప్తంగా ఈ మాగ్లెవ్ రైళ్ళను నడిపేందుకు చైనా ప్రణాళికలు రూపొందిస్తుంది.